
సాక్షి, గుంటూరు: జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ నాటు తుపాకీతో కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళ గాయపడ్డారు. దీంతో స్థానికులు గాయపడ్డ మహిళను తెనాలి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన రిటైర్డ్ జవాన్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. కుటంబ కలహాల కారణంగానే ఆర్మీ జవాన్ కాల్పులకు పాల్పడినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారైన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment