కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్‌గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి.
సైనికులపై కాల్పులు జరిపింది తామేనని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్‌గుర్‌లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment