ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమికి సీట్లు తగ్గటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సీఎం ఎక్‌నాథ్ షిండే పాల్గొని మాట్లాడారు.
‘‘లోక్‌సభ పోలింగ్ రోజు మహారాష్ట్రలో మా కుటమికి అనుకూలంగా ఓటువేసే సంప్రదాయ ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు రాకుండా హాలీడే తీసుకున్నారు. అందుకే మహారాష్ట్రలో మహాయుతి కుటమికి సీట్లు తగ్గాయి. దేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండటం వల్ల ఎన్డీయే కూటమి 400 సీట్ల మార్క్‌ను దాటలేకపోయింది. ఇలా జరగకపోతే ఎన్డీయే 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకుని ఉండేది.
ఈ నష్టం మమ్మల్ని భవిష్యత్తులో మరింత వ్యూహాత్మకంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. పోలింగ్‌లో 60 శాతం ఓటర్లు పాల్గొని ఉంటే మేము కచ్చితంగా 40 సీట్లు గెలిచేవాళ్లం. లోక్‌సభ ఎన్నికల అనుభవాన్ని సమీక్షించుకుంటున్నాం’’ అని అన్నారు.
అదే ర్యాలీలో పాల్గొన్న డిప్యూటీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడారు. సీఎం ఎక్‌నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూటమి వ్యాప్తి చేసిన అసత్య ప్రచారాన్ని తమ కూటమి నేతలు పట్టించుకోలేదని అన్నారు. దానివల్ల కూడా తమకు సీట్లు తగ్గినట్లు అభిప్రాయపడ్డారు.
మొత్తం 48 సీట్లలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ఇక.. మహాయుతిలోని బీజేపీ 9, శివసేన(షిండే) 7 సీట్లు మాత్రమే సాధించిగా.. ఎన్సీపీ ఖాతా కూడా తెరవలేదు.
Comments
Please login to add a commentAdd a comment