MADDI TEMPLE
-
భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రంలో ఉన్న ఉసిరిచెట్ట కింద దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త బృందాల భక్తులు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ’ -
నేత్రపర్వం.. హనుమద్ కల్యాణం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సువర్చలా హనుమద్ కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పర్యవేక్షణలో అర్చకుల బృందం ఈ కల్యాణ తంతును వేదమంత్రాలతో నిర్వహించారు. ఇందుకూరి లీలారాణి, అరిగెల లీలా నాగకాశీ, విశ్వనాథం, నాగలక్ష్మి దంపతులు ఈ కల్యాణ పూజల్లో పాల్గొన్నారు. వార్షిక సప్తాహ పూజల్లో ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు, లీలారాణి దంపతులు పాల్గొని పూజలు చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. మంగళవారం ఒక్కరోజు ఆలయానికి రూ.1,41,400 ఆదాయం లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. స్వామివారిని హైదరాబాద్కు చెందిన ఇందు భారత్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మ¯ŒS కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కాకినాడ సుధా ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.రామకృష్ణలు దర్శించుకున్నారు.