భూతగాదాలు.. ఐదేళ్ల బాలుడిపై కాల్పులు
భూతగాదాలు.. ఐదేళ్ల బాలుడిపై కాల్పులు
Published Wed, Nov 23 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
అహ్మద్ నగర్(మహారాష్ట్ర) : భూతగాదాలు అభం శుభం తెలియని ఓ చిన్నారికి బుల్లెట్ గాయాన్ని మిగిల్చాయి. ఐదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడన్న ఆరోపణలతో రిటైర్డ్ ఆర్మీ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అహ్మద్ నగర్ జిల్లాలోని శ్రిగొండె తాలుకా సురోడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
బాలుడిపై కాల్పులు జరిపిన వ్యక్తి కొన్నెళ్ల కిందట ఉద్యోగ విరమణపొందిన ఆర్మీ అధికారి సంజయ్ కాటేగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సంజయ్ కాటే, కందేకర్లకు చెందిన భూములు పక్క పక్కనే ఉన్నాయి. భూముల్లోకి వెళ్లడానికి దారికి సంబంధించి ఇరువురి మధ్య కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సంజయ్ కాటే తన భూమిని అక్రమంగా ఆక్రమించుకొని తనను బెదిరించాడని కందేకర్ బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కోపేద్రిక్తుడైన సంజయ్ కాటే తన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్తో కందేకర్ అల్లుడు కరన్(5) పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో కరన్ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కరన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుపాకీని సీజ్ చేసి, సంజయ్ కాటేను పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement