అహ్మద్‌నగర్‌లో ప్రతీకార పోరు
దిగ్గజాలిద్దరికీ ప్రతిష్టాత్మకమే
బీజేపీ నుంచి పాటిల్ కుమారుడు
నీలేశ్‌కు టికెటిచి్చన పవార్
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ లోక్‌సభ స్థానం 2009 నుంచీ బీజేపీ కంచుకోట. అక్కడ ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, రాధాకృష్ణ విఖే–పాటిల్ కుటుంబాల మధ్య ఇక్కడ చిరకాలంగా శత్రుత్వం కొనసాగుతోంది.
ఈసారి విఖే పాటిల్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ సుజయ్ మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే నీలేశ్ లంకేను ఎన్సీపీ (ఎస్పీ) తరఫున పవార్ తొలిసారి లోక్‌సభ బరిలో నిలిపారు. కుమారున్ని ఎలాగైనా గెలిపించుకోవాలని రాధాకృష్ణ, అగాడీ మద్దతుతో లంకేను గట్టెక్కించి పైచేయి సాధించాలని పవార్ పట్టుదలతో ఉన్నారు. అహ్మద్‌నగర్‌లో నేడు పోలింగ్ జరుగుతోంది.
సుజయ్‌కి ఈజీ కాదు
సుజయ్ ముత్తాత విఠల్‌రావు విఖే పాటిల్ దేశంలో తొలి చక్కెర సహకార కర్మాగారం స్థాపించారు. తండ్రి రాధాకృష్ణ ప్రస్తుత ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రి. 2019లో రాధాకృష్ణ బీజేపీలో చేరారు. అంతకు ముందు రెండు దశాబ్దాలు కాంగ్రెస్‌తో, అంతకుముందు శివసేనలో ఉన్నారు. 1995 నుంచి అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాధాకృష్ణ తండ్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ 8 సార్లు ఎంపీగా చేశారు.
వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సుజయ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నేత సంగ్రామ్ జగ్తాప్‌పై భారీ మెజారిటీతో నెగ్గారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గంతో కొనసాగుతున్న సంగ్రామ్ జగ్తాప్ ఈసారి సుజయ్ కోసం ప్రచారం చేస్తుండటం విశేషం. అజిత్ నుంచి ప్రధాని మోదీ దాకా అగ్ర నేతలు కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. అయినా ఈసారి సుజయ్ విజయం అంత తేలిక కాదంటున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నపవార్..
నీలేశ్ లంకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్నర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ టికెట్‌పై గెలిచారు. 2023లో పార్టీ చీలిక తర్వాత అజిత్ వర్గంలోకి వెళ్లి తర్వాత శరద్ వర్గంలోకొచ్చారు. జిల్లా రాజకీయాలపై పట్టున్న ఆయన సుజయ్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలను ధనబలం, ప్రజాబలం మధ్య పోరుగా అభివరి్ణస్తున్నారు. కరోనా వేళ ఉచిత చికిత్స ప్రజల మనసు గెలుచుకుంది. సహకార నాయకుడు, కాంగ్రెస్∙మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ తదితరుల మద్దతు నీలేశ్‌కు కలిసి రానుంది. శరద్ పవార్ కూడా ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మక తీసుకుని సుడిగాలి ప్రచారం చేశారు. నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ వంటి స్థానిక సమస్యలపైనే నీలేశ్ తన ప్రచారాన్ని కేంద్రీకరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment