ముంబైలో నా మనవడిపైనా హత్యాయత్నం | they attempted murder on my grandson too, says triple murder victim's wife | Sakshi
Sakshi News home page

ముంబైలో నా మనవడిపైనా హత్యాయత్నం

Published Fri, Sep 26 2014 1:55 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

ముంబైలో నా మనవడిపైనా హత్యాయత్నం - Sakshi

ముంబైలో నా మనవడిపైనా హత్యాయత్నం

విజయవాడ :  భూతం దుర్గారావు హత్యకేసులో కేవలం అనుమానించి తమ కుటుంబంపై కేసులు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారని మృతుడు గంధం నాగేశ్వరరావు భార్య యాదగిరమ్మ ఆరోపించింది. దుర్గారావు హత్యతో ఎలాంటి సంబంధం లేకపోయినా తన భర్తను, పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారని ఆమె భోరున విలపించింది. ముంబయిలో తన మనవడిపై కూడా హత్యాయత్నం జరిగిందని యాదగిరమ్మ ఆరోపించింది. పది కోట్లు ఖర్చు పెట్టి ఈ హత్యలు చేశారని ఆమె తెలిపింది.

కాగా కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద బుధవారం దారుణ హత్యకు గురైన ముగ్గురు వ్యక్తులు, వారిని హతమార్చిన వ్యక్తులు దగ్గరి బంధువులే. కుటుంబ కలహాలు, వృత్తిలో ఏర్పడిన విభేదాలు, రాజకీ య విద్వేషాలు బంధుత్వాన్ని సైతం మర్చిపోయేలా చేశాయి. వారి మధ్య పగ, ప్రతీకారాలు మొత్తంగా ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement