ఇక కొద్దిగంటల్లో న్యూ ఇయర్ చిందులు మొదలుకానున్నాయి. మరోవైపు కొత్త సంవత్సరం రాగానే ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలి? అని పలువురు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇందుకు తగిన విధంగా సెలవులు కూడా అవసరమవుతుంటాయి. అందుకే ఈ ఏడాది ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయా? లాంగ్ వీకెండ్ ఎప్పుడు వచ్చిందా? అని క్యాలెండర్‌లో చూస్తుంటారు.
హోలీకి లాంగ్ వీకెండ్
2025లో మొదటి లాంగ్ వీకెండ్(Long weekend) హోలీ సందర్భంగా వస్తుంది. మార్చి 14న శుక్రవారం హోలీ జరుపుకుంటారు. హోలికా దహన్ ఒక రోజు ముందు అంటే మార్చి 13న (గురువారం) జరుగుతుంది. ఈ నేపధ్యంలో హోలీ మరుసటి రోజు అంటే మార్చి 15న (శనివారం) ఆఫీసు నుండి సెలవు తీసుకోగలిగితే.. మార్చి 13 నుండి మార్చి 16 వరకు 4 రోజుల సుదీర్ఘ వీకెండ్ వస్తుంది. అంటే నాలుగు రోజుల పాటు ఎక్కడికైనా తిరిగే అవకాశం లభిస్తుంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా
ఆగస్ట్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా కూడా లాంగ్ వీకెండ్ వస్తుంది. ఆగస్టు 15 శుక్రవారం నాడు వచ్చింది. ఈ నేపధ్యంలో శనివారం ఆగస్టు 16న సెలవు తీసుకోగలిగే మూడు రోజుల పాటు వీకెండ్ వస్తుంది. మరోవైపు జన్మాష్టమి ఆగస్టు 16న వచ్చింది. ఒకవేళ ఆరోజున సెలవు ఉంటే ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సిన అవసరం రాదు. ఈ మూడు రోజుల్లో సమీపంలోని ఏదైనా ప్రదేశానికి రోడ్ ట్రిప్‌కు వెళ్లవచ్చు. లేదా రిసార్ట్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.
దసరా హాలిడేస్
2025 దసరా సెలవులకు గాంధీ జయంతి మరో సెలవుగా జతచేరింది. సాధారణంగా దుర్గాష్టమి నుండి విజయదశమి వరకూ ఆఫీసులో సెలవులు ఉంటాయి. 2025లో దుర్గాష్టమి సెప్టెంబర్ 30 (మంగళవారం), మహానవమి అక్టోబర్ ఒకటి (బుధవారం), గాంధీ జయంతి(Gandhi Jayanti), విజయదశమి అక్టోబర్ 2 (గురువారం) తేదీలలో వచ్చాయి. దీని ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయవచ్చు.
బక్రీద్‌కు..
2025 జూన్ 7న (శనివారం) బక్రీద్ జరుపుకోనున్నారు. ఆ మర్నాడు ఆదివారం. దీంతో రెండు రోజులు సెలవులు వస్తాయి. ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లివచ్చే అవకాశం ఉంటుంది.
రక్షాబంధన్ సందర్భంగా
ఆగస్టు 9న (శనివారం) రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఆ మర్నాడు ఆదివారం. ఈవిధంగా రక్షాబంధన సందర్బంగా వచ్చే రెండు రోజుల సెలవుల్లో కుటుంబంతో పాటు ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు
Comments
Please login to add a commentAdd a comment