లండన్లోనే ప్లాన్, రూ.3 కోట్లకు ఒప్పందం | Police arrest suspects in Three shot dead case | Sakshi
Sakshi News home page

లండన్లోనే ప్లాన్, రూ.3 కోట్లకు ఒప్పందం

Published Thu, Sep 25 2014 11:34 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

లండన్లోనే ప్లాన్, రూ.3 కోట్లకు ఒప్పందం - Sakshi

లండన్లోనే ప్లాన్, రూ.3 కోట్లకు ఒప్పందం

విజయవాడ : విజయవాడ-ఏలూరు హైవేపై కాల్పుల ఘటనకు సంబంధించి కుట్రదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు ముంబయి ప్రొఫెషనల్ కిల్లర్స్తో రూ.3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా కిల్లర్స్ పరారీలో ఉన్నారు. హత్యలకు 032 రివాల్వర్ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. కుట్రదారులకు ముంబయి, కెనడా, లండన్ల్లో ఆస్తులు ఉన్నాయి.

జేకే ప్యాలెస్ అధినేత దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ ముగ్గురిని హత్య చేయించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. లండన్లో ఉంటున్న దుర్గారావు బంధువు ఇక్కడ అనుచరుల సాయంతో ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచి, కిరాయి హంతకులతో పథకం రచించి అదును చూసి హత్యలు చేయించినట్లు అనుమానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన ముగ్గురు వ్యక్తులను నిన్న నడిరోడ్డుపై దారుణంగా కాల్చిచంపిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement