ఐఏఎస్ అకాడమీలో కాల్పులు | Jawan Opens Fire in Prestigious IAS Academy, 1 Killed | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ అకాడమీలో కాల్పులు

Published Fri, Jul 10 2015 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

Jawan Opens Fire in Prestigious IAS Academy, 1 Killed

ముస్సోరి: ముస్సోరిలోని ప్రముఖ ఐఏఎస్ల శిక్షణ కేంద్రం 'లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఐఏఎస్ ట్రైనీస్' వద్ద ఓ జవాను కాల్పులు జరపడంతో అతడి సహచరుడు చనిపోయాడు. మరో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం అతడు పారిపోయాడు. కాల్పులు జరిపిన సైనికుడు ఇండో-టిబెట్ సరిహద్దు పోలీసు విభాగానికి చెందినవాడు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పారిపోయిన జవానుకోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement