Retired army man
-
రైలు కిందపడి బాలాజీ ఆత్మహత్య!
సాక్షి, గుంటూరు: ఓ మహిళపై నాటు తుపాకీతో కాల్పులు జరిపి పరారైన ఆర్మీ మాజీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు బాలాజీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని చెరుకుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతుడు బాలాజీ తల్లిదండ్రులను ఆదివారం ఘటనా స్థలానికి తీసుకు వెళ్లారు. మృతదేహం బాలాజీదేనని అతడి తల్లిదండ్రులు నిర్థారించారు. కాగా పోలీసుల కథనం మేరకు కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన యేమినేని బాలాజీ గతంలో ఆర్మీలో పనిచేసేవాడు. అతను మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన రమాదేవి కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లొంగదీసుకున్నాడు. తీరా వివాహం చేసుకోమని యువతి ప్రశ్నించగా అదిగో ఇదిగో అంటూ కాలం గడిపి.. చివరకు తనకు సంబంధం లేదన్నాడు. దీంతో బాధిత యువతి తన తల్లితో కలిసి బాపట్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 2019 డిసెంబర్ రెండో తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయడంతో బాలాజీ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వారిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం వేకువజామున సుమారు రెండు గంటల సమయంలో తన స్నేహితుడి సాయంతో ఆటోలో నడింపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. తలుపులు కొట్టగా యువతి తల్లి రమాదేవి తలుపులు తీసింది. అంతలో బాలాజీ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్చాడు. అప్రమత్తమైన రమాదేవి పక్కకు తప్పుకోవటంతో ఆమె చెవికి తూటా తగిలింది. తుపాకీ శబ్దం, రమాదేవి కేకలు విని స్థానికులు బాలాజీని పట్టుకునే ప్రయత్నం చేశారు. తుపాకీతో స్థానికులను బెదిరించి తనతోపాటు వచ్చిన ఆటో డ్రైవర్‌తో కలిసి పరారయ్యాడు. గాయపడ్డ రమాదేవిని స్థానికులు దగ్గరలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా∙స్థలానికి చేరుకుని సమీపంలో పడిఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు తనను ఎలాగైనా అరెస్ట్ చేస్తారనే భయంతో బాలాజీ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. -
గుంటూరులో కాల్పుల కలకలం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ నాటు తుపాకీతో కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళ గాయపడ్డారు. దీంతో స్థానికులు గాయపడ్డ మహిళను తెనాలి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన రిటైర్డ్ జవాన్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. కుటంబ కలహాల కారణంగానే ఆర్మీ జవాన్ కాల్పులకు పాల్పడినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారైన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. -
నోట్ల రద్దు.. రిటైర్డ్ జవాను ఫేమస్!
గుర్గావ్ : పెద్ద నోట్ల రద్దు ప్రకటించి నేటికి ఏడాది. ఈ సందర్భంగా నోట్ల రద్దు సమయంలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది క్యూలైన్స్‌లో నిల్చోలేక పడ్డ కష్టాలను, మరికొంత మంది నోట్ల రద్దు వల్ల తమకు చేకూరిన ప్రయోజనాలను గుర్తు చేసుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు కాలంలో రోజుల తరబడి క్యూలైన్ల్లో నిల్చున్నప్పటికీ చాలామందికి నగదు లభ్యం కాకనే నిరాశే ఎదురయ్యేది. ఇదే అనుభవం ఓ రిటైర్డ్ జవానుకు ఎదురైంది. పెన్షన్ కోసం మూడు రోజలు పాటు బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ, ఎలాంటి ప్రయోజనం దక్కకపోవడంతో బ్యాంకు వద్దే కన్నీటి పర్యంతమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో హిందూస్తాన్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో ట్విటర్లో ఆయన గురించి అందరికీ తెలిసేలా చేసింది. అంతేకాక అప్పటి వరకు ఎవరికీ తెలియని, ఎవరూ గుర్తించని ఆయనను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. నోట్ల రద్దుతో ఆయన ఎంత ఫేమస్ అయ్యాడంటే.. ఏడాదిగా తాను సాగిస్తున్న జీవితం గురించి ఆ జవాను మాటల్లోనే వింటే అర్థమవుతోంది. నంద్ లాల్ గుర్గావ్లోని భీమ్ నగర్లో అద్దె ఇంట్లో ఒంటరిగా జీవితం సాగిస్తున్న ఓ రిటైర్డు జవాను. 1971లో భారత్-పాకిస్తాన్‌కు మధ్య జరిగిన యుద్ధంలో నంద్ లాల్ ఆర్మీలో పనిచేశారు. విభజనాంతరం పాకిస్తాన్ నుంచి ఆయన గుర్గావ్కు నివాసం వచ్చారు. మూడు దశాబ్దాల క్రితమే నంద్ లాల్ భార్య మరణించారు. సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూతురి పెళ్లి సమయంలో ఆ ఇంటిని అమ్మేయడంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చింది. కూతురు తనతోనే ఉండమని కోరినప్పటికీ, ఒంటిరిగానే ఆయన తన జీవనం సాగిస్తున్నారు. ఆర్మీలో పనిచేయడం వల్ల నంద్ లాల్‌కు నెలకు రూ.19,700 పెన్షన్, అదనంగా తన కూతురు మరో రూ.8000 పంపిస్తుంటుంది. పెద్ద నోట్ల రద్దు చేసిన సమయంలో తనకు వచ్చే పెన్షన్ కోసం గుర్గావ్లోని ఎస్బీఐ న్యూ కాలనీ బ్రాంచ్‌కు వెళ్లారు. మూడు రోజుల పాటు బ్యాంకు చుట్టూ తిరిగినప్పటికీ ఆయనకు ఎలాంటి పెన్షన్ లభించకపోయే సరికి, బ్యాంక్ వద్దే కన్నీంటిపర్యంతమయ్యారు. ఆ సమయంలో హిందూస్తాన్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోతో ఆయన గమనం మారిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరించడం, ముఖ్యంగా బ్యాంకు అధికారులు ఈ జవానుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి సమస్య లేదంటున్నారు ఈ జవాను. గతేడాది డిసెంబర్ 14 వరకు ఎవరికి తెలియని తనను, పెద్ద నోట్ల పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారంటున్నారు. -
భూతగాదాలు.. ఐదేళ్ల బాలుడిపై కాల్పులు
అహ్మద్ నగర్(మహారాష్ట్ర) : భూతగాదాలు అభం శుభం తెలియని ఓ చిన్నారికి బుల్లెట్ గాయాన్ని మిగిల్చాయి. ఐదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడన్న ఆరోపణలతో రిటైర్డ్ ఆర్మీ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అహ్మద్ నగర్ జిల్లాలోని శ్రిగొండె తాలుకా సురోడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాలుడిపై కాల్పులు జరిపిన వ్యక్తి కొన్నెళ్ల కిందట ఉద్యోగ విరమణపొందిన ఆర్మీ అధికారి సంజయ్ కాటేగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సంజయ్ కాటే, కందేకర్లకు చెందిన భూములు పక్క పక్కనే ఉన్నాయి. భూముల్లోకి వెళ్లడానికి దారికి సంబంధించి ఇరువురి మధ్య కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సంజయ్ కాటే తన భూమిని అక్రమంగా ఆక్రమించుకొని తనను బెదిరించాడని కందేకర్ బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోపేద్రిక్తుడైన సంజయ్ కాటే తన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో కందేకర్ అల్లుడు కరన్(5) పై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో కరన్ కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కరన్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుపాకీని సీజ్ చేసి, సంజయ్ కాటేను పోలీసులు అరెస్ట్ చేశారు.