
దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు
శ్రీనగర్ : కల్లోల ప్రాంతం కాశ్మీర్‌లో గురువారం బీజేపీ నాయకుడు అన్వర్ ఖాన్‌పై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు దాడి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ దాడి జరిగింది. అన్వర్ ఖాన్ వ్యక్తిగత అంగరక్షకుడు బిలాల్ అహ్మద్‌కు మాత్రం గాయలైయ్యాయి. బాల్‌హమా ప్రాంతంలో మిలిటెంట్లు ఒక్క సారిగా అన్వర్ ఖాన్‌పై కాల్పులు జరిపారు. గాయపడ్డ ఆయన పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్‌ను ఆసుపత్రిలో చేర్చినట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment