
ఔరంగాబాద్:మహారాష్ట్రలోని షిరిడీ సాయినాథుడు కొలువైన అహ్మద్‌నగర్ జిల్లా పేరు మారిపోయింది.అహ్మద్‌నగర్‌ను అహిల్యానగర్‌గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో అహ్మద్‌నగర్‌ను ఇక అహిల్యానగర్‌గా పిలవనున్నారు.
18వ శతాబ్దంలో ఇండోర్‌ను పరిపాలించిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యాదేవి పేరు మీద అహ్మద్‌నగర్‌కు అహిల్యనగర్ అనే పేరు పెట్టారు.చాలా ఏళ్లుగా అహ్మద్‌నగర్ పేరు మార్చాలన్న డిమాండ్ ఉందని, ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి వీకే పాటిల్ చెప్పారు.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీహోదాపై నిరసనలు