‘ముత్యాలమ్మ’ ఘటనకు నిరసనగా ర్యాలీ
పోలీసులపైకి రాళ్లు, చెప్పులు విసిరిన ఆందోళనకారులు.. పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు
రాంగోపాల్‌పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవా లయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి చెప్పు లు, రాళ్లు, కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో నలుగురు యువ కులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగింది. అలాగే ఆందోళనకారులు విసిరిన రాళ్లతో కొంత మంది పోలీసులకు స్వల్ప గాయా లయ్యాయి. ఈ నెల 14న కుమ్మరిగూడ ముత్యా లమ్మ దేవాలయంలో ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
దీన్ని నిరసిస్తూ శనివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవా లయం వద్ద నుంచి వేలాది మంది హిందువులు ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఆందోళనకా రులు నినాదాలతో హోరెత్తించారు. కొంతమంది మోండా మార్కెట్ వైపు, మరికొంత మంది కవాడిగూడ వైపు ర్యాలీగా వెళ్లారు. మోండా, ఆల్ఫా హోటల్ మీదుగా ముత్యాలమ్మ దేవాలయం వద్దకు ఆందోళన కారు లు చేరుకున్నారు. వేలాదిమంది ర్యాలీలో పాల్గొ నడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవాల యం పక్కనే మరో వర్గానికి చెందిన ప్రార్థన మందిరం కూడా ఉంది. ఆందోళనకారులు ఆ వైపు వెళ్లేందుకు వస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకు న్నారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయి చెప్పులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు విసరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
ఆలయాల రక్షణలో కాంగ్రెస్ విఫలం: ఛుగ్
సాక్షి, న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలను రక్షించడంలో, భక్తుల మనోభావాలను గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. శనివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు.
కేంద్ర మంత్రుల పరామర్శ
కంటోన్మెంట్: లాఠీచార్జిలో గాయపడిన పికెట్‌కు చెందిన గుడిపల్లి వెంకట్‌ను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించేందుకు వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని స్థానిక బీజేపీ నేతలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment