కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. కొంగొత్త ఆశలను, ఆకాంక్షలను మోసుకొచ్చింది. అయితే ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారి తరాన్ని జనరేషన్ బీటాగా పిలువనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలను బీటా బేబీస్ అని పిలుస్తారు.
బీటా జనరేషన్(Beta Generation) సాంకేతిక యుగంలో అత్యున్నతంగా ఎదగడమే కాకుండా, మునుపటి తరాలు ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటూ, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనరేషన్ బీటా 2035 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం ఉంటుందని అంచనా. నూతన దృక్పథంతో భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ తరం, 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్ష్యంగా నిలుస్తారంటున్నారు. సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సామాజిక మార్పుల మధ్య బీటా తరం జీవితం గడుపుతుంది. ఈ తరం ప్రతి అంశంలో సాంకేతికత వినియోగించడమే కాకుండా, పర్యావరణ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కొంటుంది.
బీటా జనరేషన్ ఆల్ఫా జనరేషన్ (2010-2024 మధ్య పుట్టినవారు)ను అనుసరిస్తుంది. దీనికి ముందు జెనరేషన్ జెడ్ (1996–2010), మిలీనియల్స్ (1981–1996) జనరేషన్లు ఉన్నాయి. జనరేషన్ బీటాను బీటా బేబీస్(Beta Babies) అని కూడా అంటారు. ఈ తరం సాంకేతిక యుగంలో పెరుగుతుంది. టెక్నాలజీ యుగం సామాజిక పరిశోధకుడు మార్క్ మెక్‌క్రిండిల్ తెలిపిన వివరాల ప్రకారం జనరేషన్ బీటా జీవితాలు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ముందుకు సాగుతాయి. విద్య, ఆరోగ్యం, వినోదం, కార్యాలయ కార్యకలాపాల్లో వీరు ఏఐని విరివిగా వినియోగిస్తారు.
ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment