Ahmednagar
-
అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్
ఔరంగాబాద్:మహారాష్ట్రలోని షిరిడీ సాయినాథుడు కొలువైన అహ్మద్‌నగర్ జిల్లా పేరు మారిపోయింది.అహ్మద్‌నగర్‌ను అహిల్యానగర్‌గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో అహ్మద్‌నగర్‌ను ఇక అహిల్యానగర్‌గా పిలవనున్నారు.18వ శతాబ్దంలో ఇండోర్‌ను పరిపాలించిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యాదేవి పేరు మీద అహ్మద్‌నగర్‌కు అహిల్యనగర్ అనే పేరు పెట్టారు.చాలా ఏళ్లుగా అహ్మద్‌నగర్ పేరు మార్చాలన్న డిమాండ్ ఉందని, ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి వీకే పాటిల్ చెప్పారు. ఇదీ చదవండి: మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీహోదాపై నిరసనలు -
Lok Sabha Election 2024: పవార్ వర్సెస్ పాటిల్
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ లోక్‌సభ స్థానం 2009 నుంచీ బీజేపీ కంచుకోట. అక్కడ ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, రాధాకృష్ణ విఖే–పాటిల్ కుటుంబాల మధ్య ఇక్కడ చిరకాలంగా శత్రుత్వం కొనసాగుతోంది. ఈసారి విఖే పాటిల్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ సుజయ్ మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే నీలేశ్ లంకేను ఎన్సీపీ (ఎస్పీ) తరఫున పవార్ తొలిసారి లోక్‌సభ బరిలో నిలిపారు. కుమారున్ని ఎలాగైనా గెలిపించుకోవాలని రాధాకృష్ణ, అగాడీ మద్దతుతో లంకేను గట్టెక్కించి పైచేయి సాధించాలని పవార్ పట్టుదలతో ఉన్నారు. అహ్మద్‌నగర్‌లో నేడు పోలింగ్ జరుగుతోంది. సుజయ్‌కి ఈజీ కాదుసుజయ్ ముత్తాత విఠల్‌రావు విఖే పాటిల్ దేశంలో తొలి చక్కెర సహకార కర్మాగారం స్థాపించారు. తండ్రి రాధాకృష్ణ ప్రస్తుత ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రి. 2019లో రాధాకృష్ణ బీజేపీలో చేరారు. అంతకు ముందు రెండు దశాబ్దాలు కాంగ్రెస్‌తో, అంతకుముందు శివసేనలో ఉన్నారు. 1995 నుంచి అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాధాకృష్ణ తండ్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ 8 సార్లు ఎంపీగా చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సుజయ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నేత సంగ్రామ్ జగ్తాప్‌పై భారీ మెజారిటీతో నెగ్గారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గంతో కొనసాగుతున్న సంగ్రామ్ జగ్తాప్ ఈసారి సుజయ్ కోసం ప్రచారం చేస్తుండటం విశేషం. అజిత్ నుంచి ప్రధాని మోదీ దాకా అగ్ర నేతలు కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. అయినా ఈసారి సుజయ్ విజయం అంత తేలిక కాదంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నపవార్.. నీలేశ్ లంకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్నర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ టికెట్‌పై గెలిచారు. 2023లో పార్టీ చీలిక తర్వాత అజిత్ వర్గంలోకి వెళ్లి తర్వాత శరద్ వర్గంలోకొచ్చారు. జిల్లా రాజకీయాలపై పట్టున్న ఆయన సుజయ్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలను ధనబలం, ప్రజాబలం మధ్య పోరుగా అభివరి్ణస్తున్నారు. కరోనా వేళ ఉచిత చికిత్స ప్రజల మనసు గెలుచుకుంది. సహకార నాయకుడు, కాంగ్రెస్∙మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ తదితరుల మద్దతు నీలేశ్‌కు కలిసి రానుంది. శరద్ పవార్ కూడా ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మక తీసుకుని సుడిగాలి ప్రచారం చేశారు. నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ వంటి స్థానిక సమస్యలపైనే నీలేశ్ తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత
బావిలో పడిన పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బయోగ్యాస్ పిట్లోకి దిగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన కలకలం రేపింది. పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు దూకారు. అయితే ఊపిరాడక చనిపోయిన ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుందని అహ్మద్‌నగర్‌లోని నెవాసాపోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని అతణ్ణి ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్‌లుగా గుర్తించారు. చిన్న కుమారుడు విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బావి లోపలికి దిగిన తరువాత ఊపిరాడటంలేదని ఫిర్యాదు చేయడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, నిపుణులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్‌లు ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి 5 గంటలకు పైగా పట్టిందనీ, అందుకే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు విమర్శించినట్టు తెలుస్తోంది. #WATCH | Five people died in a bid to save a cat who fell into an abandoned well (used as a biogas pit) in Wadki village of Ahmednagar, Maharashtra, late at night. According to Dhananjay Jadhav, Senior Police Officer of Nevasa Police station, Ahmednagar, "A rescue team… pic.twitter.com/fb4tNY7yzD — ANI (@ANI) April 10, 2024 -
అహల్యానగర్‌గా మారిన అహ్మద్‌నగర్.. కేబినెట్ ఆమోదం
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యానగర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరు మీదుగా అహ్మద్‌నగర్‌ను ‘అహల్యానగర్’గా మార్చాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. కాగా నిజాంషాహి వంశానికి చెందిన అహ్మద్ నిజాంషా పేరుతో 15వ శతాబ్ధంలో ఈ నగరానికి అహ్మద్‌నగర్ పేరు పెట్టారు. జిల్లా పేరు మార్చే ప్రతిపాదనను తొలుత సీఎం ఎక్నాథ్ షిండే గతేడాది మేలో ప్రకటించిన విషయం తెలిసిందే. అహల్యాభాయ్ 298వ జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఇక 2022లో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను శంభాజీనగర్, ధారాశివ్‌గా మార్చారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌లకు మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు, నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ల పేర్లు పెట్టారు. అయితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌లను ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చడంతో అహ్మద్‌నగర్ జిల్లా పేరును కూడా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. చదవండి: BJP: అరుణాచల్ అభ్యర్థుల జాబితా విడుదల -
శంషాబాద్‌లో అమానుషం: స్తంభానికి కట్టేసి.. మెడలో బ్యాటరీలతో సగం గుండు..
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని అహ్మద్‌నగర్ బస్తీలో అమానవీయ సంఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు.. అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఖుద్దూస్(20), మహ్మద్ ఖాజా(20) శనివారం ఉదయం మదీనా మజీదుగా గుండా వెళుతున్నారు. ఆటోలోని బ్యాటరీలను తస్కరించి వెళుతున్నట్లు అనుమానించిన అదే బస్తీకి చెందిన అబ్దుల్ రెహ్మన్, మహ్మద్ అలీ, జావేద్, మహ్మద్ గౌస్,మహ్మద్ బారీలు వీరిని అడ్డగించారు. స్థానికంగా ఉన్న స్తంభానికి ఇద్దరి కట్టేసి మెడలో బ్యాటరీలను వేలాడేశారు. అంతటితో ఆగకుండా ఇద్దరికి సగం గుండు గీయించారు. అనంతరం వారిని చితకబాది అక్కడి నుంచి పారిపోమన్నారు. ఈ తంతంగాన్నంతా వీడియోలు సైతం తీశారు. సంబంధిత వీడియోలు కూడా స్థానికంగా వైరల్ అయ్యాయి. అవమాన భారాన్ని తట్టుకోలేనిసదరు యువకులు సోమవారం రాత్రి ఆర్జీఐఏ పోలీసులకు ఆశ్రయించి జరిగిన వివరాలను వెల్లడించారు. దీంతో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు -
ఆన్లైన్ క్లాసులు పక్కనపెట్టి నగ్న వీడియోలతో బాలిక
అహ్మదాబాద్: ఆన్లైన్ క్లాసుల కోసం ఇప్పుడు పిల్లలకు విధిగా ఓ ఫోన్ ఇవ్వాల్సి వస్తోంది. అయితే ఆ పిల్లలు ఆ ఫోన్లను దుర్వినియోగం చేస్తూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తలనొప్పి తీసుకువస్తున్నారు. కొందరు ఆటలు ఆడుతూ డబ్బులన్నింటినీ తగిలేస్తుండడంతో మరికొందరు వివిధ వెబ్సైట్లు తెరచి అందులో కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇక అమ్మాయిలు ఆన్లైన్లో పరిచయమైన వారితో రహస్య వీడియోలు పంపుతుండడం.. అవి ఘోర సంఘటనలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి నగ్న వీడియోలు తీసుకుని ఓ వెబ్సైట్లో పోస్టు చేయడంతో వారికి గుండెపోటు వచ్చింది. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. (చదవండి: సమాజం తలదించుకునే ఘటన.. మహిళను వివస్త్ర చేసి.. కారం చల్లి) అహ్మదాబాద్‌కు చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ఆన్లైన్ క్లాసులు వింటోంది. అయితే ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని బంధువులు వారికి చెప్పారు. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. బంధువుల సహాయంతో వారు ఆస్పత్రిలో చేరారు. అనంతరం బాలికను వీడియో గురించి ఆరా తీయగా విస్తుగొల్పే విషయాలు తెలిపింది. ప్రత్యేక గదిలో ఆన్లైన్ క్లాసులు వింటున్న సమయంలో ఓ వైబ్‌సైట్ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. వాటిని చూడడం ప్రారంభించిన బాలిక వాటికి కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలో ఆన్లైన్లో కొందరితో పరిచయమైంది. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేస్తున్నారు. తరచూ అడుగుతుండడంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియో, ఫొటోలను ఆ వెబ్సైట్లో పోస్టు చేసింది. ఆ వీడియోకు స్పందన బాగా వచ్చింది. దీంతోపాటు తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని.. మీరు కూడా ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని చెప్పింది. ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చీవాట్లు పెట్టి ఈ బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ప్రత్యేక గదిలో చదువుకుంటుందని భావించగా ఇలాంటి పనులు చేస్తుందని తెలిసీ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. దీనిపై 181 కు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలికకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తొలగించేశారు. ఆ వెబ్సైట్ వివరాలు తెలుసుకుంటున్నారు. చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు -
కోపార్డి గ్యాంగ్‌రేప్ కేసులో సంచలన తీర్పు
పుణే : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కోపార్డి గ్యాంగ్ రేప్ కేసులో అహ్మద్‌నగర్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులను దోషులుగా ఖరారు చేసింది. వీరికి శిక్షలను నవంబర్ 22న ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. నిందితులు ముగ్గురు జితేంద్ర షిండే, సంతోష్ జి.భవల్, నితిన్ జి.భాయ్‌లుమేలు బాలికపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని న్యాయమూర్తి సువర్ణ కోవలె పేర్కొన్నారు . కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు.. వారు నేరానికి పాల్పడినట్లు నిరూపించాయని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేసు పూర్వపరాలు... 2016, జూలై 13న అహ్మద్‌నగర్ జిల్లా కోపార్డి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక దారుణంగా హత్యాచారానికి గురైంది. తన తాత ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. ముగ్గురు దుండగులు ఆమెను ఎత్తుకెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. బాధితురాలు మరాఠ తెగకి చెందిన యువతి కావటం.. నిందితులు దళితులు కావటంతో ఇరువర్గాల పరస్పర ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడుకిపోయింది. అదే సమయంలో నాసిక్‌లోని కొన్ని ప్రాంతాల్లో దళితులపై దాడులు కూడా జరగటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన ప్రభుత్వం, సమన్వయం పాటించాలంటూ ఇరువర్గాలను శాంతింపజేసి.. ఉజ్జల్ నికమ్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించి కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. సుమారు 6 నెలలపాటు దర్యాప్తు చేపట్టిన ప్రాసిక్యూషన్ దర్యాప్తు ఆధారంగా మొత్తం 350 పేజీల ఛార్జ్‌షీట్‌తోపాటు 24 ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అయితే ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేకపోవటంతో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలనే పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం(బాధితురాలి రక్తపు మరకలు.. నిందితుల దుస్తులపై ఉన్న మరకలతో సరిపోలటంతో) వారిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించినట్లు నికమ్ వెల్లడించారు. బాలిక తల్లి స్పందన... కాగా, కోర్టు తీర్పు పట్ల బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, పోరాటంలో పాలుపంచుకున్న మరాఠా ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దోషులకు మరణశిక్ష విధించాలని ఈ సందర్భంగా ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. -
మాజీ సైనికుని కుటుంబం దారుణ హత్య
-అహ్మద్‌నగర్‌లో వెలుగుచూసిన ఘటన సాక్షి, ముంబై: అహ్మద్‌నగర్ జిల్లాలోని శేవ్‌గావ్ తాలూకాలో మాజీ సైనికుని కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఇందులో మాజీ సైనికుడు అప్పాసాహెబ్ హరవణే (50), భార్య సునంద (45), కూతురు స్నేహల్ (21), కుమారుడు మకరంద్ (14) ఉన్నారు. అప్పాసాహెబ్ ఓ ప్రభుత్వ సంస్థలో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పాలవాడు వచ్చి తలుపు తట్టినప్పటికీ ఎవరు తీయలేదు. దీంతో ఇరుగుపొరుగువారి సాయంతో కిటికీ తలుపులు పగలగొట్టి తొంగి చూడగా కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పదునైన కత్తులతో దాడి చేసి హతమార్చి ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కేసును పరిశీలిస్తున్నారు. -
భూతగాదాలు.. ఐదేళ్ల బాలుడిపై కాల్పులు
అహ్మద్ నగర్(మహారాష్ట్ర) : భూతగాదాలు అభం శుభం తెలియని ఓ చిన్నారికి బుల్లెట్ గాయాన్ని మిగిల్చాయి. ఐదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడన్న ఆరోపణలతో రిటైర్డ్ ఆర్మీ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అహ్మద్ నగర్ జిల్లాలోని శ్రిగొండె తాలుకా సురోడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాలుడిపై కాల్పులు జరిపిన వ్యక్తి కొన్నెళ్ల కిందట ఉద్యోగ విరమణపొందిన ఆర్మీ అధికారి సంజయ్ కాటేగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సంజయ్ కాటే, కందేకర్లకు చెందిన భూములు పక్క పక్కనే ఉన్నాయి. భూముల్లోకి వెళ్లడానికి దారికి సంబంధించి ఇరువురి మధ్య కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సంజయ్ కాటే తన భూమిని అక్రమంగా ఆక్రమించుకొని తనను బెదిరించాడని కందేకర్ బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోపేద్రిక్తుడైన సంజయ్ కాటే తన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో కందేకర్ అల్లుడు కరన్(5) పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో కరన్ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కరన్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుపాకీని సీజ్ చేసి, సంజయ్ కాటేను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వర్తమానాన్ని పట్టుకోలేము!
ప్రముఖుల ఉత్తరాలు అహ్మద్నగర్కోట, 15 జూన్ 1943. ప్రియ మిత్రమా! అరబ్ దేశానికి చెందిన వేదాంతి అబుల్ అలామొ అర్రీ... మన జీవితమునంతటిని మూడే మూడు దినములలో చుట్టివేసినాడు. గడిచిన దినము అనగా... నిన్న. గడుచుచున్న దినము అనగా... ఈ రోజు. రానున్న దినము అనగా... రేపు. అసలీ వర్తమానం అనే కాలమెక్కడ ఉన్నది? వర్తమానం అనేది భూత, భవిష్కత్కాలాల రూపము మాత్రమేగాని ప్రత్యేక వర్తమానం అన్నది లేదు. వర్తమానం అనేది ఎంత వేగంతో వచ్చి వెళ్లునంటే, మనం దాన్ని వెంబడించి పట్టుకోలేము. మనం దానిని సమీపించి పట్టుకొనే లోపు తన ప్రకృతిని వెంటనే మార్చివేయును. అప్పుడు అది భూతకాలమో లేక భవిష్యత్కాలమో అయిపోవును. వర్తమానమన్నది ఇక ఉండనే ఉండదన్నమాట. మనం పట్టుకోదలచినదేమో వర్తమానం. కానీ మన చేతికందేది మాత్రం భూతకాలమే! ఈ కారణం వలన కాబోలు అబుల్తాలిబ్ కలీం అనే కవికి జీవితమనేది రెండే రెండు రోజులదిగా కనిపించింది. అందుకే ఇలా రాశాడు... ‘జీవితం... ఇది రెండు రోజుల కంటే మించినది కాదు. నీకేమని చెప్పను ఈ రెండు రోజులెట్లు గడిచినవని! ఒక దినము దీనియందును, దానియందును మనసు లగ్నం చేయుటలో పోయినది. రెండవరోజు వాటి నుండి మనసును మరల్చుటతో గడిచిపోయినది.’ - దేశసేవకు, సాహిత్యసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్. ఆయన అహమద్‌నగర్ జైలులో ఉన్నప్పుడు తన మిత్రుడు సదర్‌యార్ జంగ్కు ఎన్నో ఉత్తరాలు రాశారు. అవి ‘గుబారే ఖాతీర్’ పేరుతో పుస్తకంగా వచ్చాయి. ఆ లేఖలను ‘తలపుల దుమారం’ పేరుతో దేవులపల్లి రామానుజరావు తెలుగులోకి అనువదించారు. -
ముండే సంతాపసభలో రివాల్వర్ మిస్‌ఫైర్
సాక్షి, ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు నివాళులర్పించేందుకు ఏర్పాటుచేసిన సంతాపసభలో ఓ రివాల్వర్ మిస్‌ఫైర్‌అయింది. అదృష్టవశాత్తు అం దులోంచి వెలువడిన బుల్లెట్ ఎవరికీ తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే.. అహ్మద్‌నగర్ పట్టణంలోని ఓ సభాగృహంలో ఆదివారం వివిధ పార్టీల నాయకులు సంతాపసభ ఎర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్నేర్ తాలూకా నుంచి స్థానిక నాయకుడు సంభాజీ రోహోకలే వచ్చారు. నివాళులర్పిం చిన తరువాత తిరిగి బయటకు వెళుతుండగా ఆయన నడుం ఉన్న రివాల్వర్ కిందపడింది. దీంతో అది ఒక్కసారిగా పేలింది. అక్కడున్న పోలీసు వెంటనే రివాల్వర్‌తోసహా అయనను అదుపులోకి తీసుకున్నారు.