New Year's Resolutions
-
ఈ–కామర్స్‌కు పోటీగా క్విక్ కామర్స్
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంప్రదాయ ఈ–కామర్స్ దిగ్గజాలకు క్విక్ కామర్స్ పోటీనిస్తుందని జెప్టో కో–ఫౌండర్, సీఈవో ఆదిత్ పాలీచా అన్నారు. భారత్‌లో అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ స్థాయి ఫలితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని క్విక్ కామర్స్ కలిగి ఉందని 2024లో ప్రజలు గ్రహిస్తారని జెప్టో గతేడాది ప్రకటించిందని నూతన సంవత్సరం సందర్భంగా లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో ఆయన గుర్తు చేశారు. 2025లో క్విక్ కామర్స్ కూడా ఈ–కామర్స్‌తో పోల్చదగిన స్థాయిని చేరుకుంటుందని తెలిపారు. ఐపీవో బాటలో ఉన్న జెప్టో 2023–24లో నిర్వహణ ఆదాయం 120 శాతం పెరిగి రూ.4,454 కోట్లకు చేరుకుంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జోమాటో బ్లింకిట్ వంటి పోటీ కంపెనీలను అధిగమించింది. ప్రతి కంపెనీకి సవాలు.. కార్యకలాపాలను అసాధారణంగా అమలు చేయడంపై క్విక్ కామర్స్ విజయం ఆధారపడి ఉంటుందని ఆదిత్ నొక్కిచెప్పారు. ఆ స్థాయిలో అమలు చేయడం ప్రతి కంపెనీకి ఒక సవాలుగా ఉంటుందని అన్నారు. ‘2025లో క్విక్ కామర్స్ యొక్క ప్రాథమిక అంశాలు నాటకీయంగా అభివృద్ధి చెందుతాయి. కస్టమర్ చేసే చెల్లింపులకు తగ్గ విలువ మరింత వేగంగా పెరుగుతుంది. నిర్వహణ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్థికాంశాలు, కార్యక్రమాలు మారతాయి. 2023, 2024తో పోలిస్తే ఈ పరిశ్రమకు క్యాపిటల్ మార్కెట్ వాతావరణం కూడా భిన్నంగా కనిపిస్తుంది’ అని అన్నారు. నమ్మశక్యం కాని రీతిలో 2025 ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో వేదికగా నూతన సంవత్సర అమ్మకాల్లో 200 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. రికార్డుల న్యూ ఇయర్.. డిసెంబర్ 31న అత్యధిక విక్రయాలను సాధించామని బ్లింకిట్ ప్రకటించింది. ఒక నిమిషంలో, ఒక గంటలో అత్యధిక ఆర్డర్లతోపాటు.. ఒక రోజులో డెలివరీ భాగస్వాములు అందుకున్న టిప్స్ సైతం అత్యధికమని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా మైక్రో–బ్లాగింగ్ సైట్ ఎక్స్ వేదికగా తెలిపారు. అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయాన్ని భారతీయులు స్వీకరించినందున నూతన సంవత్సర వేడుక రోజున ఒక రోజులో అత్యధికంగా ద్రాక్షలను విక్రయించినట్లు బ్లింకిట్ పేర్కొంది. స్పానిష్ సంస్కృతిలో పాతుకుపోయిన ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిందని వివరించింది. -
మొదటిసారి గెలవడం ఓకే.. రెండోసారి గెలవడమే గొప్ప
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొలిటికల్ క్లాస్ తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటిసారి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం సరదాగా మాట్లాడుతూ.. తన రాజకీయ అనుభవాన్ని పంచుకున్నారు. ‘ప్రజాప్రతినిధిగా మీరు చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్ అవుతుంటాయి. అన్ని విషయాలను వారు గుర్తుపెట్టుకుంటారు. మొదటిసారి మీపై చాలా అంచనాలతో గెలిపిస్తారు. అది గొప్ప విషయమేమీ కాదు. మీరేంటో తెలిసిన తర్వాత, మీ పనితీరు అర్థం చేసుకున్న తర్వాత రెండోసారి గెలిపిస్తేనే గొప్ప విషయం. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లి వస్తుండాలి. కార్యకర్తలతో మమేకం కావాలి. మీరు ఈజీగా తీసుకుంటే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ప్రజలు ఒకసారి ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత అసలు రాజకీయమంటే ఏంటో అర్థమవుతుంది’అని క్లాస్ తీసుకున్నారు. అక్కడే ఉన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఉద్దేశించి.. ఆయన ఎలా గెలుస్తున్నారో అడిగి తెలుసుకోవాలని సూచించారు. మీరే మాట్లాడండి.. కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. తాను కూడా మరింత పట్టుదలతో పనిచేస్తానని చెప్పారు. ఉదయం నుంచి మంత్రులకు, పార్టీ నేతలకు తానే ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపండి. వీలున్నప్పుడల్లా వారితో మాట్లాడండి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌ను కలుపుకుని ముందుకెళ్లండి. ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి’అని సూచించారు. నా రిపోర్టు నా దగ్గరే ఉంది తన పనితీరుకు 100కి 100 మార్కులు వేసుకోబోనని సీఎం రేవంత్ అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి వచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని, తన రిపోర్టు కూడా తన దగ్గరే ఉందని తెలిపారు. ఈ రిపోర్టులను త్వరలోనే అందరికీ పంపిస్తానని కూడా చెప్పినట్టు తెలిసింది. సీఎంగా అధికారిక బాధ్యతలు అలవాటు అయినందున.. ఇక నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకోవద్దని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలకు స్పష్టంచేసినట్లు తెలిసింది. అంగన్వాడీలు, రేషన్ డీలర్ల నియామకంలో తమకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ఓ మంత్రి కోరిన సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. సీఎం మాటలు స్ఫూర్తినిచ్చాయి: ఎంపీ చామల కిరణ్‌రెడ్డి ప్రజాప్రతినిధి హోదాలో తొలిసారి సీఎం రేవంత్‌ను కలవడం స్ఫూర్తినిచ్చిందని, ఆయన చెప్పిన మాటలు తన బాధ్యతను మరింత పెంచాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌ను ఎప్పుడు కలిసినా ఏదో ఉత్తేజం వస్తుందని, ఈసారి మాత్రం రాజకీయ అనుభవాల గురించి ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. -
ఆలయాల్లో నూతన సంవత్సర సందడి
ప్రపంచ వ్యాప్తంగా 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనమంతా ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉత్తర భారతదేశంలో విపరీతమైన చలి ఉన్నప్పటికీ జనం అత్యంత ఉత్సాహంగా న్యూ ఇయర్ జోష్‌లో మునిగిపోయారు.నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హోటళ్లు, రెస్టారెంట్లు సందడిగా మారాయి. గడియారంలో 12 గంటలు చూపగానే జనమంతా పెద్ద ఎత్తున హ్యాపీ న్యూ ఇయర్(Happy New Year) అంటూ ఒకరికొకరు విష్ చేసుకున్నారు. ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అటు జమ్ముకశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు జనమంతా నూతన సంవత్సర వేడుకల్లో తేలియాడుతున్నారు. ఇదే సమయంలో చాలామంది నూతనసంవత్సరం వేళ ఆలయాలను సందర్శిస్తూ భగవంతుని ఆశీర్వాదాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాలతో పాటు అన్ని ఆలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. #WATCH | Maharashtra | People gather to witness the fireworks and celebrate as they welcome the New Year 2025.(Visuals from Marine Drive) pic.twitter.com/7tJizmhp8D— ANI (@ANI) December 31, 2024మహారాష్ట్రలోనూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముంబయిలోని మెరైన్‌డ్రైవ్(Marine Drive)లో బాణాసంచా కాల్చేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు పర్యాటకలు ఎంజాయ్ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా చేరుకున్నారు. ఒకరినొకరు విష్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.#WATCH | Himachal Pradesh | People gather to celebrate as they welcome the New Year 2025 in Shimla. pic.twitter.com/YXUhDGx8hI— ANI (@ANI) December 31, 2024కేరళలోని తిరువనంతపురంలో ప్రజలు బాణసంచా వెలిగించి నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.గోవాలోని పనాజీలో జనం కేక్‌లు కట్ చేస్తూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సమయంలో చాలామంది ఉత్సాహంగా నృత్యం చేశారు.#WATCH | Fireworks in Kerala's Thiruvananthapuram as people celebrate to welcome the New Year 2025. pic.twitter.com/18ZAbzCGh4— ANI (@ANI) December 31, 2024కొత్త సంవత్సరం సందర్భంగా అమృత్సర్(Amritsar)లోని స్వర్ణ దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు.షిర్డీలోని సాయిబాబా దేవాలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాబా దర్శనం కోసం బారులు తీరారు.ఇది కూడా చదవండి: New Year 2025: షిర్డీలో సంబరం.. రాత్రంతా దర్శనం#WATCH | Goa | People dance and cut cake as they celebrate and welcome the New Year 2025 in Panaji. pic.twitter.com/BRd67rFqSP— ANI (@ANI) December 31, 2024 #WATCH | Punjab | People visit the Golden Temple in Amritsar to celebrate as they welcome the New Year 2025. pic.twitter.com/yxmHzFzeC6— ANI (@ANI) December 31, 2024#WATCH | Maharashtra | Devotees visit Shirdi Temple as they welcome the New Year 2025. pic.twitter.com/MvWXZXz6rb— ANI (@ANI) December 31, 2024 -
కాలాన్ని మంచి చేసుకోవాలి!
కాలం మనల్ని వెక్కిరిస్తూ ముందుకు పరిగెత్తుతూంటుంది. మనం దానితోపాటు నడవలేం. దాన్ని ఆపలేం. దాని వెంట పరిగెత్తనూలేం. చేయగలిగిందల్లా దాన్ని వీలైనంత ‘మంచి’ చేసుకోవడమే. అంటే దాన్ని సరిగ్గా వాడుకోవడమే. దాని వేగాన్ని తగ్గించలేక పోయినా దాని విలువను గుర్తించడం మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి.‘నాకు సమయం లేదు’ అనీ, ‘రోజులు గడిచిపోతున్నాయి. చాలా చెయ్యాలనుకున్నా. ఏమీ చెయ్యలేకపోయా’ అనీ, ‘ఉన్న సమయమంతా ఇంకొకళ్ల కోసమే అయిపోతోంది. ఇక నా కోసం ఏం చేసుకోడానికైనా టైం ఏదీ’ అనీ, ‘ఇల్లు, ఆఫీసు... ఈ రెండిటితోనే సరిపోతుంది. ఇంకేమీ చెయ్యలేను బాబూ’... ఇలాంటి మాటలు ఎంత తరచుగా వింటామో! ఈ మాటలు చాలా మంచి ‘సాకులు’. అవి కఠోర వాస్తవాలని మనల్ని మనం మభ్యపెట్టుకోవచ్చుగానీ నిజానికి అవి మనం ‘మనకు నచ్చిన పని చెయ్యకుండా, మనం చెయ్యాల్సిన పని చెయ్యకుండా’ తప్పించుకోడానికి కల్పించుకునే సాకులే. కాలం అందరికీ ఒకటే. ఎవరికైనా రోజులో ఉన్నవి ఇరవై నాలుగ్గంటలే. కొందరు రోజుకు పది పనులు అవలీలగా చేసేస్తారు; మరికొందరు ఒకటిన్నర పనితో సరిపెట్టుకుంటారు. ఈ తేడాకు కారణం మరొకరిపై తోసేయడం సుళువు. దానికి మనం ఎంతవరకు కారణమో ఆలోచించడం నేర్పు. ఇప్పటి ఆడవాళ్లకు అవసరమైంది ఈ నేర్పే. ‘సుళువు’లు చాలా ఏళ్లగానే వాడుకుంటున్నాం. ఇక మన నేర్పును చూపించే వేళ ఆసన్నమైంది. కొంత వెనక్కి వెళ్లి చూస్తే– మనలో మంచి చిత్రకారిణి ఉంది; పాటగత్తె ఉంది; సమాజ సేవకురాలు ఉంది; రచయిత్రి ఉంది; నృత్యకారిణి వుంది; నాయకురాలు ఉంది; వ్యాపారవేత్త ఉంది; దానికి పదును పెట్టాలన్న కోరికా ఉంది. కానీ లేనిదల్లా ఆ పదును పెట్టడానికి సమయమే. ఎందుకంటే వీటితో పాటే ‘నువ్వు ఏదైనా చెయ్యి కానీ నీ ఇంటి బాధ్యతలు పూర్తి చేశాకే’ అని తర్జని చూపించే కుటుంబమూ ఉంది. ‘ఆవిడ అంత పేరు తెచ్చుకుందంటే ఇల్లొదిలి తిరిగింది కాబట్టేగా’ అని మూతి విరిచే సమాజమూ ఉంది. ఇప్పుడు ఆ కుటుంబాన్నీ, సమాజాన్నీ నోటితో కాకపోయినా నొసలుతో వెక్కిరించే చైతన్యం ఎంతో కొంత మనకు అబ్బింది. అయినా అనుకున్నంతగా, మన సామర్థ్యానికి తగినంతగా సాధించలేకపోతున్నాం. ప్రతి పనినీ ‘వాయిదాలు’ వేస్తాం. వాయిదా వేయడానికి కనిపించినన్ని కారణాలు, ఉపయోగించేంత తెలివి తేటలు, పని చెయ్యడానికే వెచ్చిస్తే ఎంత బాగుంటుంది! అలా కూర్చునీ, కూర్చునీ ‘వయసైపోతోంది. ఏం సాధించాను ఈ జీవితంలో?’ అని నిస్పృహగా ప్రశ్నించుకుంటున్నాం. ‘నాలో ఎంతో ప్రతిభ ఉంది. ఏమీ ప్రతిభ లేని వాళ్లు ముందుకు వెళ్లిపోతున్నారు. నేనింకా వెనకబడే ఉన్నాను’ అని వాపోతున్నాం. గుర్తింపు కోసం, అవార్డుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, బిరుదుల కోసం తహతహలాడటం మానుకోలేకపోతున్నాం. మన మానసిక సంతృప్తి వల్ల లభించే ‘విజయం’ మరే వేదికల వల్లా రాదని గుర్తించలేక పోతున్నాం. ఆ సంతృప్తిని సాధించే సమయం కూడా మన వద్ద ఉండటం లేదు. ఎందువల్ల? కాలాన్ని వాడుకోవడం చేతకాకపోవడం వల్ల; కాలం పట్ల భయమే తప్ప గౌరవం, ఇష్టం లేకపోవడం వల్ల. ఏం జరుగుతోందో అర్థమయ్యాక దాన్ని తట్టుకునేందుకూ లేదా అధిగమించేందుకూ ఏం చెయ్యాలో కూడా ఆలోచించాలి. మనం రోజులో ఎంత సమయం ఎలా వృథా చేస్తున్నామో తెలుసుకోవాలి. వంట చెయ్యడం, ఇంటి పనులు, పిల్లల పనులు చెయ్యడం కాదు వృథా చెయ్యడమంటే. సమయం వృథా చెయ్యడమంటే కాలాన్ని అగౌరవ పరచడం. అది ఎలా చేస్తున్నాం? ఇతరుల గురించి ఆలోచించడం; ఇతరుల పట్ల ఈర‡్ష్యను పెంచి పోషించడం; ఇతరుల జీవితాల్లో ఎన్ని లొసుగులున్నాయో వాకబు చెయ్యడం; మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో సామాజిక మాధ్యమాల్లో వెతుక్కోవడం; మనల్ని ఎంతమంది మెచ్చుకుంటున్నారో తెలుసుకుని గంటల తరబడి ఆనందించడం; ఎంతమంది తిడుతున్నారో తెలుసుకుని కుంగిపోవడం; లేదా శాపనార్థాలు పెట్టుకోవడం; మనకిష్టం లేని వాళ్లను ఎలా భ్రష్టు పట్టించాలో పన్నాగాలు వేయడం; అస్మదీయులతో బృందాలను ఏర్పరచుకుని వారితో పేరంటాలు, పండగలు చేసు కోవడం; మనకు ఉత్తరోత్తరా పనికి వచ్చే వాళ్లతో స్నేహాల కోసం ప్రయత్నించడం; మనల్ని బాధపెట్టిన వాళ్ల గురించి, మనకు నచ్చని వాళ్ల గురించి గంటల తరబడి ఫోన్లలో సంభాషణలు చేయడం; మన బాధ ప్రపంచపు బాధ అనుకుని అందరికీ మన గోడు, మనకు జరిగిన అన్యాయాలనూ వినిపించుకోవడం; ఈ ప్రపంచానికి మనల్ని అవమానించడం మినహా మరో పని లేదనే భ్రమలో జీవించడం. ఇదంతా ఇప్పటి మధ్య వయస్కుల తరం కాలాన్ని గడిపే వైనం. మరి ‘కాలం’ బాధపడదూ? మనకు మేలు చెయ్యాలని ఉన్నా ఎందుకులే ఈ మొహాలకు అని మొహం చాటేయదూ? తాము పుట్టడమే ఈ లోకానికి మహోపకారమనుకునే అహంభావుల కోసం తనెందుకు ఆగాలని అనుకోదూ? కనక, మన జీవితాలను బాగుపరచుకోడానికి గొప్ప అవకాశం ఇచ్చే అనంతమైన కాలాన్ని కొత్త సంవత్సరం నుంచి అయినా ఒక్క చిటికెడు, దోసెడు గౌరవిద్దాం.డా‘‘ మృణాళిని వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి, ఆచార్యులు -
సరే సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం! కానీ..
‘‘అమ్మ సాక్షిగా చెబుతున్నా.. జాన్వరి ఫస్ట్ నుంచి మందు తాగను..’’ ఓ పెద్దాయన అనగానే ‘‘సూపర్ అసలు’’ అంటూ చప్పట్లు కొట్టే యాంకరమ్మ వీడియో ఒకటి ఎంతలా వైరల్ అయ్యిందో తెలియంది కాదు. నిజంగా మీరు కొత్త ఏడాదిలో తీసుకున్న లక్ష్యాలను.. అదేనండీ న్యూఇయర్ రెజల్యూషన్స్‌ను ఎప్పుడైనా కచ్చితంగా అమలు చేశారా?. పోనీ చేసినా.. అసలు వాటిలో కచ్చితంగా పూర్తిస్థాయిలో పాటించినవి ఉన్నాయి?. అసలు ఆ తీర్మానాల విషయంలో ఎప్పుడైనా మీకు మీరు సమీక్షించుకున్నారా?.మనలో చాలా మందికి బాగా అలవాటైన పనేంటో తెలుసా? మూడు రోజులు చాలా చక్కగా న్యూ ఇయర్ హడావుడిలో అనుకున్న లక్ష్యం(Resolutions) కోసం పని చేస్తారు. నాలుగో రోజు యథావిధిగా మానేయడమో, ఏదో ఒక కారణం చెప్పి దాని నుంచి వైదోలగడమో చేస్తారు. ఇలా చేసే వారు 100లో సుమారు 92 మంది ఉన్నారట!. అంటే.. సిన్సీయర్‌గా తమ రెజల్యూషన్స్ కోసం పని చేసేది కేవలం 8 మందినేనా?. ఈ మాట మేం చెప్తోంది కాదు.. పలు అధ్యయనాలు ఇచ్చిన నివేదికలు సారాంశం ఇదే. పాజిటివీటీ.. టైం సెట్ గో.. మనలో చాలమంది ఈ కొత్త ఏడాదిలో ఏదైనా సాధించాలనో, లేదంటే ఫలానా పని చేయకుండా ఉండాలనో తీర్మానాలు చేసుకుంటారు. అది కెరీర్ పరంగా కావొచ్చు, ఆరోగ్యపరం(Health Resolution)గా అవ్వొచ్చు, డబ్బు సంబంధితమైనవి కావొచ్చు.. విషయం ఏదైనా చాలామంది ఏదో ఒక తీర్మానం మాత్రం చేసి తీరతారు. అయితే.. అంత ఈజీగా జరిగే పని కాదని వాళ్లకూ బాగా తెలుసు. చాలామంది సమయాన్ని అడ్డంకిగా చెప్పి తప్పించుకుంటారు. పట్టుదల ఉండాలే కానీ సమయం సరిపోదు అనే సమస్య ఉండదు.అలాగే.. మనం ఓ నిర్ణయం కానీ కమిట్మెంట్ కానీ తీసుకునేప్పుడే అది పాజిటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మన లక్ష్యాన్ని సెట్ చేసుకోవటంలో ముందు ఇది ఉందో చూసుకోవడం మంచిది. ముందు నుంచే ‘‘ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు’’ అని ప్రిపేర్డ్‌గా ఉండకూడదు. అలాగే నెగటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది కూడా. అందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఫుల్ కమిట్మెంట్(Full Commitment)తో రూపొందించుకుని పక్కగా అమలయ్యేలా చిత్తశుద్ధి చూపాలి.వాస్తవాన్ని గుర్తించాలి!జీవితంలో ఒక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలంటారు పెద్దలు. ఒకేసారి నాలుగైదు మెట్లు ఎక్కాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో మనకు తెలియంది కాదు. అలాగే.. మార్పు ఓ చిన్న అడుగుతోనే మొదలువుతుంది. కాబట్టి స్టో అండ్ స్టడీ విన్ ది రేస్ బాటలోనే పయనించాలి. అలాంటప్పుడే విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.సమస్య ఏమిటంటే.. చాలాసార్లు మనం అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకుంటుంటాం. వాటి సాధన క్రమంలో తడబడుతుంటాం. అందుకే వాస్తవానికి దగ్గరగా, నిజం చేసుకునేందుకు వీలుగా ఉన్న నిర్ణయాలే తీసుకోవాలి. అలాగే చిన్నపాటి లక్ష్యంతో పని మొదలు పెట్టడం ద్వారా ఉన్నత లక్ష్యానికి దారులు సులువుగా వేసుకోవచ్చు. అలాగని.. ఇక్కడ ‘తగ్గడం’ ఎంతమాత్రం అవదు. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక లేదంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.రెగ్యులర్ వైఖరి వద్దు.. మనం చాలాసార్లు కొత్త ఏడాది వచ్చింది కదా అని.. ఏదో ఒక తీర్మానం చేసేస్తారు. కానీ, దాని అమలుకంటూ ఓ సరైన ప్రణాళిక వేసుకోరు. దాని వల్ల అంతా డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకే సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి పక్కాగా ఆలోచించాలి. నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోవడం వల్ల ఆచరణలో పెట్టడమూ సలువవుతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.పంచుకుంటేనే ఫలితం!ఈ ఏడాది లక్ష్యసాధనలో.. మీతోపాటు తోడుగా ప్రయాణం చేసేందుకు మరికొందరిని వెతికి పట్టుకోగలిగితే మార్గం మరింత సుగమమం అయినట్లే. కలసికట్టుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.రివ్యూ ఈజ్ ఫర్ బెటర్ రిజల్ట్ప్రయాణంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. చిన్నపాటి విజయానికైనా సరే సంబరాలు చేసుకోవాలి. అది పట్టుదలను మరింతగా పెంచుతుంది. అలాగే.. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయి.కొత్తగా సాధించడం కాదు.. కోల్పోయింది తిరిగి తెచ్చుకోవడంలోనే మాంచి కిక్ దొరుకుతుంది! అలా పొందడంలో ఎక్కువ ప్రేరణ పొందగలుగుతారు. -
New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం నుంచే రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో జనం సందడి చేయనున్నారు. న్యూ ఇయర్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు వేడుకలు సవ్యంగా సాగేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్లకు అనుసంధానమైన రహదారులపై రాత్రి 8 గంటల నుండి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో అన్ని వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఏఐ ఆధారిత కెమెరాలతో పహారా కాస్తున్నారు. అనుమానితులపై నిఘా ఉంచేందుకు వీటిని వినియోగించనున్నారు.ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన యోధా వాహనాల్లో కమాండోలను మోహరించనున్నారు. వీరు రోడ్లపై తిరుగుతూ అల్లర్లకు పాల్పడేవారి ఆటకట్టించనున్నారు. దీనికి తోడు ఢిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో 600 మంది పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు. కన్నాట్ ప్లేస్‌లో 50కి పైగా పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు మోటార్ సైకిళ్లపై నిరంతరం గస్తీ తిరగనున్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు సిబ్బంది జనం మధ్యలో తిరుగుతూ, ప్రజలకు రక్షణ అందించనున్నారు.నూతన సంవత్సర వేడుకల్లో రాజకీయ పార్టీలు, సంస్థలు అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదనే నిబంధన విధించారు. ఇండియా గేట్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడానికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేపట్టనున్నారు. ఇండియా గేట్ వద్ద పార్కింగ్ స్థలం పరిమితంగా ఉన్నందున సందర్శకులు ప్రజా రవాణాను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపినా, అతివేగంగా వాహనం నడిపినా, జిగ్-జాగ్ తరహాలో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినా వారిపై వివిధ సెక్షన్ల కింద జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: రక్షణరంగంలో విజయాలు.. సరికొత్త రికార్డులు -
2025లో లాంగ్ వీకెండ్లు.. ఎంజాయ్ చేద్దామిక..
ఇక కొద్దిగంటల్లో న్యూ ఇయర్ చిందులు మొదలుకానున్నాయి. మరోవైపు కొత్త సంవత్సరం రాగానే ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలి? అని పలువురు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇందుకు తగిన విధంగా సెలవులు కూడా అవసరమవుతుంటాయి. అందుకే ఈ ఏడాది ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయా? లాంగ్ వీకెండ్ ఎప్పుడు వచ్చిందా? అని క్యాలెండర్లో చూస్తుంటారు.హోలీకి లాంగ్ వీకెండ్2025లో మొదటి లాంగ్ వీకెండ్(Long weekend) హోలీ సందర్భంగా వస్తుంది. మార్చి 14న శుక్రవారం హోలీ జరుపుకుంటారు. హోలికా దహన్ ఒక రోజు ముందు అంటే మార్చి 13న (గురువారం) జరుగుతుంది. ఈ నేపధ్యంలో హోలీ మరుసటి రోజు అంటే మార్చి 15న (శనివారం) ఆఫీసు నుండి సెలవు తీసుకోగలిగితే.. మార్చి 13 నుండి మార్చి 16 వరకు 4 రోజుల సుదీర్ఘ వీకెండ్ వస్తుంది. అంటే నాలుగు రోజుల పాటు ఎక్కడికైనా తిరిగే అవకాశం లభిస్తుంది.స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగాఆగస్ట్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా కూడా లాంగ్ వీకెండ్ వస్తుంది. ఆగస్టు 15 శుక్రవారం నాడు వచ్చింది. ఈ నేపధ్యంలో శనివారం ఆగస్టు 16న సెలవు తీసుకోగలిగే మూడు రోజుల పాటు వీకెండ్ వస్తుంది. మరోవైపు జన్మాష్టమి ఆగస్టు 16న వచ్చింది. ఒకవేళ ఆరోజున సెలవు ఉంటే ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సిన అవసరం రాదు. ఈ మూడు రోజుల్లో సమీపంలోని ఏదైనా ప్రదేశానికి రోడ్ ట్రిప్‌కు వెళ్లవచ్చు. లేదా రిసార్ట్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.దసరా హాలిడేస్2025 దసరా సెలవులకు గాంధీ జయంతి మరో సెలవుగా జతచేరింది. సాధారణంగా దుర్గాష్టమి నుండి విజయదశమి వరకూ ఆఫీసులో సెలవులు ఉంటాయి. 2025లో దుర్గాష్టమి సెప్టెంబర్ 30 (మంగళవారం), మహానవమి అక్టోబర్ ఒకటి (బుధవారం), గాంధీ జయంతి(Gandhi Jayanti), విజయదశమి అక్టోబర్ 2 (గురువారం) తేదీలలో వచ్చాయి. దీని ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 2 వరకు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయవచ్చు.బక్రీద్‌కు..2025 జూన్ 7న (శనివారం) బక్రీద్ జరుపుకోనున్నారు. ఆ మర్నాడు ఆదివారం. దీంతో రెండు రోజులు సెలవులు వస్తాయి. ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్లివచ్చే అవకాశం ఉంటుంది.రక్షాబంధన్ సందర్భంగాఆగస్టు 9న (శనివారం) రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఆ మర్నాడు ఆదివారం. ఈవిధంగా రక్షాబంధన సందర్బంగా వచ్చే రెండు రోజుల సెలవుల్లో కుటుంబంతో పాటు ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎనిమిది ఘటనలు.. రాజకీయాల్లో పెనుమార్పులు -
2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా?
2024 ఏడాదికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాది 2025 (New Year 2025)లోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాము. మి కొత్త సంవత్సరం వస్తుందంటే ఏ పండుగలు ఏ రోజు వచ్చాయో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. అంతేకాదు న్యూ ఇయర్ అనగానే పిల్లలంతా తమ బర్త్‌డే ఎపుడు (వారం) వచ్చిందా అని ఆసక్తిగా వెదుక్కుంటారు. ఉద్యోగులైతే ఏ ఏ పండుగలు ఆదివారం వచ్చాయబ్బా అని తెలుసుకునేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. ఇక మహిళలు (మిగిలినవారు కూడా) పెద్ద పండుగలు, శుభఘడియలు ఎపుడు వచ్చాయో తెలుసు కునేందుకు ఉత్సాహంగా చూపుతారు. మరి 2025లో సంక్రాంతి (Sankranti, ఉగాది (Ugadi), హోలీ (holy) వినాయక చవితి, శ్రీరామ నవమి, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, దసరా (Dussera) దీపావళి (Diwali) ఎపుడు వచ్చాయో చూద్దామా?2025లో పెద్ద పండుగలు, వారం తేదీభోగి : సోమవారం (13/01/25)మకర సంక్రాంతి : మంగళవారం (14/01/25)కనుమ : బుధవారం(15/01/25)మహాశివరాత్రి: 26/02/25 (బుధవారం)హోలీ: శుక్రవారం (14/3/25)ఉగాది : ఆదివారం (30/3/25)శ్రీరామ నవమి : ఆదివారం( 6/04/25)వరలక్ష్మి వ్రతం : శుక్రవారం(8/08/25)శ్రీ కృష్ణాష్టమి : శనివారం (16/08/25)వినాయక చవితి: బుధవారం(27/08/25)దుర్గాష్టమి : మంగళవారం (30/09/25)విజయ దశమి లేదా దసరా : గురువారం(02/10/25) ఇదీ చదవండి: 2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా? దీపావళి:సోమవారం (20/10/25)క్రిస్మస్ : గురువారం (25/12/25)అలాగే 2025లో రిపబ్లిక్ డే (జనవరి 26), ఉగాది రోజులు ఆదివారం వచ్చాయి. -
Happy New Year 2025: ఎందుకు? ఏమిటి? ఎలా?..
ఇవాళ్టి నుంచి.. ఎలాగైనా ఉదయమే లేచి చదువుకోవాలి. .. జిమ్‌కు వెళ్లి బాడీని పెంచాలి.. సరైన డైట్‌ను మెయింటెన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి. .. ఎలాగైనా డబ్బులను పొదుపు చేసి ఫలానాది కొనాలి. .. ఆఫీస్‌కు టైంకు వెళ్లాలి. ఇలా అన్నీ కూడా ఏడాదిలో తొలిరోజు నుంచే చేస్తూ ఫ్రెష్ జీవితం ప్రారంభించాలి. చేస్తారో.. చేయరో.. తెలియదు!. కానీ, కొత్త ఏడాది వచ్చిందంటే.. రెజల్యూషన్స్ పేరుతో ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చి హడావిడి చేసేవాళ్లు ఎందరో ఉంటారు. ఇందులోనూ హాస్యకోణం వెతుకుతూ.. ఇంటర్నెట్లో మీమ్స్(Resolutions Memes) వైరల్ అవుతున్న పరిస్థితుల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఆ లక్ష్యాలను అందుకోవడం మన వల్ల కాదా?..కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. ఇన్ని రోజులు ఏలాగోలా గడిచాయి.కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దాం!’.. అని పదిలో తొమ్మిది మంది అనుకుంటారని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది ఏ విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు.. రెజల్యూషన్స్ తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నవాళ్లు లేకపోలేదు. అంటే.. ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందన్నమాట. అయితే..ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని అందరి నమ్మకం. మన భాషలో మంచి పాజిటివ్ వైబ్ అన్నమాట. చాలా మంది చాలా రకాల లక్ష్యాలను ఈ కొత్త ఏడాదిలో నిర్దేశించుకుంటారు. వాటిలో కొన్నింటిని ఎలాగైనా చేయాలని ప్రయత్నిస్తుంటారు. అవి మాములువి కాదు.. పెద్ద పెద్ద టార్గెట్లే ఉండొచ్చు!. అలాంటి వాటిని ఒంటరిగా నెరవేర్చుకోవడం కొంచెం కష్టమే!. అందుకోసమైనా సరే ఈ లక్ష్యాలను నలుగురితో పంచుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి.కొత్త ఏడాది రెజల్యూషన్స్ చేసుకోవడంలో.. విద్యార్థులు, యువత ముందుంటారు. ఇక్కడ విద్యార్థులతో పాటు వారు తల్లిదండ్రులు/సంరక్షకులు కూడా ఈ లక్ష్యాల కోసం వారితో కలిసి పనిచేస్తేనే ఫలితం ఉండేది. ఉదయాన్నే లేచి చదువుకోవాలనో, లేదంటే టైంకు హోంవర్క్ పూర్తి చేయాలనో, అదికాకుంటే మార్కులు బాగా తెచ్చుకోవాలనో, యూనివర్సిటీలో ర్యాంకు రావాలనో.. ఇలా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మాట్లాడుకోవాలి. భవిష్యత్‌లో పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడాలంటే చదువు తప్పనిసరని చెబుతూనే వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలి. అయితే ఇది వాళ్లను ఒత్తిడి, ఆందోళనలకు గురి చేసేదిలా మాత్రం అస్సలు ఉండకూడదు. అలాగే ప్రొగ్రెస్‌ను రివ్యూ చేస్తూ.. వాళ్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప!.. ఇతరులతో పోల్చి నిందించడం.. ఆశించిన ఫలితం రాలేదని కోప్పడడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. మానసిక ఆరోగ్యమే వాళ్ల విజయానికి తొలి మెట్టు అనేది గుర్తించి ముందుకు వెళ్లాలి.లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకునే వర్గం యువతే. అలాగే.. రెజల్యూషన్స్‌ను బ్రేక్ చేసేది కూడా ఈ వర్గమే. కెరీర్‌పరంగా స్థిరపడే క్రమంలో.. వీళ్లకు కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాడు కచ్చితంగా అవసరం ఉంటుంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణ.. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకునేలా వాళ్లను సమాయత్తం చేయాలి. అందుకు అవసరమైన సాధన, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునేలా వాళ్లను ప్రొత్సహించాలి. ఆ దశలో అన్ని రకాలుగా విశ్లేషణ అనేది అవసరం. అందుకు అవసరమైన సాయమూ అందించినప్పుడే వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోగలరని గుర్తించాలి.జీవితంలో ఎదుగుదల పొదుపు(Savings)తోనే ప్రారంభమవుతుంది. అందుకే కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందైనా.. ఆర్థికంగా పరిపుష్టి సాధించాలకుని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తగా ఉద్యోగం సాధించిన వారైతేనేమి, కొత్తగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకునేవారైతేనేమి.. దీన్నొక భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తారు కూడా. అలాగే తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా ఎక్కువ అవసరం పడేది ఈ లక్ష్య సాధనలోనే!. కాబట్టి.. స్వీయ నియంత్రణతో పాటు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మరీ ముఖ్యంగా భాగస్వామి పాత్ర ఇంకాస్త ఎక్కువే!. నెలావారీ ఖర్చులతో పాటు ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ముందుగానే వేసుకోవడం, ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవడం లాంటివి చేయాలి.కొత్త సంవత్సరం తొలిరోజు మాత్రమే కాదు.. వచ్చే ఏడాదిలో ప్రతీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఆరోగ్యంగా ఉండడం అవసరం. న్యూఇయర్ రెజల్యూషన్స్(NewYear's Resolutions)లో.. వయసుతో సంబంధం లేకుండా మంచి ఆరోగ్య ప్రణాళికను చాలామంది నిర్దేశించుకుంటారు. అయితే ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని.. ఉల్లంఘించేవాళ్లు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. ఇందుకు బద్ధకం సహా రకరకరాల కారణాలు ఉండొచ్చు. కానీ, ఈ తీర్మానాన్ని సమిష్టిదిగా ఆ కుటుంబం భావించాలి. తద్వారా మానసిక, శారీరక సమస్యలనూ దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మనం అనుకున్న లక్ష్యాలు కానీ బాధ్యతలు కానీ నేరవేర్చడానికి వీలవుతుంది.న్యూ ఇయర్ రిజల్యూషన్లు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ, పక్కాగా అమలు కావాలంటే మాత్రం మనకు గట్టి సపోర్ట్ అవసరం అంటారు నిపుణులు. ఇది ఒంటరి ప్రయాణం ఎంతమాత్రం కాదు. ఒకరకంగా ఇది ఆఫీసుల్లో టీం వర్క్ లాంటిదన్నమాట. అందుకే తీసుకునే నిర్ణయాన్ని నలుగురికి చెప్పాలి.. వాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే చర్చ జరగాలి. ఆ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అప్పుడే ఏడాది పొడవునా.. అనుకున్న మేర ఫలితాలు అందుకోగలరు.