మహారాష్ట్రలో లోకసభ ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. బరిలోకి దిగిన పార్టీలు తమ సత్తాను చాటేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని తూర్పు విదర్భలో ఎన్నికల పోరు ఆసక్తికరంగామారింది. ఇక్కడి ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, శివసేన, బీఎస్‌పీతో సహా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
రామ్‌టెక్ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన పార్టీల నుండి ముగ్గురు అభ్యర్థులు రాజు పర్వే (శివసేన), శ్యాంకుమార్ బార్వే (కాంగ్రెస్), సందీప్ మెష్రామ్ (బీఎస్‌పీ) ఉన్నారు. అయితే అంతగా గుర్తింపు లేని పార్టీల నుండి 13 మంది, 12 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. రామ్‌టెక్‌లో కాంగ్రెస్ తన అభ్యర్థిగా రష్మీ బార్వేని నిలబెట్టింది. అయితే ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లదు. దీంతో ఆమె భర్త ఎన్నికల రంగంలో నిలిచారు.
నాగ్‌పూర్ విషయానికొస్తే బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ, వికాస్ థాకరే (కాంగ్రెస్), యోగేష్ లాంజేవార్ (బీఎస్‌పీ) గుర్తింపు పొందిన పార్టీల నుండి 13 మంది, 10 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. భండారా-గోండియా నియోజకవర్గంలోని 18 మంది అభ్యర్థులలో, సునీల్ మెంధే (బీజేపీ), ప్రశాంత్ పడోలే (కాంగ్రెస్), సంజయ్ కుంభాల్కర్ (బీఎస్‌పీ) గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు కాగా, నలుగురు గుర్తింపు పొందనివారున్నారు. 11 మంది స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. అశోక్ నేతే (బీజేపీ), కర్సన్ నామ్‌దేవ్ (కాంగ్రెస్), యోగేష్ హొన్నాడే (బీఎస్‌పీ) మధ్య త్రిముఖ పోటీ ఉండనుందని భావిస్తున్నారు.
చంద్రాపూర్‌లో 15 మంది అభ్యర్థుల్లో ప్రతిభా ధనోర్కర్ (కాంగ్రెస్), సుధీర్ ముంగంటివార్ (బీజేపీ), రాజేంద్ర రామ్‌టేకే (బీఎస్‌పీ) గుర్తింపు పొందిన పార్టీల నుంచి, 9 మంది గుర్తింపు లేని అభ్యర్థులు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. చొక్కలింగం తెలిపారు. ఈ నియోజకవర్గాల్లోని 10,652 పోలింగ్ కేంద్రాల ద్వారా 95,54,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment