
తిరువొత్తియూరు: కుటుంబ సమస్యల కారణంగా తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్ పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడు. కోయంబత్తూరు సమీపంలోని కురుదంపాళయంలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ శిక్షణా కళాశాల ఉంది. ఇక్కడ సీఆర్‌పీఎఫ్‌గా జగన్ (32) పని చేస్తున్నాడు. అతని స్వస్థలం తూత్తుకుడి జిల్లాలోని సాతాన్ కుళం సమీపంలోని పెరుమాళ్ కులం. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జగన్ పనిలో ఉన్నారు.
ఆ తరువాత అకస్మాతుగా తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. అతని మెడలోకి రెండు బుల్లెట్లు దూసుకుని వెళ్ళాయి. దీంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసిన సహ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు. జగన్ తన మొదటి భార్యకు మూడు నెలల క్రితం విడాకులు ఇచ్చి రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఈ స్థితిలో కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియవచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment