2024 ఏడాదికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాది 2025 (New Year 2025)లోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాము. మి కొత్త సంవత్సరం వస్తుందంటే ఏ పండుగలు ఏ రోజు వచ్చాయో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. అంతేకాదు న్యూ ఇయర్ అనగానే పిల్లలంతా తమ బర్త్‌డే ఎపుడు (వారం) వచ్చిందా అని ఆసక్తిగా వెదుక్కుంటారు. ఉద్యోగులైతే ఏ ఏ పండుగలు ఆదివారం వచ్చాయబ్బా అని తెలుసుకునేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు.
ఇక మహిళలు (మిగిలినవారు కూడా) పెద్ద పండుగలు, శుభఘడియలు ఎపుడు వచ్చాయో తెలుసు కునేందుకు ఉత్సాహంగా చూపుతారు. మరి 2025లో సంక్రాంతి (Sankranti, ఉగాది (Ugadi), హోలీ (holy) వినాయక చవితి, శ్రీరామ నవమి, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, దసరా (Dussera) దీపావళి (Diwali) ఎపుడు వచ్చాయో చూద్దామా?
2025లో పెద్ద పండుగలు, వారం తేదీ
భోగి : సోమవారం (13/01/25)
మకర సంక్రాంతి : మంగళవారం (14/01/25)
కనుమ : బుధవారం(15/01/25)
మహాశివరాత్రి: 26/02/25 (బుధవారం)
హోలీ: శుక్రవారం (14/3/25)
ఉగాది : ఆదివారం (30/3/25)
శ్రీరామ నవమి : ఆదివారం( 6/04/25)
వరలక్ష్మి వ్రతం : శుక్రవారం(8/08/25)
శ్రీ కృష్ణాష్టమి : శనివారం (16/08/25)
వినాయక చవితి: బుధవారం(27/08/25)దుర్గాష్టమి : మంగళవారం (30/09/25)
విజయ దశమి లేదా దసరా : గురువారం(02/10/25)
ఇదీ చదవండి: 2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా?
దీపావళి:సోమవారం (20/10/25)
క్రిస్మస్ : గురువారం (25/12/25)
అలాగే 2025లో రిపబ్లిక్ డే (జనవరి 26), ఉగాది రోజులు ఆదివారం వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment