cremated
-
అమర జవాను చితికి నిప్పంటించిన నాలుగేళ్ల చిన్నారి
సిర్సా: కశ్మీర్‌లోని బారాముల్లాలోగల గుల్మార్గ్లో జరిగిన ఉగ్రదాడిలో హర్యానాకు చెందిన 28 ఏళ్ల ఆర్మీ జవాను జీవన్ సింగ్ వీరమరణం పొందారు. ఆయన భౌతికకాయం ఆయన స్వస్థలమైన ఘరాకు చేరుకోగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరవీరుడు జీవన్‌సింగ్ మృతదేహం అతని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ అమరవీరునికి నివాళులర్పించేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.కశ్మీర్‌లోని గుల్మార్గ్లోని బూటా-పత్రి ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో రైఫిల్‌మెన్ జీవన్ సింగ్ రాథోడ్ వీరమరణం పొందారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు సహా నలుగురు మృతి చెందగా, జీవన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. నలుగురు సోదరీమణులకు జీవన్ సింగ్ ఏకైక సోదరుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు ఉన్నారు.జీవన్ సింగ్ 2016లో సైన్యంలో చేరి, రాజ్‌పుతానా రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి, అతని కుమార్తెలు అనన్య, భీషా బోరున విలపించడం అక్కడున్న అందిరినీ కంట తడిపెట్టించింది. గ్రామంలోని శ్మశాన వాటికలో జీవన్ సింగ్ పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించింది. దీనిని చూసిన అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
Brain Dead: బాలుడి అవయవాలు దానం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఒడిశాలో బ్రెయిన్ డెడ్‌తో మరణించిన ఎనిమిదేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. బాలుడి మృతదేహాన్ని ఒడిశా ప్రభుత్వం సోమవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. భువనేశ్వర్‌కుచెందిన శుభజిత్ సాహు రెండో తరగతి చదువుతున్నారు. ఇటీవల పరీక్షకు హాజరవుతుండగా మూర్ఛతో కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చగా.. కోమాలోకి వెళ్లిన్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రమంగా అతడి మెదడు పనిచేయడం మానేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాలుని అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రి వైద్యులకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. బాలుడిమూత్ర పిండాలు, ఇతర అవయవాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించి భద్రపరిచి పార్థివ దేహాన్ని వారికి అప్పగించారు. అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జంట నగరాల పోలీస్ కమిషనర్ సంజీవ్ పండా, ఇతర అధికారుల సమక్షంలో సత్యనగర్ రుద్రభూమిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
బంధుత్వం బరువైన వేళ..
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఓ మహిళ మృతదేహానికి ఇండియన్ ముస్లిం మైనార్టీ (ఐఎంఎం) ఆర్గనైజేషన్ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు చేసి, మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. మడకశిర ప్రాంతానికి చెందిన శాంతమ్మ (53) అనారోగ్యానికి గురికావడంతో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఈ విషయాన్ని 15 ఏళ్ల కుమారుడు, దివ్యాంగురాలైన కూతురు బంధువులకు తెలిపారు. అయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికుల సూచన మేరకు నగరంలోని ఐఎంఎం ఆర్గనైజేషన్ సభ్యులను కుమారుడు సంప్రదించాడు. ఐఎంఎం ఆర్గనైజేషన్ సభ్యులు మహాప్రస్థానం వాహనంలో మృతదేహాన్ని హిందూ శ్మశానవాటికకు తరలించి, అంత్యక్రియలు చేపట్టారు. మృతురాలి భర్త కూడా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ బాషా, సభ్యులు మహమ్మద్, ఇస్మాయిల్, దాదాబాషా, నూర్, బాషా పాల్గొన్నారు. -
పగవాడికి కూడా రావొద్దు ఈ కష్టం
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ముసలి, ముతకా, ఉన్నోడు, లేనోడు ఇలా తారతమ్యాలు లేకుండా కరోనా ప్రతి ఒక్కరిపై తన ప్రతాపం చూపిస్తుండడంతో బ్రతుకు జీవుడా అంటూ క్షణం క్షణం భయం గుప్పిట్లో జనం బతుకుతున్నారు. ఓవైపు కరోనా సోకిందనే అనుమానంతో టెస్ట్‌లు చేయించుకుందామనేలోపే ఊపిరి ఆగిపోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన 35 ఏళ్ల జాగృతి సాఫ్ట్ వేర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమెకు కరోనా సోకి ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర చికిత్స కోసం ఆమె భర్త తన కారులో ఇంటినుంచి గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వాసుపత్రికి బయలు దేరారు. ఆస్పత్రి బయట పార్కింగ్ ఏరియాలో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో కంగారు పడ్డ ఆమె భర్త పరిగెత్తుకుంటూ వెళ్లి తనకు ఆక్సిజన్ సిలీండర్ కావాలని, తన భార్య ప్రాణాపాయస్థితిలో ఉందని ఆస్పత్రి సిబ్బందని వేడుకున్నాడు. ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడంతో చివరికి ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలని స్ట్రెచ్చర్ కోసం వెతికాడు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. పార్కింగ్ స్థలంలో ఉన్న కారులోనే జాగృతి మరణించింది. బాధితురాలు ప్రాణాలు కోల్పోయిందని సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది ఆమె డెడ్‌బాడీ పట్ల మరింత కాఠిన్యం ప్రదర్శించారు. ప్రోటోకాల్ పేరుతో మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లి దహనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదు.పైగా దహన సంస్కారం చేసే ముందు సుమారు 3 గంటల పాటు తన భార్య జాగృతి మృతదేహాన్ని కారులో అలాగే ఉంచారని బాధితురాలి భర్త కన్నీరుమున్నీరయ్యాడు. -
Corona Deaths: బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. కోవిడ్ సోకి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. శ్మశానాల వద్ద మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. బెంగళూరులో కోవిడ్ సోకి నిత్యం 50 మంది వరకూ మరణిస్తున్నారు. నగరంలోని 5 శ్మశానాల్లో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 20 మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. శ్మశాన వాటిక వద్ద ఒక్కో అంబులెన్సు అంత్యక్రియల కోసం నాలుగైదు గంటలు క్యూలలో వేచి చూడాల్సి వస్తోంది. ఐదే ఐదు శ్మశాన వాటికలు బెంగళూరు జాలహళ్లి వద్ద ఉన్న సుమనహళ్లి, కెంగేరి, బొమ్మనహళ్లి, పెనత్తూరు శ్మశానవాటికల్లో కోవిడ్ సోకి మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రాంతాల్లో అంత్యక్రియలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అంత్యక్రియలు చేసే సిబ్బందికి అత్యంత అవసరమైన పీపీఈ కిట్లు లభించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వృద్ధులే అధికం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 280 మంది బెంగళూరు వాసులు కోవిడ్‌తో మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ 13,14 తేదీల్లో కరోనా సోకి 55 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది జనవరిలో 66మంది, ఫిబ్రవరిలో 88, మార్చిలో 147, ఏప్రిల్‌లో 280 మంది మరణించారు. ఇందులో 210 మందికి పైగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారు. ఇక్కడ చదవండి: బెంగళూరులో వైరస్ బీభత్సం.. ఒకేరోజు 10 వేల కేసులు అదుపులేని కోవిడ్ భూతం: మరి రాత్రి కర్ఫ్యూ ఎందుకు? -
ముఖేశ్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ కన్నీటి వీడ్కోలు పలికింది. మంగళవా రం మధ్యాహ్నం గాంధీభవన్‌కు ఆయన పార్థివ దేహాన్ని తీసుకువచ్చి పార్టీ జెండా కప్పి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ డిప్యూటీ æసీఎం దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నేతలు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, వి.హన్మంతరావు, కూన శ్రీశైలంగౌడ్, అనిల్, వినోద్‌రెడ్డి, బొల్లు కిషన్, ఇందిరాశోభన్, కుమార్‌రావు తదితరులు ఆయనకు నివాళుర్పించినవారిలో ఉన్నారు. అనంతరం ముఖేశ్ పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనం లో రాయదుర్గం గౌడ్స్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అండగా సిటీ నేతలు ముఖేశ్‌గౌడ్ మరణవార్త విన్న దగ్గర నుంచి పార్టీలకతీతంగా నగర నేతలు ఆయన కుటుంబాన్ని వెన్నం టే ఉన్నారు. బంజారాహిల్స్, జాంబాగ్‌లోని ఆయన నివాసాల వద్ద మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నీ తానై నడిపించారు. గాంధీభవన్ నుంచి ప్రత్యేక వాహనంలోకి ముఖేశ్ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న సమయంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు అనిల్‌కుమార్ యాదవ్ పాడె మోశారు. ముఖేశ్ తనయుడు, టీపీసీసీ కార్యదర్శి విక్రమ్‌గౌడ్‌కు తోడుగా పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, ముఖేశ్ అభిమానులు తరలిరాగా జనసందోహం మధ్య గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర సాగింది. చితికి నిప్పంటించిన విక్రమ్‌గౌడ్ ముఖేశ్‌గౌడ్ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య రాయదుర్గం గౌడ్స్ శ్మశానవాటికలో నిర్వహించారు. ముఖేశ్‌గౌడ్ చితికి కుమారుడు విక్రమ్‌గౌడ్ నిప్పంటించారు. రాయదుర్గంకే చెందిన ముఖేశ్‌గౌడ్ నగరంలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నప్పటికీ తన సొంతూరుతో ఉన్న అనుబంధంతో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీలు టి.దేవేందర్‌గౌడ్, వి.çహన్మంతరావు, మధుయాస్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు గీతారెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంతోష్ కుమార్, పలువురు కార్పొరేటర్లు తదితర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఉత్తమ్ తమతో కలిసి సుదీర్ఘ కాలం పనిచేసిన పార్టీ సభ్యుడు మరణించడం తీవ్రబాధ కలిగించిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. ముఖేశ్‌గౌడ్ కుటుంబానికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ముఖేశ్ చొరవతోనే వరంగల్‌లో బీసీ గర్జన జరిగిందని, తన సహచరుడి మృతి కలచివేసిందని పొన్నాల అన్నారు. -
హతురాలి మృతదేహం వెలికితీత
నల్లజర్ల: నల్లజర్లలో భర్త చేతిలో హత్యకు గురై పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు మంగళవారం వెలికితీశారు. నల్లజర్లలో గత నెల 26న రాత్రి రాచూరి వీర్రాజు తన భార్య వెంకటలక్ష్మి ప్రవర్తనను అనుమానించి హత్యచేసి చీపురుగూడెం సమీపంలో తాను పనిచేసే కోళ్లఫారం ఆవరణలో పూడ్చిపెట్టాడు. 15 రోజుల తర్వాత పోలీసు విచారణలో వీర్రాజు నేరం అంగీకరించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తహసీల్దార్ పద్మావతి, తాడేపల్లిగూడెం రూరల్ సీ ఐ మధుబాబు, ఎస్సై వి.వెంకటేశ్వరా వు ఆధ్వర్యంలో కోళ్లఫారం ఆవరణలో పొక్లయిన్ సాయంతో తవ్వి పది అడుగుల లోతులో ఉన్న మృతదేహాన్ని వె లికితీశారు. మృతదేహం పూర్తిగా పాడైపోయింది. తల, మొండెం వేరుగా ఉ న్నాయి. మృతదేహంపై ఉన్న దుస్తులు ఆధారంగా వెంకటలక్షి్మగా తల్లిదండ్రులు గుర్తించారు. తాడేపల్లిగూడెం ఆస్పత్రి డాక్టర్లు కోటేశ్వరి, గంగాధరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. -
సీపీఎం సీనియర్ నేత ఆత్మహత్య
అగర్తలా: త్రిపుర మాజీ డిప్యూటీ స్పీకర్, సీపీఎం సీనియర్ నేత సునీల్ కుమార్ చౌదరి (85) ఆత్మహత్య కలకలం రేపింది. సబ్రూం నగరంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి అధికార లాంఛనాలతో ఆయన సునీల్ కుమార్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిసాయని అధికారులు వెల్లడించారు. పాతికేళ్ల వయసులో వామపక్ష భావాలవైపు ఆకర్షితుడైన సునీల్ కమార్ సీపీఎం నుంచి అయిదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1993లో రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పదవీబాధ్యతలను నిర్వర్తించారు. సునీల్ కుమార్ అనూహ్య మరణంపై సీపీఎం పార్టీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. సబ్రూం నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి సల్పారంటూ నివాళులర్పించింది. పార్టీ కార్యాలయం భవనం కోసం తన ఆస్తిని దానం చేశారని పార్టీ పేర్కొంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు. -
కన్నీటి వీడ్కోలు
తీవ్రవాదుల కాల్పుల్లో అమరుడైన మిలటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు సోమవారం చెన్నైలో కన్నీటి వీడ్కోలు పలికారు. అశేష జన సందోహం నడుమ అంతిమ యాత్ర సాగింది. రాజకీయ పక్షాల నేతలు తరలివచ్చి, అమరవీరుడి భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి రూ.పది లక్షల చెక్కును రాష్ర్ట ప్రభుత్వం తరపున మంత్రి చిన్నయ్య అందజేశారు. సాక్షి, చెన్నై:జమ్ము కాశ్మీర్ రాష్ట్రం సోఫియా జిల్లాలో తీవ్రవాదులను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ అమరుడైన విషయం తెలిసిందే. మేజర్ ముకుంద్ వరదరాజన్ చెన్నైవాసి కావడంతో ఆయన భౌతికకాయూన్ని ఇక్కడికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి మీనంబాక్కం విమానాశ్రయంలో మేజర్ భౌతిక కాయూన్ని స్వాధీనం చేసుకున్న ఆర్మీ అధికారులు ఉదయాన్నే ఈస్ట్ తాంబరం ప్రొఫెసర్స్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. తండ్రి వరదరాజన్, తల్లి గీత, సతీమణి ఇందుతో పాటుగా ఆప్తులు, సన్నిహితులు, స్థానికులు శోకతప్త హృదయంతో ముకుంద్ భౌతిక కాయం వద్ద కన్నీటి నివాళులర్పించారు. ముకుంద్ ధరించిన ఆర్మీ దుస్తులను ఆయన సతీమణి ఇందుకు అప్పగించారు. ఈ సమయంలో ముక్కు పచ్చలారని హర్షిత(3) తన తండ్రి భౌతిక కాయం ఉన్న బాక్సు వద్ద పుష్పగుచ్ఛం ఉంచడం అక్కడున్న వాళ్లను కంట తడి పెట్టించింది. అశ్రు నివాళి: ముకుంద్‌కు నివాళులర్పిస్తూ వెస్ట్, ఈస్ట్ తాంబరం, మేడవాక్కం, వేళచ్చేరి పరిసరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటయ్యాయి. ఆ పరిసరాల్లోని యువకులు ముకుంద్‌కు తమ నివాళిని తెలియజేస్తూ, దేశం కోసం అమరుడైన వారికి కన్నీటి నివాళులర్పిద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చే విధంగా ఆపోస్టర్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో ప్రొఫెసర్స్ కాలనీకి పెద్ద ఎత్తున జన ం తరలి వచ్చారు. రాష్ట్ర మంత్రి చిన్నయ్య, కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ ప్రభుత్వం తరపున నివాళులర్పించారు. సీఎం జయలలిత ప్రకటించిన రూ.పది లక్షల చెక్కును ముకుంద్ తండ్రి వరదరాజన్‌కు అందజేశారు. పల్లావరం ఎమ్మెల్యే ధన్సింగ్, తాంబరం మునిసిపల్ చైర్మన్ కరిగాలన్, శ్రీ పెరంబదూరు అన్నాడీఎంకే ఎంపీ అభ్యర్థి రామచంద్రన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ చెన్నై జిల్లా పార్టీ నేత కరాటే త్యాగరాజన్, డీఎంకే తరపున మాజీ మంత్రి తాము అన్భరసు, మాజీ ఎమ్మెల్యే రాజా, బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్తోపాటుగా పెద్ద ఎత్తున వివిధ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు ముకుంద్‌కు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఓ ప్రకటనలతో తన సంతాపం తెలియజేశారు. ముకుంద్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. అంత్యక్రియలు: ప్రొఫెసర్ కాలనీ నుంచి ఆర్మీ లాంఛనాలతో ముకుంద్ పార్థివ దేహానికి అంతిమ యాత్ర ఆరంభం అయింది. ఆర్మీ అధికారి సంజీవ్ చోప్రా తదితరులతో పాటుగా ఆర్మీ సిబ్బంది, పెద్ద ఎత్తున జన సందోహం అంతిమయాత్రలో పాల్గొన్నారు. బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 42 తూటాలు గాల్లో పేలగా, ముకుంద్ భౌతిక కాయాన్ని ఎలక్ట్రానిక్ శ్మశాన వాటికలో దహనం చేశారు. ఈ సందర్భంగా అమరుడికి అక్కడున్న జనం, ఆర్మీ సిబ్బంది, అధికారులు నివాళి అర్పించారు. -
అధికార లాంఛనాలతో ప్రేమ్‌నాథ్ అంత్యక్రియలు
పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో మరణించిన ఐదుగురు భారతీయ సైనికుల్లో ఒకరైన ప్రేమ్‌నాథ్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో అతడి స్వగ్రామం సంహౌతాలో గురువారం జరిగాయి. ఆ కార్యక్రమానికి అతని కుటుంబసభ్యులతోపాటు స్థానిక ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. అంతకుమందుకు మంత్రులు, ప్రభుత్వ అధికారులు, శరన్ జిల్లాలో సంహౌతా గ్రామానికి చేరుకున్న ప్రేమ్‌నాథ్ మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు ఆర్పించారు. జమ్మూలోని పూంచి సెక్టార్లో మంగళవారం పాకిస్థాన్ సైనికులు భారత్‌లో చొరబడి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఐదుగురు భారతీయ సైనికులు మరణించారు. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారే. ఆ ఐదుగురు సైనికులు మృతదేహాలు బుధవారం అర్థరాత్రి పాట్నా చేరుకున్నాయి. అక్కడి నుంచి సైనికులు మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో అధికారులు స్వస్థలాలను తరలించారు. మిగతా సైనికులు అంత్యక్రియలకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.