సిర్సా: కశ్మీర్‌లోని బారాముల్లాలోగల గుల్‌మార్గ్‌లో జరిగిన ఉగ్రదాడిలో హర్యానాకు చెందిన 28 ఏళ్ల ఆర్మీ జవాను జీవన్ సింగ్ వీరమరణం పొందారు. ఆయన భౌతికకాయం ఆయన స్వస్థలమైన ఘరాకు చేరుకోగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరవీరుడు జీవన్‌సింగ్ మృతదేహం అతని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ అమరవీరునికి నివాళులర్పించేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.
కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని బూటా-పత్రి ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో రైఫిల్‌మెన్ జీవన్ సింగ్ రాథోడ్ వీరమరణం పొందారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు సహా నలుగురు మృతి చెందగా, జీవన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. నలుగురు సోదరీమణులకు జీవన్ సింగ్ ఏకైక సోదరుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు ఉన్నారు.
జీవన్ సింగ్ 2016లో సైన్యంలో చేరి, రాజ్‌పుతానా రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి, అతని కుమార్తెలు అనన్య, భీషా బోరున విలపించడం అక్కడున్న అందిరినీ కంట తడిపెట్టించింది. గ్రామంలోని శ్మశాన వాటికలో జీవన్ సింగ్ పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించింది. దీనిని చూసిన అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం
Comments
Please login to add a commentAdd a comment