millitant attack
-
నైజీరియాలో దుండగుల కాల్పులు.. 100 మందికిపైగా మృతి
మైదుగురి: నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు గుంపు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 100 మంది మృతి చెందారు. వివరాలు.. ఈశాన్య నైజీరియా యోబే రాష్ట్రంలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలోకి 50 మంది దుండగులు మార్కెట్లో పాటు పలు ఇళ్లపై కాల్పులు జరిపారు. పెద్దసంఖ్యలో దుండగులు బైకులపై వచ్చి పలు భవనాలకు నిప్పంటించి అనంతరం కాల్పులకు తెగపడ్డారని యోబ్ పోలీసు ప్రతినిధి డంగస్ అబ్దుల్కరీమ్ తెలిపారు. At least 127 people have been killed following an attack by Boko Haram militants on motorcycles in a northeastern Nigerian village. The assailants set shops and homes on fire. This information comes from Amnesty International via AA.#BokoHaram #NigeriaAttack… pic.twitter.com/cNN7kc1dwo— Live Updates (@LiveupdatesUS) September 3, 2024ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పులను బోకోహరం ఉగ్రవాదుల దుశ్చర్యగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాఫ్రికాలోని నైజీరియాలో వేల మందిని పొట్టన పెట్టుకొని, ఎంతో మందిని ఈ ఉగ్రసంస్థ అపహరించిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ ప్రాంతంలో ఇస్లామిక్ చట్టం లేదా షరియా చట్టాలతో కూడిన రాజ్యాన్ని స్థాపించేందుకు తిరుగుబాటు ప్రారంభించింది. -
మణిపూర్‌లో కాల్పులు.. ఇద్దరు సీఆర్పీఎఫ్ పోలీసులు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ అవుట్‌పోస్ట్ లక్ష్యంగా బాంబులు విసిరారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మిలిటెంట్లు విసిరిన ఒక బాంబు అవుట్‌పోస్ట్‌కు సమీపంలో పేలుడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ‘ఎతైన కొండ ప్రాంతాల నుంచి మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్‌పై కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ లక్ష్యంగా తెల్లవారుజామున 12.30 నుంచి 2.15 వరకు కాల్పులు జరిపారు. కాల్పులతో పాటు మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు. ఒక బాంబు సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్‌కు సమీపంలో పేలింది’అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మృతి చెందినవారు.. సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. శంకర్, హెడ్ కానిస్టేబుల్ అనుప్ సైనీగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
Huthi Attacks: ఇరాన్‌పై అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్:ఇరాన్‌పై అమెరికా మళ్లీ కన్నెర్ర చేసింది. ఆ దేశంపై సంచలన ఆరోపణలు చేసింది. ఎర్రసముద్రంలో వాణజ్య నౌకల మీద హౌతీ మిలిటెంట్ల దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందన్న విషయం స్పష్టమవుతోందని ఆరోపించింది. నౌకల మీద దాడి చేసేందుకుగాను హౌతీ తిరుగుబాటుదారులకు అవసరమైన డ్రోన్లు, మిసైళ్లు, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇరాన్ అందిస్తోందని అమెరికా తెలిపింది. ‘ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద జరుగుతున్న దాడి వెనుక ఇరాన్ ప్రముఖ పాత్ర వహిస్తోందని మాకు తెలుసు. అక్కడ అనిశ్చితి రేపేందుకు ఇరాన్ ఎప్పటినుంచో హౌతీ రెబెల్స్‌కు సహకరిస్తోంది. స్పష్టమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నాం’ అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి అడ్రియెన్ వాట్సన్ మీడియాకు తెలిపారు. పాలస్తీనాకు మద్దతుగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలోని కీలక షిప్పింగ్ లైన్స్‌లో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. నౌకలపై హౌతీ దాడులను అడ్డుకునేందుకుగాను 10 దేశాలతో కలిసి అమెరికా ఇటీవలే ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఇదీచదవండి..విన్ డీజిల్‌పై లైంగిక వేధింపుల కేసు -
పాక్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్‌గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి. సైనికులపై కాల్పులు జరిపింది తామేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్‌గుర్‌లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్ అభినందించారు. -
ఆమెకు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయి!
సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆసియాకు పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు సమీకరించినట్లు పేర్కొన్నారు. లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఓ ఆలయాన్ని ప్రారంభించిన సమయంలో.. లష్కర్- ఎ- తొయిబాతో సహా పలు ఉగ్రవాద సంస్థలకు ఆసియా ఆడియో మెసేజ్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు. మోదీ పర్యటనలో ఉన్న సమయంలో భారత్‌పై దాడి చేసేందుకు ప్రపంచం నలుమూలలా ఉన్న ఉగ్రవాదులు ఏవిధంగా ప్రణాళికలు రచించారో తమ విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఆసియా ఆండ్రాబీ నేపథ్యం.. కశ్మీర్లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్తరన్-ఈ-మిలాత్ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే విద్యార్థినులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జెండాలు ఎగరవేసినందుకు ఆసియా పలుమార్లు అరెస్టయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్బోర్న్లో ఎంటెక్ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసియాను శ్రీనగర్ జైలు నుంచి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
కశ్మీర్లో ఉగ్రదాడి ఇద్దరు జవాన్ల మృతి
-
ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్ : కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతనాగ్ జిల్లాలోని అచల్ చౌక్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా..మరొక సైనికుడితో పాటు, ఒక సాధారణ పౌరుడు గాయపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అచల్ చౌక్ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు అన్వేషణ ప్రారంభించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీజేపీ నేతపై మిలిటెంట్ల దాడి
శ్రీనగర్ : కల్లోల ప్రాంతం కాశ్మీర్లో గురువారం బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్‌పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు దాడి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ దాడి జరిగింది. అన్వర్ ఖాన్ వ్యక్తిగత అంగరక్షకుడు బిలాల్ అహ్మద్‌కు మాత్రం గాయలైయ్యాయి. బాల్‌హమా ప్రాంతంలో మిలిటెంట్లు ఒక్క సారిగా అన్వర్ ఖాన్‌పై కాల్పులు జరిపారు. గాయపడ్డ ఆయన పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్‌ను ఆసుపత్రిలో చేర్చినట్టు అధికారులు తెలిపారు. -
కశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి
ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి శ్రీనగర్: కశ్మీర్ లోయలో బుధవారం ఆర్మీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు, ఒక పోలీసు మత్యువాత పడ్డారు. మరో ఇద్దరు సైనికులు, ఓ పోలీసు గాయపడ్డారు. ఈ సంఘటన బారాముల్లా జిల్లాలోని ఖ్వాజాబాగ్లో చోటుచేసుకుంది. దుండగులను పట్టుకోవడానికి ఆపరేషన్ ప్రారంభించినా వారింకా దొరకలేదు.