మైదుగురి: నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు గుంపు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 100 మంది మృతి చెందారు. వివరాలు.. ఈశాన్య నైజీరియా యోబే రాష్ట్రంలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలోకి 50 మంది దుండగులు మార్కెట్‌లో పాటు పలు ఇళ్లపై కాల్పులు జరిపారు. పెద్దసంఖ్యలో దుండగులు బైకులపై వచ్చి పలు భవనాలకు నిప్పంటించి అనంతరం కాల్పులకు తెగపడ్డారని యోబ్ పోలీసు ప్రతినిధి డంగస్ అబ్దుల్కరీమ్ తెలిపారు.
At least 127 people have been killed following an attack by Boko Haram militants on motorcycles in a northeastern Nigerian village. The assailants set shops and homes on fire. This information comes from Amnesty International via AA.#BokoHaram #NigeriaAttack… pic.twitter.com/cNN7kc1dwo
— Live Updates (@LiveupdatesUS) September 3, 2024
ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పులను బోకోహరం ఉగ్రవాదుల దుశ్చర్యగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాఫ్రికాలోని నైజీరియాలో వేల మందిని పొట్టన పెట్టుకొని, ఎంతో మందిని ఈ ఉగ్రసంస్థ అపహరించిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ ప్రాంతంలో ఇస్లామిక్ చట్టం లేదా షరియా చట్టాలతో కూడిన రాజ్యాన్ని స్థాపించేందుకు తిరుగుబాటు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment