అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారిన అహ్మ‌ద్‌న‌గ‌ర్.. కేబినెట్‌ ఆమోదం | Ahmednagar becomes Ahilya Nagar Maharashtra Cabinet approves | Sakshi
Sakshi News home page

అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారిన అహ్మ‌ద్‌న‌గ‌ర్.. కేబినెట్‌ ఆమోదం

Published Wed, Mar 13 2024 6:40 PM | Last Updated on Wed, Mar 13 2024 7:18 PM

Ahmednagar becomes Ahilya Nagar Maharashtra Cabinet approves - Sakshi

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం  బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. 18వ శ‌తాబ్ధ‌పు మ‌రాఠా రాణి అహ‌ల్యాభాయ్ హోల్క‌ర్ పేరు మీదుగా అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ను ‘అహల్యానగర్‌’గా మార్చాలనే ప్ర‌తిపాద‌న‌ను మహారాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది.

కాగా నిజాంషాహి వంశానికి చెందిన అహ్మ‌ద్ నిజాంషా పేరుతో 15వ శ‌తాబ్ధంలో ఈ న‌గ‌రానికి అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరు పెట్టారు. జిల్లా పేరు మార్చే ప్రతిపాదనను తొలుత సీఎం ఎక్‌నాథ్‌ షిండే గతేడాది మేలో ప్రకటించిన విషయం తెలిసిందే. అహల్యాభాయ్‌ 298వ జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

ఇక 2022లో ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్ పేర్ల‌ను శంభాజీన‌గ‌ర్‌, ధారాశివ్‌గా మార్చారు. ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ల‌కు మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు ఔరంగ‌జేబు, నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ల పేర్లు పెట్టారు. అయితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌లను ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చడంతో అహ్మద్‌నగర్ జిల్లా పేరును కూడా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
చదవండి: BJP: అరుణాచల్‌ అభ్యర్థుల జాబితా విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement