సీపీఎం సీనియర్ నేత ఆత్మహత్య
Published Mon, Dec 28 2015 4:36 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
అగర్తలా: త్రిపుర మాజీ డిప్యూటీ స్పీకర్, సీపీఎం సీనియర్ నేత సునీల్ కుమార్ చౌదరి (85) ఆత్మహత్య కలకలం రేపింది. సబ్రూం నగరంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి అధికార లాంఛనాలతో ఆయన సునీల్ కుమార్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిసాయని అధికారులు వెల్లడించారు.
పాతికేళ్ల వయసులో వామపక్ష భావాలవైపు ఆకర్షితుడైన సునీల్ కమార్ సీపీఎం నుంచి అయిదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1993లో రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పదవీబాధ్యతలను నిర్వర్తించారు. సునీల్ కుమార్ అనూహ్య మరణంపై సీపీఎం పార్టీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. సబ్రూం నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి సల్పారంటూ నివాళులర్పించింది. పార్టీ కార్యాలయం భవనం కోసం తన ఆస్తిని దానం చేశారని పార్టీ పేర్కొంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు వున్నారు.
Advertisement