ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.
‘‘ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్‌లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్‌లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.
#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y
— ANI (@ANI) June 11, 2024
‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్‌తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు.
మణిపూర్‌లో శాంతి, ఎన్నికలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
‘‘మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్‌లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment