భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం
భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం
Published Wed, Nov 9 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
జంగారెడ్డిగూడెం రూరల్ :
జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రంలో ఉన్న ఉసిరిచెట్ట కింద దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త బృందాల భక్తులు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
’
Advertisement