నూతన సంవత్సరం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని వైష్ణో దేవి క్షేత్రంతో సహా హిమాచల్‌లోని పలు శక్తిపీఠాలను నందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతున్నారు. వైష్ణోదేవి ఆలయానికి ఇప్పటికే 50 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా. నూతన సంవత్సరం సందర్భంగా హిమాచల్‌లోని అన్ని శక్తిపీఠాలను పూలతో అందంగా అలంకరించారు.
జ్వాలాజీ, బజరేశ్వరి, చాముండ, నయన దేవి, చింతపూర్ణి క్షేత్రాలలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నయన దేవి క్షేత్రంలో నూతన సంవత్సర మేళా ప్రారంభమైంది. ఆలయ తలుపులు 22 గంటల పాటు తెరిచి ఉంచనున్నారు. కాంగ్రాలోని చాముండ దేవాలయం తలుపులు తెల్లవారుజామున 4:00 గంటలకే తెరిచారు. హిమాచల్‌లోని పలు హోటళ్లు ఇప్పటికే భక్తులతో నిండిపోయాయి. అదే సమయంలో మనాలికి 60 నుంచి 70 వేల మంది పర్యాటకులు తరలివచ్చారు. డిసెంబర్ 31 (ఈరోజు) సాయంత్రం నాటికి ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా.
మరోవైపు సిమ్లా ఇప్పటికే టూరిస్టులతో నిండిపోయింది. రోహ్‌తంగ్ పరిధిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలో ఆకాశం మేఘావృతమైంది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పట్నిటాప్, నత్తతోప్, పహల్గాం, గుల్‌మార్గ్, సోన్‌మార్గ్ తదితర పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హిమాచల్ సిద్ధమైంది. కసౌలి, చైల్, డల్హౌలీలు పర్యాటకులతో నిండిపోయాయి. ఖజ్జియార్‌లోని హోటళ్లలో 85 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. శనివారం సాయంత్రం నాటికే వందలాది మంది పర్యాటకులు డల్హౌసీ, ఖజ్జియార్‌కు చేరుకున్నారు.
క్రిస్మస్ సందర్భంగా దాదాపు ఐదు లక్షల మంది పర్యాటకులు హిమాచల్ చేరుకున్నారు. సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్, మనాలి మాల్ రోడ్‌లలో నూతన సంవత్సరానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం రెస్టారెంట్లు, హోటళ్లను 24 గంటలూ తెరిచే ఉంచనున్నారు. ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
ఇది కూడా చదవండి: అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
Comments
Please login to add a commentAdd a comment