open firing
-
నైజీరియాలో దుండగుల కాల్పులు.. 100 మందికిపైగా మృతి
మైదుగురి: నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు గుంపు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 100 మంది మృతి చెందారు. వివరాలు.. ఈశాన్య నైజీరియా యోబే రాష్ట్రంలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలోకి 50 మంది దుండగులు మార్కెట్లో పాటు పలు ఇళ్లపై కాల్పులు జరిపారు. పెద్దసంఖ్యలో దుండగులు బైకులపై వచ్చి పలు భవనాలకు నిప్పంటించి అనంతరం కాల్పులకు తెగపడ్డారని యోబ్ పోలీసు ప్రతినిధి డంగస్ అబ్దుల్కరీమ్ తెలిపారు. At least 127 people have been killed following an attack by Boko Haram militants on motorcycles in a northeastern Nigerian village. The assailants set shops and homes on fire. This information comes from Amnesty International via AA.#BokoHaram #NigeriaAttack… pic.twitter.com/cNN7kc1dwo— Live Updates (@LiveupdatesUS) September 3, 2024ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పులను బోకోహరం ఉగ్రవాదుల దుశ్చర్యగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాఫ్రికాలోని నైజీరియాలో వేల మందిని పొట్టన పెట్టుకొని, ఎంతో మందిని ఈ ఉగ్రసంస్థ అపహరించిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ ప్రాంతంలో ఇస్లామిక్ చట్టం లేదా షరియా చట్టాలతో కూడిన రాజ్యాన్ని స్థాపించేందుకు తిరుగుబాటు ప్రారంభించింది. -
కాబోయే సైనికుడు రాకేష్ అంతిమ యాత్ర
-
అంతిమ యాత్రకు బయలుదేరిన రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు
-
సికింద్రాబాద్ ఆందోళనకారులపై పోలీస్ ఫైరింగ్
-
గుంటూరులో కాల్పుల కలకలం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. ఓ రిటైర్డ్ ఆర్మీ జవాన్ నాటు తుపాకీతో కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళ గాయపడ్డారు. దీంతో స్థానికులు గాయపడ్డ మహిళను తెనాలి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన రిటైర్డ్ జవాన్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. కుటంబ కలహాల కారణంగానే ఆర్మీ జవాన్ కాల్పులకు పాల్పడినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారైన రిటైర్డ్ ఆర్మీ జవాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. -
ఐఏఎస్ అకాడమీలో కాల్పులు
ముస్సోరి: ముస్సోరిలోని ప్రముఖ ఐఏఎస్‌ల శిక్షణ కేంద్రం 'లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఐఏఎస్ ట్రైనీస్' వద్ద ఓ జవాను కాల్పులు జరపడంతో అతడి సహచరుడు చనిపోయాడు. మరో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం అతడు పారిపోయాడు. కాల్పులు జరిపిన సైనికుడు ఇండో-టిబెట్ సరిహద్దు పోలీసు విభాగానికి చెందినవాడు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పారిపోయిన జవానుకోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. -
ముంబైలో నా మనవడిపైనా హత్యాయత్నం
విజయవాడ : భూతం దుర్గారావు హత్యకేసులో కేవలం అనుమానించి తమ కుటుంబంపై కేసులు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారని మృతుడు గంధం నాగేశ్వరరావు భార్య యాదగిరమ్మ ఆరోపించింది. దుర్గారావు హత్యతో ఎలాంటి సంబంధం లేకపోయినా తన భర్తను, పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారని ఆమె భోరున విలపించింది. ముంబయిలో తన మనవడిపై కూడా హత్యాయత్నం జరిగిందని యాదగిరమ్మ ఆరోపించింది. పది కోట్లు ఖర్చు పెట్టి ఈ హత్యలు చేశారని ఆమె తెలిపింది. కాగా కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద బుధవారం దారుణ హత్యకు గురైన ముగ్గురు వ్యక్తులు, వారిని హతమార్చిన వ్యక్తులు దగ్గరి బంధువులే. కుటుంబ కలహాలు, వృత్తిలో ఏర్పడిన విభేదాలు, రాజకీ య విద్వేషాలు బంధుత్వాన్ని సైతం మర్చిపోయేలా చేశాయి. వారి మధ్య పగ, ప్రతీకారాలు మొత్తంగా ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. -
బైక్‌పై ఉండి కాల్పుల ఘటనను ప్రత్యక్షంగా చూశారు
ఏలూరు : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద ముగ్గురి దారుణ హత్యల కేసులో పోలీసులు ... ఇద్దరు నిందితుల్ని గుర్తించారు. ఈ హత్యలకు సంబంధించి పోలీసులు మరికొన్ని ఆధారాలు సేకరించారు. హత్యలకు ప్రణాళికలు వేసింది భూతం శ్రీనివాసరావు, అతని అనుచరుడు పురాణం గణేష్‌ను పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు ప్రణాళిక అమలు చేసేందుకు వీరు హనుమాన్ జంక్షన్‌లోని లాడ్జిలో బస చేశారు. అక్కడ దొరికిన సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితుల విషయంలో పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. వీరితో పాటు నలుగురు నిందితులు ముంబైకి చెందినవారుగా పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా పుటేజ్‌లో శ్రీనివాసరావు, పురాణం గణేష్‌లను హతుల కుటుంబ సభ్యురాలు శ్రీదేవి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుల సెల్‌ఫోన్ డేటాను సేకరిస్తున్నారు. మరోవైపు నిందితుల వేలిముద్రలు కూడా సరిపోలాయి. కాగా ఘటనా స్థలంలో బైక్‌పై ఉండి కాల్పుల ఘటనను శ్రీనివాసరావు, గణేష్ ప్రత్యక్షంగా చూసినట్లు సమాచారం. ఏలూరు, హనుమాన్ జంక్షన్ లాడ్జిల్లో ఉండి మూడు రోజుల పాటు హత్యలకు పథకం వేసినట్లు సమాచారం. ఇక గతంలో భూతం దుర్గారావు హత్యకేసులో ప్రధాన నిందితుడు నాగరాజు సహా పదిమంది పోలీసులకు లొంగిపోయారు. అయితే ఏడుగురు నిందితులను అదుపులో ఉంచుకుని, మిగతా ముగ్గురిని పోలీసులు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మృతి చెందిన ముగ్గురికి ఇంకా పోస్ట్‌మార్టం పూర్తి కాలేదు. పోలీసులు అందుబాటులో లేకపోవటం....సమయం మించిపోయిన తర్వాత పంచనామా పత్రాలు ఇవ్వటంతో నిన్న పోస్ట్‌మార్టం కాలేదు. ఈరోజు పోస్ట్‌మార్టం పూర్తయ్యే అవకాశం ఉంది. -
భయం గుప్పిట్లో పినకడిమి గ్రామస్తులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి మండలం పినకడిమిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గ్రామంలో 15 చోట్ల పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు పినకడిమిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. 300మంది పోలీసులతో ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోకి మీడియా సిబ్బందిని కూడా అనుమతించటం లేదు. పినకడిమి పోలీసుల దిగ్బంధంలో ఉంది. బయటివారిని గ్రామంలోనికి అనుమతించడం లేదు. గ్రామంలో 15 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. నిందితులు, బాధితుల ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు అనుక్షణం పహారా కాస్తున్నారు. మరోవైపు ఏలూరులోని కొన్ని అపార్ట్మెంట్లలో కూడా పోలీసులు సోదాలు చేపట్టారు. -
మూడు హత్యల ఘటనలో దొరికిన మరో క్లూ!
విజయవాడ: విజయవాడ-ఏలూరు హైవేపై పెద్దవుటపల్లి వద్ద నిన్న జరిగిన మూడు హత్యలకు సంబంధించి మరో క్లూ దొరికింది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటనాస్థలానికి 5 కిలో మీటర్ల దూరంలో తొట్టిపాడు టోల్గేట్ వద్ద పార్క్ చేసిన పల్సర్ బైకును పోలీసులు కనుగొన్నారు. ఈ పల్సర్ బైకు నెంబరు ఏపి 27 ఏఎస్ 3400. నిన్నటి నుంచి ఆ బైకు అక్కడే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. షూటర్స్‌కు సమాచారం ఇచ్చేందుకు ఈ బైకును నిందితులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులు వాడిన కారును కూడా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాళ్లు బస చేసిన రాయల్ హంపీ హోటల్ వెనుక భాగంలోనే వారు వాడిన కారును వదిలి వెళ్లారు. కారులోని రెండు కత్తులు, తుపాకీతో పాటు రాడ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేసిన తర్వాత వీరంతా హోటల్‌కు చేరుకుని, తాపీగా బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, హత్యకు గురైనవారు ముందుగానే పోలీస్ రక్షణ అడిగినట్లు తెలుస్తోంది. అయితే గన్నవరం నుంచి రక్షణ కల్పించడం సాధ్యంకాదని, ఏలూరు వచ్చిన తరువాత రక్షణ కల్పిస్తామని పోలీసులు వారికి చెప్పినట్లుగా చెబుతున్నారు. పోలీసుల రక్షణ లేకుండా రావడం వల్లే వారు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. ** -
హత్యలు చేసి తాపీగా బిర్యానీ తినివెళ్లారు...
విజయవాడ : విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులకు క్లూ లభించింది. హంతకులు వాడిన కారును పోలీసులు గుర్తించారు. వాళ్లు బస వేసిన రాయల్ హంపీ హోటల్ వెనుక భాగంలోనే .. కారును వదిలి వెళ్లారు. కారులోని రెండు కత్తులు,తుపాకీతో పాటు రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యలు చేసిన తర్వాత వీరంతా తాపీగా హోటల్‌కు చేరుకున్న ..బిర్యానీ తిని వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తరువాత మరో రెండు కార్లలో రాజమండ్రి వైపు వెళ్లినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరో వైపు ట్రావెల్స్ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నేరగాళ్ల కోసం రెండు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. హంతకుల్లో అయిదుగురు బీహార్‌కు చెందినవారు కాగా, ఒకరిని స్థానికుడిగా గుర్తించినట్లు సమాచారం. -
లండన్‌లోనే ప్లాన్, రూ.3 కోట్లకు ఒప్పందం
విజయవాడ : విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనకు సంబంధించి కుట్రదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు ముంబయి ప్రొఫెషనల్ కిల్లర్స్‌తో రూ.3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా కిల్లర్స్ పరారీలో ఉన్నారు. హత్యలకు 032 రివాల్వర్‌ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. కుట్రదారులకు ముంబయి, కెనడా, లండన్‌ల్లో ఆస్తులు ఉన్నాయి. జేకే ప్యాలెస్ అధినేత దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ ముగ్గురిని హత్య చేయించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. లండన్‌లో ఉంటున్న దుర్గారావు బంధువు ఇక్కడ అనుచరుల సాయంతో ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచి, కిరాయి హంతకులతో పథకం రచించి అదును చూసి హత్యలు చేయించినట్లు అనుమానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన ముగ్గురు వ్యక్తులను నిన్న నడిరోడ్డుపై దారుణంగా కాల్చిచంపిన విషయం తెలిసిందే. -
పచ్చని సీమలో పచ్చి నెత్తురు
సాక్షి, ఏలూరు: పచ్చని పైరులతో ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో పచ్చి నెత్తురు పారింది. పగ.. ప్రతీకారాల నేపథ్యంలో ప్రాణా లు తీసే విష సంస్కృతి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విస్తరిస్తోంది. పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు గుంజుడు మారయ్య, పగిడి మారయ్యలను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణా జిల్లా పెదఅవుటపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై తుపాకులతో కాల్చి హత్య చేసిన ఘటనతో జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఆరు నెలల క్రితం జరిగిన జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ ముగ్గురిని హతమార్చారని తెలియడంతో పినకడిమి గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. దుర్గారావు, నాగేశ్వరరావు కుటుంబాలకు చెందిన వ్యక్తుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఒకరిని, ఏలూరు విజ యలక్ష్మి థియేటర్ వద్ద మరొకరు గతంలో హత్యకు గురయ్యూరు. ఆ తరువాత జేకే ప్యాలెస్ అధినేత దుర్గారావు, తాజా ఘటనలో తండ్రి, ఇద్దరు కొడుకులు హత్యకు గురయ్యూరు. రెండు కుటుంబాల మధ్య కక్షల నేపథ్యంలో ఇప్పటివరకు ఆరు హత్యలు జరిగాయి. వివాదం ప్రారంభమైందిలా పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో జ్యోతిష్యం వృత్తిగా జీవించే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాటిలో రెండు కుటుంబాల మధ్య ఐదేళ్ల క్రితం తలెత్తిన కుటుంబ వివాదం ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. జ్యోతిష్యుడు, ఏలూరులోని జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు పినకడిమి గ్రామంలో ఓ రాజకీయ పార్టీకి పెద్దగా ఉండేవారు. ఆయన సూచించిన వారికే పదవులు దక్కేవి. అతని అన్న గోవిందు కుమార్తెను అదే గ్రామానికి చెందిన కూరపాటి నాగరాజు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. నాగరాజు సోదరిని గంధం నాగేశ్వరావు వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల క్రితం గోవిందు కుమార్తె నాగరాజు కొడుకుపై వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో పామర్తి వెంకటేశ్వరరావు అనే మాజీ ఎంపీటీసీకి సర్పంచ్, ఎంపీటీసీ టిక్కెట్లు ఇచ్చేందుకు దుర్గారావు నిరాకరించడంతో గోవిందు, నాగరాజు కుటుంబాల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. దుర్గారావు హత్యతో పెరిగిన కక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రాత్రి దుర్గారావు పినకడిమి గ్రామంలోనే హత్యకు గురయ్యారు. అప్పటికే గొడవలు పడుతున్న నాగరాజు, సీటు దక్కించుకోలేకపోయిన వెంకటేశ్వరావు కలిసి ఈ హత్య చేశారనే ఫిర్యాదుతో పోలీసులు వారితోపాటు నాగరాజు కుమారులు, అతని బావ గంధం నాగేశ్వరావు ఇద్దరు కుమారులతో కలిపి మొత్తం 10మందిపై కేసు నమోదు చేశారు. దుర్గారావు హత్య జరిగిన మరునాడు నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇంటిపై దుర్గారావు బంధువులు దాడి చేశారు. దీంతో దుర్గారావు హత్య కేసులో నిందితులతోపాటు వారి కుటుంబ సభ్యులు ఊరి నుంచి పారి పోయారు. అనంతరం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశా రు. నాగరాజుతోపాటు అతని కుమారులు చిరంజీవి, శివకృష్ణ ముంబై వెళ్లి, అక్కడ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారు. కండిషనల్ బెయిల్‌పై విడుదలైన నాగేశ్వరరావు కుమారులు సైతం ముంబై వెళ్లిపోయారు. అక్కడే జ్యోతి ష్యం చెప్పుకుంటూ జీవిస్తున్నారు. కేసు వాయిదాల నిమిత్తం ఏలూరులోని జిల్లా కోర్టుకు వచ్చి వెళుతున్నారు. కోర్టుకు వస్తుండగా హత్య బుధవారం కోర్టు వాయిదా ఉండటంతో పినకడిమిలో ఉంటున్న గంధం నాగేశ్వరరావు ఏలూరు న్యూ ఎస్వీఎస్ ట్రావెల్స్ నుంచి ఏపీ 20వై 0500 నంబర్ గల టవేరా కారును అద్దెకు తీసుకున్నారు. ఉదయం 7గంటలకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కారు ఎక్కి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తన కుమారులు గుంజుడు మారయ్య, పగిడి మారయ్యలను ఏలూరు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో పెదఅవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో ఆ ముగ్గురినీ కాల్చి చంపారు. జాతీయ రహదారిపై విస్తృత తనిఖీలు ఏలూరు (వన్ టౌన్) : పినకడిమికి చెందిన ముగ్గురు వ్యక్తులను నడిరోడ్డుపై దారుణంగా కాల్చిచంపిన దుండగులు విజయవాడ-ఏలూరు జాతీయ రహదారి మీదుగా ఉడాయిస్తున్నారన్న సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు కలపర్రు టోల్‌గేటు వద్ద బలగాలతో మోహరించారు. విజయవాడ నుంచి ఏలూరు వచ్చే అన్ని వాహనాలను విసృ్తతంగా తనిఖీ చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ తనిఖీలు జరిగాయి. ద్విచక్ర వాహనం నుంచి ఆర్టీసీ బస్సుల వరకూ ఏ ఒక్కటీ వదలకుండా తనిఖీ చేసినా నిందితులు దొరకలేదు. లండన్‌లో ప్లాన్! జేకే ప్యాలెస్ అధినేత దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ ముగ్గురిని హత్య చేయించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. లండన్‌లో ఉంటున్న దుర్గారావు బంధువు ఇక్కడి అనుచరుల సహాయంతో ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచి, కిరారుు హంతకులతో పథకం రచించి అదును చూసి హత్య చేయించినట్టు అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి పినకడిమి వెళ్లి దుర్గారావు సంబంధీకులను విచారించారు. దుర్గారావు తోడల్లుడు పస్తం మారియ్య, బావమరిది కిన్నెర శివకృష్ణలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పించుకున్న డ్రైవర్ హత్యల అనంతరం టవేరా వాహనం డ్రైవర్ నరేష్ ఘటనా స్థలం నుంచి తప్పిం చుకుని బస్సులో ఏలూరు చేరుకుని వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రాణభయంతో ఉన్న అతను ఘటన జరిగిన తీరును వివరించాడు. ఏలూరు నుంచి గన్నవరం వెళ్లి కొందరిని తీసుకుని ఏలూరు కోర్టుకు తీసుకువచ్చి.. తిరిగి గన్నవరంలో దించి రావాలని తన యజమాని చెప్పడంతో ఇంటినుంచి వచ్చి వాహనాన్ని తీసుకువెళ్లానని వివరించాడు. నాగేశ్వరావు వన్‌టౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనం ఎక్కారని, మధ్యలో ఫోన్‌రాగా హనుమాన్ జంక్షన్ దగ్గరకు వచ్చేశామని అతను ఫోన్లో ఎదుటి వారితో చెప్పినట్టు నరేష్ తెలిపాడు. గన్నవరం నుంచి బయలుదేరిన తమ వాహనాన్ని మరో వాహనం మూడుసార్లు ఢీ కొట్టేందుకు ప్రయత్నించిందని.. నాలుగోసారి ఢీకొట్టడంతో డివైడర్ వద్ద తమ వాహనం నిలిచిపోయిందని వివరించాడు. వాహనం ఆగగానే తమను వెంబ డించిన వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు కిందికి దిగి తుపాకులతో కాల్పులు ప్రారంభించారన్నారు. ప్రాణ భయంతో డోర్ తీసుకుని వేరే డివైడర్ దాటి పరిగెత్తి ఏలూరు వైపు వచ్చే బస్సు ఎక్కేశానని, బస్‌స్టాండ్‌లో కాసేపు కూర్చుని పోలీస్ స్టేషన్‌కు వచ్చానని వివరించాడు. హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇన్‌షర్ట్ చేసుకుని నీట్‌గా ఉన్నారని, మొహాలకు ముసుగులు వంటివేమీ ధరించలేదని చెప్పాడు. పినకడిమిలో 144 సెక్షన్ పెదవేగి రూరల్ : పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం కొనసాగే వరకూ 144 సెక్షన్ కొనసాగుతుందని తహసిల్దార్ బి.సోమశేఖరరావు తెలిపారు. ఇదిలా ఉండగా, ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో పలుచోట్ల పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ సత్తిబాబు, ఎస్సై కె.స్వామి గ్రామంలో మకాం వేశారు. ద్వారకాతిరుమలలో వాహనాల తనిఖీ ద్వారకాతిరుమల : కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద హత్యలకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రముఖ యాత్రా స్థలం కావడంతో ద్వారకాతిరుమల ఆలయానికి వచ్చే అన్ని వాహనాలను ఎస్సై కర్రి సతీష్‌కుమార్, సిబ్బంది లక్ష్మీపురం వద్ద బుధవారం తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలు రాబట్టారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. -
పక్కా ప్లాన్‌తోనే హత్య.. రాజమండ్రికి పరారీ
-
పక్కా ప్లాన్‌తోనే హత్య.. రాజమండ్రికి పరారీ
పక్కాగా ప్లాన్ వేసుకున్న తర్వాతే విజయవాడ సమీపంలోని పెద అవుటపల్లి వద్ద దుండగులు హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వివరాలన్నీ క్రమక్రమంగా బయటపడుతున్నాయి. మూడు రోజుల నుంచి గన్నవరంలోని రాయల హంపి అనే హోటల్లో మకాం వేసిన దుండగులు.. కాల్పుల తర్వాత కూడా మళ్లీ అదే హోటల్‌కు వచ్చినట్లు తాజాగా తేలింది. అక్కడే తాము ఉపయోగించిన కారును వదిలేసి, మరో రెండు కార్లలో అక్కడినుంచి రాజమండ్రి వెళ్లారని చెబుతున్నారు. ముందుగా విశాఖపట్నం వరకు మాట్లాడుకుని కూడా రాజమండ్రిలో దిగిపోయి అక్కడినుంచి వేరే ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాళ్లు ప్రయాణించిన వాహనాల ట్రావెల్స్ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. హోటల్ ప్రాంగణంలో ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం, సూపర్ బజార్లలో గల సీసీటీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించారు. సూపర్ బజార్ కెమెరాలో అస్పష్టంగా నిందితుల చిత్రాలు కనిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతుల స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా చినకడిమిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గ్రామానికి చెందిన ముగ్గురిని ఒకేసారి హతమార్చడంతో అక్కడివారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.