Man Head shave Under The Suspect Of Theft In Shamshabad - Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో అమానుషం: ఆ పని చేశారని స్తంభానికి కట్టేసి.. గుండు గీయించారు

Published Tue, Dec 21 2021 8:18 AM | Last Updated on Tue, Dec 21 2021 10:33 AM

Shamshabad: Shaves Mans Head Under The Suspect Of Theft - Sakshi

యువకుల మెడలో బ్యాటరీలు వేసి స్తంభానికి కట్టేసిన దృశ్యం

సాక్షి, శంషాబాద్‌: శంషాబాద్‌ పట్టణంలోని అహ్మద్‌నగర్‌ బస్తీలో అమానవీయ సంఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు.. అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఖుద్దూస్‌(20), మహ్మద్‌ ఖాజా(20) శనివారం ఉదయం మదీనా మజీదుగా గుండా వెళుతున్నారు. ఆటోలోని బ్యాటరీలను తస్కరించి వెళుతున్నట్లు అనుమానించిన అదే బస్తీకి చెందిన అబ్దుల్‌ రెహ్మన్, మహ్మద్‌ అలీ, జావేద్, మహ్మద్‌ గౌస్,మహ్మద్‌ బారీలు వీరిని అడ్డగించారు.

స్థానికంగా ఉన్న స్తంభానికి ఇద్దరి కట్టేసి మెడలో బ్యాటరీలను వేలాడేశారు. అంతటితో ఆగకుండా ఇద్దరికి సగం గుండు గీయించారు. అనంతరం వారిని చితకబాది అక్కడి నుంచి పారిపోమన్నారు. ఈ తంతంగాన్నంతా వీడియోలు సైతం తీశారు. సంబంధిత వీడియోలు కూడా స్థానికంగా వైరల్‌ అయ్యాయి. అవమాన భారాన్ని తట్టుకోలేనిసదరు యువకులు సోమవారం రాత్రి ఆర్‌జీఐఏ పోలీసులకు ఆశ్రయించి జరిగిన వివరాలను వెల్లడించారు. దీంతో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement