ఆలయాల్లో నూతన సంవత్సర సందడి | Happy New Year 2025 Celebrations In Temples Across India, People Inclination Towards Spirituality, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో నూతన సంవత్సర సందడి

Published Wed, Jan 1 2025 7:16 AM | Last Updated on Wed, Jan 1 2025 9:25 AM

Happy New Year 2025 Celebrations and Fun People Inclination Towards Spirituality

ప్రపంచ వ్యాప్తంగా 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా  ప్రారంభమయ్యాయి. జనమంతా ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి ఉన్నప్పటికీ జనం అత్యంత ఉత్సాహంగా న్యూ ఇయర్‌ జోష్‌లో మునిగిపోయారు.

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హోటళ్లు, రెస్టారెంట్లు సందడిగా మారాయి. గడియారంలో 12 గంటలు చూపగానే జనమంతా పెద్ద ఎత్తున హ్యాపీ న్యూ ఇయర్‌(Happy New Year) అంటూ ఒకరికొకరు విష్‌ చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అటు జమ్ముకశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు జనమంతా నూతన సంవత్సర వేడుకల్లో తేలియాడుతున్నారు.  ఇదే సమయంలో చాలామంది నూతనసంవత్సరం వేళ  ఆలయాలను సందర్శిస్తూ భగవంతుని ఆశీర్వాదాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు అన్ని ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.
 

మహారాష్ట్రలోనూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముంబయిలోని మెరైన్‌డ్రైవ్‌(Marine Drive)లో బాణాసంచా కాల్చేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు పర్యాటకలు ఎంజాయ్‌ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా చేరుకున్నారు. ఒకరినొకరు విష్‌ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

కేరళలోని తిరువనంతపురంలో ప్రజలు బాణసంచా వెలిగించి నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.

గోవాలోని పనాజీలో జనం కేక్‌లు కట్ చేస్తూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సమయంలో చాలామంది ఉత్సాహంగా నృత్యం చేశారు.

కొత్త సంవత్సరం సందర్భంగా అమృత్‌సర్‌(Amritsar)లోని స్వర్ణ దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు.

షిర్డీలోని సాయిబాబా దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాబా దర్శనం కోసం బారులు తీరారు.

ఇది కూడా చదవండి: New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement