హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఆందోళన
ర్యాలీలను అడ్డుకొని లాఠీలు ఝళిపించిన పోలీసులు
చిక్కడపల్లి (హైదరాబాద్)/కరీంనగర్ టౌన్: మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని, జీఓ నంబర్ 29 రద్దు చే యాలని డిమాండ్ చేస్తూ గ్రూప్–1 అభ్యర్థులు శుక్రవారం మరోసారి నిరసనలకు దిగారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహిస్తూ రావడంతో నగరంలోని అశోక్‌నగర్, గాం«దీనగర్, ఆంధ్రా కేఫ్, జవహర్‌నగర్‌లలో రోడ్లు కిక్కిరిసిపోయాయి. భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే అభ్యర్థులను అదుపు చేయడం వారికి కష్టతరంగా మారింది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు సీతయ్య, రాంబాబు, ఎస్‌ఐలు, సిబ్బంది లాఠీలకు పనిచెప్పారు.
దీంతో విద్యార్థులు వీధుల్లోకి పరుగెత్తారు. పోలీసులు వారిని తరుముతూ వెళ్లి చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. కొందరు అభ్యర్థులు సమీపంలోని దుకాణాలు, బేకరీల్లోకి, చాయ్ దుకాణాల్లోకి వెళ్లగా, పోలీసులు వాటిల్లోకి సైతం వెళ్లి బయటకు లాక్కొచ్చి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పరుగెత్తకుండా మొండికేసి బైఠాయించిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. లాఠీచార్జిపై గాం«దీనగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంకు, ఆంధ్రాకేఫ్ సమీపంలో, ఆర్టీసీక్రాస్‌రోడ్డు, ఇందిరాపార్కు రోడ్డులో నిరుద్యోగ అభ్యర్థులు నిరసనకు దిగగా.. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ ఇతర నేతలు మద్దతు పలికారు. అయితే పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
న్యాయం జరిగేవరకు పోరాడతా: బండి సంజయ్
గ్రూప్–1 పరీక్షల రీ షెడ్యూల్‌కు పట్టుపడుతున్న అభ్యర్థులకు కేంద్రమంత్రి బండిసంజయ్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం పలువురు గ్రూప్–1 అ భ్యర్థులు కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బండిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవడంతో పాటు గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన తప్పిదాలను సవరించాలని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాడతానని హెచ్చరించారు.
పరీక్ష రీషెడ్యూల్ చేయాలి: డా.కె.లక్ష్మణ్
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని జీవో నంబర్ 29ని రద్దు చేయడంతో పాటు గ్రూప్–1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరించారు.
వాయిదా వేసేలా చూడండి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అభ్యర్థుల వినతి
గ్రూప్–1 మెయి న్స్ పరీక్షను వాయిదా వేసేలా, జీవో నంబర్ 29ను రద్దు చేసేలా చూ డాలని పలువురు అభ్యర్థులు శుక్రవారం గాం«దీనగర్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. తమకు న్యాయంచేయా లని విజ్ఞప్తి చేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్–1 ప్రశ్నపత్రాల లీకేజీల కా రణంగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లాఠీచార్జ్ దారుణం: కేటీఆర్
గ్రూప్– 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణమని, అరెస్ట్ చేసిన విద్యార్థులు, గ్రూప్ –1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే నిరుద్యోగులపై పోలీసులు జులుం చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అశోక్‌నగర్‌కు వచ్చి అడ్డగోలు హామీలు ఇచి్చన రాహుల్‌గాం«దీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత పత్తా లేకుండా పోవడం దుర్మార్గమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment