mohan bhagavat
-
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మణిపూర్‌లో సమస్యకు గన్ పరిష్కారం కాదు: సుప్రియా సూలే
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.‘‘ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్‌లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్‌లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y— ANI (@ANI) June 11, 2024 ‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్‌తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు. మణిపూర్‌లో శాంతి, ఎన్నికలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్‌లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
కనకదుర్గమ్మను దర్శించుకున్న మోహన్ భగవత్
విజయవాడ: నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఆరెస్సెస్స్ ఛీఫ్ మోహన్ భగవత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు ఈవో కోటేశ్వరమ్మ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, అమ్మవారి చీర ప్రసాదం, చిత్రపటం మోహన్ భగవత్‌కు అందచేశారు. విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోహన్ భగవత్ విజయవాడకి వచ్చారు. -
‘అయోధ్య’ కోసం చట్టం తేవాలి
నాగపూర్: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ డిమాండ్ చేశారు. శ్రీరాముని జన్మస్థలంలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించాలన్నది కోట్లాది ప్రజల ఆకాంక్ష అన్నారు. ‘ఆత్మగౌరవ దృష్టితో చూసినా లేదా దేశంలో సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొనాలంటే ఆలయ నిర్మాణం అవశ్యం’ అని పేర్కొన్నారు. జన్మభూమి ప్రదేశంలో గతంలో దేవాలయం ఉందనడానికి సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించినా ఇంకా ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అప్పగించలేదన్నారు. రామ మందిర నిర్మాణం రాజకీయాల వల్ల ఆలస్యమవుతోందన్న భాగవత్.. సమాజం ఓపికనూ పరీక్షించడం ఎవరికీ మంచిది కాదని హెచ్చరించారు. ‘స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మత విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నారు. దాంతో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కేంద్రం పూనుకుని, అవసరమైతే సంబంధిత చట్టం తీసుకువచ్చైనా ఆ అడ్డంకులు తొలగించాలి’ అని డిమాండ్ చేశారు. విజయదశమి సందర్భంగా సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సంఘ్ శ్రేణులను ఉద్దేశించి భాగవత్ ప్రసంగించారు. శబరిమలపై..: శబరిమల అంశంపై స్పందిస్తూ.. ‘సంప్రదాయాలను, భక్తుల విశ్వాసాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. తీర్పుతో సమాజంలో విబేధాలు ఏర్పడ్డాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు హిందూ సమాజమే ఇలాంటి దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు. అర్బన్ నక్సలిజం వల్ల సమాజంలో విద్వేషం వ్యాప్తి చెందుతోందన్నారు. -
వేర్పాటు వాదాన్ని ఎగదోస్తే బుద్ది చెబుతాం
-
కోటాపై దుమారం
ఎన్నికలు జరగబోతున్న బిహార్ నుంచి అన్నీ శుభ వార్తలే వింటున్న బీజేపీకి ఇది ఊహించని షాక్. దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించే సమయం ఆసన్నమైందంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆయన అభిప్రాయాలతో తమకు ఏకీభావం లేదని బీజేపీ నేతలు ఆదరా బాదరాగా ప్రకటన చేసిన మాట వాస్తవమే అయినా అప్పటికే బిహార్‌లోని ప్రత్యర్థి పక్షాల నాయకులు అందుకున్నారు. మీ వైఖరేమిటో చెప్పాలని బీజేపీ నేతల్ని డిమాండ్ చేశారు. ఆమధ్య కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద కూడా మండల్ రాజకీయాలను సమీక్షించాలని తమ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. ఇప్పుడు భాగవత్ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్‌కే చెందిన సీనియర్ నేత మనీశ్ తివారీ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. బిహార్ ఎన్నికల్లో భాగవత్ వ్యాఖ్యలు బీజేపీకి కలిగించగల నష్టం సంగతలా ఉంచి అసలు రిజర్వేషన్లపై పదే పదే వెలువడుతున్న ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వెనక ఆ రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర దాగి ఉన్నదని అణగారిన వర్గాలకు చెందిన నాయకులు భావిస్తున్నారు. చిత్రమేమంటే ఈ వివాదాలకు సమాంతరంగా తమకూ కోటా కల్పించాలంటూ కొత్త కులాలు రోడ్డెక్కుతున్నాయి. బీసీల జాబితాలో ఉన్న కొన్ని కులాలు తమను ఎస్సీల్లో లేదా ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లు కోరుతున్న కులాలన్నీ గతంలో కోటా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవే. గుజరాత్లో ఒకప్పుడు ఉధృతంగా సాగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలకు ఊపిరిగా నిలిచింది పటేళ్లే. రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే చర్చ ఈనాటిది కాదు. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా కూడా దీనిపై విస్తృతంగా చర్చలు సాగాయి. సాగుతున్నాయి. మోహన్ భాగవత్ లేవనెత్తింది కూడా దానిలో భాగమే. అయితే చె ప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం వేరు. అలా చెబితే ఆ చెప్పేవారి ఉద్దేశాలేమిటో వెల్లడవుతాయి. భాగవత్ ఆ పని చేయలేదు. సామాజికంగా వెనకబడిన వర్గాలకు మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్టుగా రిజర్వేషన్లు అమలు చేయడం మాని...మన నేతలు మొదటినుంచీ వాటిపై రాజకీయం నెరపుతున్నారని ఆరోపించారు. అంతటితో ఆగలేదు. ఎవరికి రిజర్వేషన్లు అవసరమో, ఎంతకాలం అవసరమో తేల్చడానికి ఒక ‘రాజకీయేతర సంఘాన్ని’ ఏర్పాటు చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. దీనిపై పెద్దయెత్తున రగడ రాజుకున్నాక ఆయనసలు కోటా వ్యవస్థపైనే మాట్లాడలేదని ఆరెస్సెస్ అంటున్నది. బలహీన వర్గాలన్నీ ప్రయోజనాలు పొందేలా చూడటమే అందరి ధ్యేయం కావాలన్నది ఆయన మాటల్లోని ఆంతర్యమంటున్నది. నిజానికి రిజర్వేషన్లు ఎవరికి అవసరం... ఎంతకాలం అవసరం అన్నవి అంత జటిలమైన ప్రశ్నలే మీ కాదు. సమాజంలో కుల వివక్ష ఎదుర్కొంటున్నవారికి రిజర్వేషన్లు అవసరం. ఆ కుల వివక్ష ఉన్నంతవరకూ అవి కొనసాగడం అవసరం. మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం అదే. దేశంలో శతాబ్దాలుగా ఉన్న కుల వ్యవస్థ కారణంగా సామాజిక అణచివేతకు గురవుతూ విద్యాగంధానికి దూరంగా ఉన్న అట్టడుగు కులాలు సహజంగానే ఉన్నతోద్యోగాలకు దూరంగా ఉన్నాయి. ఈ స్థితిని గమనించి విద్య, ఉద్యోగాల్లో అలాంటి కులాలకు అవకాశం దక్కేవిధంగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బ్రిటిష్ పాలకులు సంకల్పించారు. శతాబ్దాల అసమానతలు సృష్టించిన అంతరాన్ని వీలైనంత తగ్గించాలంటే అవకాశాలను అందుకోవడంలో విఫలమవుతున్న వర్గాలకు ఆలంబనగా నిలవాల్సిన అవసరం ఉన్నదన్నదే ఈ విధానంలోని పరమోద్దేశం. స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగంలో సైతం ఈ రిజర్వేషన్లను పొందుపరిచింది అందుకే. నిజానికి ఎస్సీ, ఎస్టీలతోపాటు సామాజికంగా వెనకబడిన కులాలకు కూడా అప్పుడే రిజర్వేషన్లు కల్పించి ఉంటే వేరుగా ఉండేది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలు ప్రభుత్వానికి అందుకు అవకాశం ఇచ్చాయి. కానీ అలా చేయడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. కుల వివక్ష కారణంగా సామాజికంగా వెనకబడి ఉన్న కులాలను గుర్తించేందుకు 1979లో ఆనాటి జనతాపార్టీ ప్రభుత్వం మండల్ కమిషన్‌ను నియమించింది. మండల్ కమిషన్ చురుగ్గా పనిచేసి మరుసటి ఏడాదికల్లా నివేదికను సమర్పించినా మరో తొమ్మిదేళ్లు దాన్ని మూలనపడేశారు. చివరకు 1989లో ఆనాటి వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని నిర్ణయించడం, దేశంలో పలుచోట్ల దానికి వ్యతిరేకంగా ఆందోళనలు రాజుకోవడం చరిత్ర. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగబద్ధమేనని 2008లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. దేశ జనాభాలో ఎస్సీలు 16.6 శాతం, ఎస్టీలు 8.6 శాతం ఉండగా ఓబీసీల శాతం దాదాపు 56. రిజర్వేషన్లు అమలవుతున్నా ఈ నిష్పత్తిలో ఆయా వర్గాలు విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందలేకపోతున్నాయి. అసలు ఇంతవరకూ రిజర్వేషన్ల ఫలాన్నే అందుకోని అత్యంత వెనకబడిన కులాలు, అట్టడుగు దళిత కులాలు ఉన్నాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్థితిలో భాగవత్ లాంటి ప్రభావవంతమైన నాయకుడినుంచి రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం అన్న ప్రశ్న వెలువడటం సహజంగానే ఆయా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే అగ్రవర్ణాల్లో పేదలు లేరా...వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా అన్న ప్రశ్నలూ ఉన్నాయి. అలాంటివారికి కూడా కోటా కల్పించి ఆదుకోవాలనుకుంటే కాదనేవారెవరూ ఉండరు. అందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలనూ...ఆర్థికంగా దుర్బలంగా ఉన్నవారినీ ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. పార్టీలైనా, ఆరెస్సెస్లాంటి సంస్థలైనా ఎన్నికల ప్రయోజనాలకు అతీతంగా తమ మనోగతమేమిటో వెల్లడించడం...విలువైన చర్చలకు చోటీయడం అవసరం. -
ఆరెస్సెస్ నేతలతో అమిత్‌షా భేటీ
నాగ్‌పూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఒకరోజు పర్యటన కోసం నాగ్‌పూర్‌కు వచ్చిన ఆయన ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి, రాజ్యసభ ఎంపీ అజయ్ సంచేతితో సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో కలసి బీజేపీ అధికారాన్ని చేపట్టడం, ప్రమాణ స్వీకారం తర్వాత పీడీపీ నేత, కశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 8 గంటలపాటు షా.. వారితో సమాలోచనలు జరిపారు. పాక్‌లోని ఉగ్రవాద గ్రూపులు సహకరించడం వల్లే కశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ముఫ్తీ వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలతో తమకే సంబంధం లేదని కేంద్రం వివరణ ఇచ్చినప్పటికీ బీజేపీలో ఇది చర్చనీయాంశమైంది. ఆరెస్సెస్ నేతలతో భేటీ అనంతరం షా విలేకరులతో మాట్లాడలేదు. సయీద్ వ్యాఖ్యలతోపాటు జమ్మూకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ కూటమి రూపొందించిన కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ), ఆర్టికల్ 370, కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు తదితర అంశాలపై ఆర్ఎస్ఎస్ నేతలతో అమిత్ షా చర్చించినట్లు సమాచారం. సాయంత్రం రాష్ర్ట పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం అమిత్ షా ఢిల్లీకి తిరిగివెళ్లారు. ఉదయమే నాగ్‌పూర్ చేరుకున్న అమిత్‌ను ఇక్కడి రవిభవన్ కాటేజీలో మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత షా నాగ్‌పూర్ రావడం ఇది రెండోసారి. ఈనెల మూడోవారంలో నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన ‘ప్రతినిధి సభ’ కూడా జరగనుంది.