ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్ల మృతి | Militants Attack On CRPF Personnel In Kashmir Anantnag | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్ల మృతి

Published Fri, Jul 13 2018 1:45 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Militants Attack On CRPF Personnel In Kashmir Anantnag - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌ : కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్‌ బలగాలపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతనాగ్‌ జిల్లాలోని అచల్‌ చౌక్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా..మరొక సైనికుడితో పాటు, ఒక సాధారణ పౌరుడు గాయపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అచల్‌ చౌక్‌ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు అన్వేషణ ప్రారంభించాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement