హతురాలి మృతదేహం వెలికితీత | dead body excavated | Sakshi
Sakshi News home page

హతురాలి మృతదేహం వెలికితీత

Published Wed, Mar 15 2017 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

dead body excavated

నల్లజర్ల: నల్లజర్లలో భర్త చేతిలో హత్యకు గురై పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు మంగళవారం వెలికితీశారు. నల్లజర్లలో గత నెల 26న రాత్రి రాచూరి వీర్రాజు తన భార్య వెంకటలక్ష్మి ప్రవర్తనను అనుమానించి హత్యచేసి చీపురుగూడెం సమీపంలో తాను పనిచేసే కోళ్లఫారం ఆవరణలో పూడ్చిపెట్టాడు. 15 రోజుల తర్వాత పోలీసు విచారణలో వీర్రాజు నేరం అంగీకరించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తహసీల్దార్‌ పద్మావతి, తాడేపల్లిగూడెం రూరల్‌ సీ ఐ మధుబాబు, ఎస్సై వి.వెంకటేశ్వరా వు ఆధ్వర్యంలో కోళ్లఫారం ఆవరణలో పొక్లయిన్‌ సాయంతో తవ్వి పది అడుగుల లోతులో ఉన్న మృతదేహాన్ని వె లికితీశారు. మృతదేహం పూర్తిగా పాడైపోయింది. తల, మొండెం వేరుగా ఉ న్నాయి. మృతదేహంపై ఉన్న దుస్తులు ఆధారంగా వెంకటలక్షి్మగా తల్లిదండ్రులు గుర్తించారు. తాడేపల్లిగూడెం ఆస్పత్రి డాక్టర్లు కోటేశ్వరి, గంగాధరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement