ఆలయ చరిత్ర తెలుసుకుంటున్న రష్యా దేశస్తులు
శ్రీముఖలింగం (జలుమూరు) : ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని రష్యా దేశస్తులు ఆదివారం దర్శించుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా ప్రసిద్ధ దేవాలయాలు, కట్టడాలు పరిశీలించి భారత ప్రభుత్వ అనుమతితో ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించనున్నట్లు రష్యా బృందం ప్రతినిధులు ఆంద్రీ, అరని, ఇరానీ, కిరే.పుతిన్ తెలిపారు. అనంతరం శ్రీముఖలింగం పరిధిలోని అన్ని దేవాలయాలను పరిశీలించారు. అలాగే ఆలయ అవరణలో ఉన్న శిల్పసంపదపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు వీరితో సెల్ఫీలు దిగారు. అర్చకులు శ్రీకృష్ణ ఆలయ చరిత్ర, కట్టడాలపై వివరించారు.