సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.
రిజర్వేషన్లను ఆర్‌ఎస్‌స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్‌ఎస్‌ఎస్‌పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment