shiridi
-
అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్
ఔరంగాబాద్:మహారాష్ట్రలోని షిరిడీ సాయినాథుడు కొలువైన అహ్మద్‌నగర్ జిల్లా పేరు మారిపోయింది.అహ్మద్‌నగర్‌ను అహిల్యానగర్‌గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో అహ్మద్‌నగర్‌ను ఇక అహిల్యానగర్‌గా పిలవనున్నారు.18వ శతాబ్దంలో ఇండోర్‌ను పరిపాలించిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యాదేవి పేరు మీద అహ్మద్‌నగర్‌కు అహిల్యనగర్ అనే పేరు పెట్టారు.చాలా ఏళ్లుగా అహ్మద్‌నగర్ పేరు మార్చాలన్న డిమాండ్ ఉందని, ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి వీకే పాటిల్ చెప్పారు. ఇదీ చదవండి: మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీహోదాపై నిరసనలు -
రోడ్డుపై మేకులు విసిరి.. కుటుంబంపై దోపిడీ దొంగల బీభత్సం
-
దైవ దర్శనానికి షిరిడీ వెళ్లి..
నల్లగొండ: దైవ దర్శనం కోసం షిరిడీ వెళ్లిన వారికి మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చింది. మరి కొద్ది క్షణాల్లో సాయి సన్నిధిలో ఉంటామనగా.. వేగంగా దూసుకొచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలు.. జిల్లాకేంద్రంతో పాటు నిడమనూరు, మర్రిగూడకు చెందిన మూడు కుటుంబాలకు చెందిన 15మంది షిరిడీ సాయి దర్శనానికి రైళ్లో బయలుదేరారు. ఆదివారం రాత్రి షిరిడీ రైల్వే స్టేషన్లో దిగిన వారు ఆలయానికి వెళ్లడం కోసం ఓ ఆటో ఎక్కారు. మరికొద్దిసేపట్లో గమ్యాన్ని చేరుకుంటామనాగా.. ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మర్రిగూడ లెంకలపల్లికి చెందిన మంగమ్మ(55), నల్లగొండ వెలుగుపల్లికి చెందిన పగిల్ల వెంకటమ్మ(55), వెకటయ్య(58)లతో పాటు మరో ఇద్దరు మృతిచెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
భగవంతుడి సన్నిధికి...
భూపాలపల్లి/మేడిపల్లి(కరీంనగర్), న్యూస్‌లైన్ : షిర్డీలో పసిపాప పుట్టువెంట్రుకలు తీరుుంచుకుని వస్తున్న ఓ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. తిరుగు ప్రయూణంలో అదుపుతప్పిన జైలో వాహనం చెట్టుకు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి నలుగురు మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా మేడి పల్లి శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనతో భూపాలపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నారుు. పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలో నివాసముండే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు గోనె వీరయ్య(65)కు సరోజన(60) దంపతులకు కుమారులు సంజీవ్, సురేష్, మహేందర్ ఉన్నారు. సంజీవ్, మహేందర్ పట్టణ ప్రధాన రహదారిపై సాయిశ్రీ రెడిమేడ్ డ్రెస్సెస్, సురేష్ సాయిమణికంఠ ఎలక్ట్రానిక్స్ షాపులు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సంజీవ్‌కు భార్య సువర్ణ, కుమారుడు సాయిచరణ్, కుమార్తె సాయిశ్రీ ఉండగా, సురేష్‌కు భార్య అనూష(26), కుమార్తెలు సాత్విక, శిరీక, మహేందర్‌కు భార్య రేణుక, కుమార్తెలు సంధ్య, నిషిత(8 నెలలు) ఉన్నారు. వీరంతా సాయిబాబా దర్శనానికి ప్రతి ఏటా షిర్డీకి వెళ్లి వస్తుంటారు. ఈ ఏడాది మహేందర్ కుమార్తె నిషితకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకుని ఆదివారం షిర్డీకి బయల్దేరారు. నాలుగు కుటుంబాలకు చెందిన 14 మంది తమ షాపులో పనిచేసే ఎర్రగట్ల వెంకటేశ్వర్లును వెంటబెట్టుకుని తమ జైలో వాహనంలో షిర్డీకి వెళ్లారు. బాబాను దర్శించుకున్న తర్వాత సోమవారం మధ్యాహ్నం తిరుగుపయనమయ్యారు. అదేరోజు రాత్రి కరీంనగర్ జిల్లా కోరుట్ల సాయిబాబా ఆలయంలో నిద్రించి మంగళవారం తెల్లవారుజామున 6.30 గంటలకు భూపాలపల్లికి బయల్దేరారు. అయితే సరిగ్గా 15 నిమిషాలు కూడా గడవకముందే మేడిపల్లి మండల కేంద్రం మీదుగా వెళ్లే 63వ జాతీయ రహదారిలోని పెట్రోల్‌బంక్ సమీపంలో జైలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇంటి పెద్దలు వీరయ్య, సరోజన అక్కడికక్కడే మృతి చెందా రు. మిగిలినవారికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అనూష, నిషిత చికి త్స పొందుతూ మృతిచెందారు. మిగతా వారందరికీ తీవ్ర గాయాలయ్యా యి. చిన్నపిల్లలకు దెబ్బలు పైకి కనిపించకపోయినా వారికి చికిత్స చేస్తున్న సమయంలో ఫిట్స్ రావడం, వణుకుతుండ డంతో అంతర్గతంగా దెబ్బలు తగిలి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలు కాగా, మహేందర్, సురేష్, సంజీవ్ తల, కాళ్లు, చేతులు, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. రేణుకకు ముఖంపై తీవ్ర గాయమైం ది. సువర్ణకు కంటిపై గాయమైంది. క్షతగాత్రులను కరీంనగర్‌లోని మూడు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. మహేం దర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భారీగా తరలిన భూపాలపల్లివాసులు.. వీరయ్య కుమారులు సంజీవ్, సురేష్, మహేందర్ ఎలక్ట్రానిక్స్, డ్రెస్సెస్ షాపులు నడుపుతూ అందరితో కలుపుగోలుగా ఉండేవారు. సమాచారం అందుకున్న వెంటనే వ్యాపారులు, స్నేహితులు కరీంనగర్‌కు భారీగా తరలివెళ్లారు. ఈ ఘట నతో పట్టణం ఒక్కసారిగా మూగబోయింది. ఎవరి నోట విన్నా ఇదే ప్రమాదంపై చర్చిస్తూ బాధను వెలిబుచ్చారు. ఇంటికి చేరిన మృతదేహాలు.. ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు.. ప్రమాదంలో మృతిచెందిన నలుగురి మృతదేహాలను బంధువులు మంగళవారం రాత్రి 6.30 గంటలకు భూపాలపల్లికి తీసుకొచ్చారు. మృతులు వీరయ్య, సరోజన, అనూష, నిష్కు కనీసం దహన సంస్కారాలు చేయలేని దుస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులంతా ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో ఉండడంతో పట్టణవాసులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలు భూపాలపల్లికి చేరుకున్నాయన్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి కంటతడి పెట్టారు. -
ఘనంగా దీపావళి
ముంబై: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళిని ముంబై వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వ్యాపారులంతా లక్ష్మీపూజలు నిర్వహించడం కనిపించింది. రాముడు లంకాధీశుడు రావణాసురుడిపై విజయం సాధించి సతీసమేతంగా రాజ్యానికి తిరిగిరావడానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతాయి. ఆదివారం కార్తీక అమావాస్య కావడం వల్ల గ్రహణం రావాల్సి ఉన్నా భారత్‌లో కనిపించలేదని నిపుణులు తెలిపారు. వ్యాపారులు ఆదివారం సాయంత్రం 6.02 గంటల నుంచి 8.35 గంటల మధ్య లక్ష్మీపూజలు నిర్వహించారు. చాలా మంది గృహస్తులు కొత్తగా కొనుగోలు చేసి బంగారు, వెండి ఆభరణాలకు కూడా పూజాధికాలు నిర్వహించారు. ముంబాదేవి, మహాలక్ష్మి, స్వామినారాయణ్ ఆలయాల్లో సంప్రదాయ చోప్డీ పూజ నిర్వహించారు. ‘దాదాపు వెయ్యి ఖాతా పుస్తకాలకు ఇక్కడ పూజలు చేశాం. ఇంతకుముందైతే చాలా పుస్తకాలు వచ్చేవి. అయితే చాలా మంది కంప్యూటర్లలోనే ఖాతాలను నిర్వహించడం వల్ల ఈ సంఖ్య తగ్గింది’ అని దాదర్ స్వామినారాయణ్ ఆలయ పూజారి నాగర్ తెలిపారు. కొందరు కంప్యూటర్ తెరముందు నోటుపుస్తకాలు ఉంచి చోప్డీ పూజ నిర్వహిస్తారు. దీపావళి పర్వదినాన స్నేహితులు, బంధువులకు మిఠాయిలు, కానుకలు తప్పనిసరిగా పంచాలని, దురదృష్టవశాత్తూ నగర జీవనశైలిలో ఈ సంప్రదాయం కనుమరుగవుతోందని నాగర్ అన్నారు. ఇక ముంబై మార్కెట్లన్నీ శని, ఆదివారాల్లో కళకళలాడాయి. పెద్ద ఎత్తున బాణసంచా విక్రయాలు జరిగాయి. షిర్డీలో ఘనంగా దీపోత్సవాలు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని షిర్డీలో ఘనంగా దీపోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఆబాలగోపాలం అంతా వేలాది దీపాలను వెలిగించారు. షిర్డీలోని ద్వారకమాయిలో దీపావళి సందర్భంగా నీటితోనే సాయిబాబా దీపాలను వెలిగించినట్టు భక్తులు చెబుతుంటారు. దీంతో ప్రతి దీపావళి పండుగ సందర్భంగా షిర్డీ ఆలయంలో దీపోత్సవాలను నిర్వహిస్తారు. ఈసారి కూడా నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాది దీపాలను వెలిగించారు. దీంతో ఈ దీపాలను చూసేం దుకు భారీ ఎత్తున భక్తులు షిర్డీకి తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలతోపాటు దీపావళి సెల వుల కారణంగా షిర్డీలో భక్తుల రద్దీ కూడా గణనీయంగా పెరిగిందని ఆలయ ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు.