reservation cancellation
-
Patna high court: రిజర్వేషన్ల పెంపు చెల్లదు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్‌లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి. కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు. 75 శాతానికి చేరిన రిజర్వేషన్లు బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్‌లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
వారం రోజుల పాటు.. ఈ టైంలో రైల్వే రిజర్వేషన్లు బంద్! కారణమిదే
Indian Railway Big Update: ప్రయాణం చేయాలనుకునే వారికి ముఖ్య సూచన చేసింది రైల్వేశాఖ. మెయింటెన్స్‌లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదని పేర్కొంది. టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్ఆర్ ఎంక్వైరీ, టిక్కెట్ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయి. స్పెషల్ 2020 మార్చిల లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. సుమారు ఆర్నెళ్ల తర్వాత క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరుతో కొన్ని రైళ్లను తిరిగి ప్రారంభించారు. ప్యాసింజర్ , లోకల్ రైళ్లను కూడా ప్రత్యేక రైళ్లుగానే నడుపుతూ వస్తున్నారు. దీంతో ఈ ప్రత్యేక రైళ్ల నంబర్లు మారాయి. అదే విధంగా హాల్టింగ్ స్టేషన్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు ఏడాది పాటు ఇదే విధానం కొనసాగింది. ఈ ప్రత్యేక నంబరు, స్టేషన్లు, ఛార్జీలకు తగ్గట్టుగానే రిజర్వేషన్ ప్రక్రియ నడిచింది. రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటం కరోనా ముప్పు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లకు పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రత్యేకం పేరుతో తిరుగుతున్న రైళ్లను తిరిగి రెగ్యులర్ రైళ్లుగా మారుస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి ఆశ్వినీ వైభవ్ ప్రకటించారు. అందుగు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల నంబర్లు, స్టేషన్ల హాల్టింగ్ , ఛార్జీల విషయంలో మార్పులు చేయాలి. దీనికి తగ్గట్టుగా టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పనిలో ఉంది రైల్వేశాఖ. సాఫ్ట్వేర్ అప్డేట్ టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పనులను నవంబరు 14 నుంచి 22వ తేదీల మధ్యన చేపట్టాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన తేదీల్లో ప్రతీ రోజు రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు రిజర్వేషన్ సేవలు దేశవ్యాప్తంగా నిలిపేస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్ఆర్ స్టేటస్, కరెంట్ బుకింగ్ స్టేటస్, ట్రైన్ రియల్‌టైం తదితర సేవలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 139 నంబరుకు ఫోన్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఇచ్చారు. The activity will be performed starting from the intervening night of 14 and 15-November to the night of 20 and 21-November starting at 23:30 hrs and ending at 0530 hrs. During this period, no PRS Services will be available. Read: https://t.co/8MPZw1cGXx — PIB India (@PIB_India) November 14, 2021 చదవండి: రైల్వే ప్యాసింజర్లకు గుడ్ న్యూస్.. ఇక నో ‘ కొవిడ్ స్పెషల్’ రైళ్లు, టికెట్ ధరలు సైతం తగ్గింపు! -
రిజర్వేషన్లు: 50% పరిమితి ఎలా వచ్చింది?
న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. మరాఠా సామాజిక వర్గానికి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. దీంతో మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది. 50% పరిమితి ఎలా వచ్చింది? 1979లో నాటి జనతా ప్రభుత్వం బిహార్‌కు చెందిన ఎంపీ బీపీ మండల్ నేతృత్వంలో రెండో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1980లో ఆ కమిషన్ నివేదిక వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాలకు 27%.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు 22.5%, మొత్తంగా 49.5% రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమిషన్ సిఫారసు చేసింది. దాదాపు దశాబ్దం అనంతరం ఈ కమిటీ సిఫారసులను అమలు చేస్తూ, ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఇందిర సాహ్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవకాశాల్లో అందరికీ సమానత్వం కల్పిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హామీ ఉల్లంఘనకు గురైందని వాదించారు. వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవద్దన్నారు. రిజర్వేషన్లతో ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. దాంతో, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. అనంతరం విచారణ కొనసాగింది. ఆ తరువాత, 1992 నవంబర్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను సమర్ధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. వెనుకబాటుతనాన్ని గుర్తించే ఉపకరణంగా కులాన్ని పరిగణించడాన్ని కోర్టు సమర్థించింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల హక్కులకు పరిమితి ఏర్పడింది. రిజర్వేషన్లు 50% పరిమితికి కచ్చితంగా లోబడే ఉండాలని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఓబీసీల్లోని సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించినవారు ఈ రిజర్వేషన్లకు అనర్హులని పేర్కొంది. అయితే, రిజర్వేషన్ల పరిమితి 50 శాతమే ఎందుకన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూ, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు 11 ఇండికేటర్లను తీర్పులో పేర్కొంది. దేశంలో వెనుకబడిన వర్గాల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, వారికి కల్పించిన 27% రిజర్వేషన్లు తక్కువేనన్న వాదన ఈ తీర్పు అనంతరం తెరపైకి వచ్చింది. నిజానికి, రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సహకరించే ప్రత్యేక నిబంధనలను రాష్ట్రాలు రూపొందించే ప్రక్రియను అడ్డుకునే అంశాలేవీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 లేదా ఆర్టికల్ 29 క్లాజ్ 2లో కానీ లేవు’అని పేర్కొన్నారు. చదవండి: Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్ చెల్లదు -
Supreme Court of India: మరాఠాలకు రిజర్వేషన్ చెల్లదు
న్యూఢిల్లీ: మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వపు హక్కును ఇది ఉల్లఘింస్తోందని పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సర్వోన్నత న్యాయస్థానం 1992లో ఇచ్చిన మండల్ తీర్పు (ఇందిరా సాహ్నీ కేసులో)ను పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ పరిమితిని పునఃసమీక్షించడానికి విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. రిజర్వేషన్లపై పరిమితి సబబేనని పలుమార్లు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తుచేసింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఏకగ్రీవంగా అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ కోటాను కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లు సభ్యులుగా ఉన్నారు. మరాఠాలకు ప్రత్యేక కోటాతో 50 శాతాన్ని దాటేసి.. రిజర్వేషన్లు చాలా ఎక్కువ అవుతున్నాయనేది పిటిషనర్ల ప్రధాన అభ్యంతరం. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తూ 2018 నవంబరు 30న మహారాష్ట్రలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ)కు రిజర్వేషన్ల చట్టాన్ని చేసింది. బాంబే హైకోర్టు 2019 జూన్‌లో ఈ చట్టాన్ని సమర్థించింది. అయితే 16 శాతం కోటా సమర్థనీయం కాదని.. ఉద్యోగాల్లో 12 శాతం, విద్యాసంస్థల ప్రవేశాల్లో 13 శాతం సరిపోతుందని తేల్చింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. సరైన భూమిక లేదు ఎంసీ గైక్వాడ్ కమిషన్ సిఫారసుల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించింది. అయితే మరాఠాలకు ప్రత్యేక కోటాను ఇవ్వడానికి అవసరమైన అసాధారణ పరిస్థితులేమిటో గైక్వాడ్ కమిషన్ ఎత్తిచూపలేకపోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటపుడు రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని అతిక్రమించడానికి సరైన భూమిక లేనట్లేనని పేర్కొంది. మహారాష్ట్ర తెచ్చిన చట్టం సమానత్వానికి భంగకరమని తెలిపింది. అయితే ఈ చట్టం ఆధారంగా మరాఠాలకు (2020 సెప్టెంబర్‌లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించే వరకు) మెడికల్ పీజీల్లో కేటాయించిన సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిపిన నియామకాలకు బుధవారం వెలువరించిన తీర్పుతో ఎలాంటి విఘాతం కలగకూడదని తెలిపింది. అంటే లబ్ధిదారులకు ఇబ్బంది ఉండదు, వారి ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు చెల్లుబాటు అవుతాయి. ఇకపై మాత్రం మరాఠాలకు కోటా ఉండదు. రాష్ట్రాలకు కొత్త కులాలను చేర్చే అధికారం లేదు పార్లమెంటు చేసిన 102వ రాజ్యాంగ సవరణ పర్యవసానంగా... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్తగా ఏ కులాన్నైనా చేర్చే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘రాష్ట్రాలు అలాంటి కులాలను గుర్తించి కేంద్రానికి సిఫారసు మాత్రమే చేయగలవు. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రపతి మాత్రమే ఏ కులాన్నైనా ఎస్ఈబీసీ జాబితాలో చేర్చగలరు. నోటిఫై చేయగలరు’ అని పేర్కొంది. 102వ సవరణ రాజ్యాంగబద్ధతను అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఈ సవరణ సమాఖ్య వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడం లేదని పేర్కొంది. కొత్త ఎస్ఈబీసీ కులాల జాబితాను నోటిఫై చేయాలని... అప్పటిదాకా పాత జాబితానే అమలులో ఉంటుందని పేర్కొంది. 2018లో చేసిన 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338బి, 342ఏ ఆర్టికల్స్‌ను చేర్చారు. ‘338బి’లో జాతీయ బీసీ కమిషన్ నిర్మాణం, విధులు, అధికారాలను నిర్వచించారు. ‘342ఏ’లో ఏదైనా కులాన్ని ఎస్ఈబీసీ జాబితాలో చేర్చడానికి (నోటిఫై చేయడానికి) రాష్ట్రపతికి ఉన్న అధికారాలను, ఎస్ఈబీసీ జాబితాను మార్చడానికి పార్లమెంటుకున్న అధికారాలను వివరించారు. పలు రాష్ట్రాలు పరిమితిని సడలించాలని కోరినా... రిజర్వేషన్లపై పరిమితిని పునఃసమీక్షించాల్సిన అవసరంపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ ఇదివరకే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 50 శాతం పరిమితిని సడలించాలని, తమ రాష్ట్రాల్లో ఆయా సామాజికవర్గాల సంఖ్య ఆధారంగా కొన్ని కులాలకు, వర్గాలకు రిజర్వేషన్లను కల్పించుకునే వెసులుబాటు తమకు ఉండాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించవచ్చని, మరాఠాలకు కోటా సబబేనని, రాజ్యాంగబద్ధమని కేంద్ర ప్రభుత్వం కూడా వాదించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘మీరు సూచిస్తున్నట్లుగా 50 శాతం పరిమితి లేకపోతే సమానత్వమనే భావనకు విలువేముంది? మేమది చూడాలి. దీనిపై మీరేమంటారు? ఇలా పరిమితి దాటి రిజర్వేషన్లు కల్పిస్తే ఫలితంగా తలెత్తే అసమానతల మాటేమిటి? రిజర్వేషన్లను ఇంకా ఎన్ని తరాలు కొనసాగిస్తారు? అని ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. మొత్తానికి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పరిమితిని విధిస్తూ 1992లో సుప్రీంకోర్టు వెలువరించిన మండల్ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని బుధవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని మార్చాలంటే సమానత్వపు భావనపై నిర్మితమైన సమాజం కాకుండా... కుల పాలిత సమాజం అయ్యుండాలి. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటితే అది తీవ్ర విపరిమాణాలకు దారితీసే చర్యే అవుతుంది. ఆపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రిజర్వేషన్లను తగ్గించడం దుస్సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో పొందుపర్చిన సమానత్వపు హక్కును మహారాష్ట్ర చట్టం (ఎంఎస్‌ఈబీసీ యాక్ట్–2018) విస్పష్టంగా ఉల్లంఘిస్తోంది. అసాధారణ పరిస్థితులు లేకుండా 50 శాతం పరిమితిని దాటడం ఆర్టికల్ 14, ఆర్టికల్ 16ల ఉల్లంఘనే కాబట్టి రాజ్యాంగబద్ధం కాదు 102వ రాజ్యాంగ సవరణ.. తమ ప్రాదేశిక పరిధిలోని వెనుకబడిన తరగతులను గుర్తించి, వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసివేసింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 366 (26సి), 342ఏ చేర్చడంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలను (ఎస్ఈబీసీ) గుర్తించే, నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి ఒక్కడికి మాత్రమే దఖలు పడింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ అధికారం రాష్ట్రపతికే ఉన్నట్లుగా భావించాలి. ఎస్ఈబీసీ జాబితాలో ఏవైనా కులాలను చేర్చాలన్నా, తొలగించాలన్నా... ప్రస్తుత ఉన్న వ్యవస్థల ద్వారా లేదా చట్టబద్ధమైన కమిషన్ల ద్వారా రాష్ట్రాలు ఆ మేరకు రాష్ట్రపతికి సూచనలు మాత్రమే చేయగలవు. వెనుకబడిన తరగతులను గుర్తించే, వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తొలగించిన ఆర్టికల్ 342ఏ సమాఖ్య వ్యవస్థకు భంగకరం కాదు. ప్రతికూల ప్రభావం చూపదు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదు 3–2 మెజారిటీ తీర్పులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రం జోక్యం చేసుకోవాలి మరాఠాల రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో కలుగజేసుకోవాలి. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, షాబానో వంటి కేసుల విషయంలో చూపించిన వేగాన్ని ఇందులోనూ చూపించాలి. మరాఠాల కోటాపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్ర ప్రజలు సహనం కోల్పోకుండా శాంతియుతంగా వ్యవహరించాలి – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలి విద్య, ఉద్యోగాల్లో మరాఠాల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయానికి శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎంపీ గైక్వాడ్ కమిషన్ నివేదిక విషయంలో న్యాయస్థానాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ప్రభుత్వం తరపున న్యాయవాదులు సమర్థంగా వాదనలు వినిపించలేకపోయారు. కోర్టు నిర్ణయం మాకు అసంతృప్తి కలిగించింది – దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర మాజీ సీఎం -
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కాలంలో రిజర్వేషన్ చేసుకొని గడువులోగా టికెట్ రద్దు చేసుకోలేని వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారికి మరోమారు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించింది. టికెట్లకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య రిజర్వేషన్ చేసుకున్న వారికి సైతం అవకాశం కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్‌కు సంబంధించి ఓ నిర్ణీత కాల పరిమితి వరకు టికెట్ క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే లాక్డౌన్ కారణంగా చాలామంది తమ టికెట్లను నిర్ణీత కాలపరిమితి లోపు రద్దు చేసుకోలేకపోయారు. దీంతో వారికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా నిబంధనల్ని సవరించింది. దీని ప్రకారం ఈనెల 29 లోపు ప్రయాణికులు వారి టికెట్లను రద్దు చేసుకోవచ్చంటూ తెలిపింది. దగ్గర్లోని బస్టాండు లేదా ఎటీబీ కౌంటర్లో టికెట్ చూపించి క్యాన్సిల్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. -
ట్రయిన్ల రద్దు- ఐఆర్సీటీసీ డౌన్
రోజురోజుకీ కోవిడ్-19 కేసులు పెరుగుతూ పోతుండటంతో రైల్వే శాఖ ఆగస్ట్ 12వరకూ అన్ని రెగ్యులర్ రైళ్లనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే లాక్‌డవున్ సమయంలో ప్రకటించిన రాజధాని తదితర కొన్ని రైళ్లను మాత్రం నడపనున్నట్లు పేర్కొంది. దీంతో జూన్ 30వరకూ బుక్ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో జులై 1- ఆగస్ట్ 12వరకూ తీసుకున్న టికెట్లను సైతం రద్దు చేయడం ద్వారా రిఫండ్ ఇవ్వనున్నట్లు వివరించింది. లాక్‌డవున్ తొలి దశలో వేసిన 15 జతల రాజధాని, ఎక్స్‌ప్రెస్ ట్రయిన్లతోపాటు.. వలస కూలీల కోసం నిర్వహిస్తున్న 200 శ్రామిక్ స్పెషల్ రైళ్లను సైతం నడపనున్నట్లు వివరించింది. షేరు వీక్ రైళ్ల రద్దు నేపథ్యంలో పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్సీటీసీ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమైంది. రూ. 1340 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం నష్టంతో రూ. 1372 వద్ద ట్రేడవుతోంది. కాగా నేడు ఐఆర్సీటీసీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు విడుదల చేయనుంది. త్రైమాసిక ప్రాతిపదికన ఐఆర్సీటీసీ నికర లాభం 35 శాతం వరకూ క్షీణించవచ్చని రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ అంచనా వేస్తోంది. రూ. 134 కోట్ల స్థాయిలో నికర లాభం నమోదుకావచ్చని పేర్కొంది. ఆదాయం 17 శాతం తక్కువగా రూ. 594 కోట్లకు చేరవచ్చని అభిప్రాయపడింది. ఇబిటా మార్జిన్లు 7 శాతం నీరసించే వీలున్నట్లు అంచనా వేసింది. -
రిజర్వేషన్లు రద్దు చేయం
ఉదయ్‌పూర్, నందూర్బార్: తాను అధికారంలో ఉన్నంతవరకు రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తర మహారాష్ట్రలో నందూర్బార్లో సోమవారం ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోదీ కోటా పరిమితుల్ని దాటి తాను ఏమీ చేయనని హామీ ఇచ్చారు. ‘‘డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మోదీ అధికారంలో ఉన్నంతవరకూ వాటిని ఎవరూ ముట్టుకునే సాహసం కూడా చేయలేరు‘‘ అని అన్నారు. గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటించిన మోదీ వారి భూముల నుంచి బలవంతంగా ఖాళీ చేయించమని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అయ్యే చెరుకు నుంచి ఇథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చునని, దీని వల్ల స్థానికులకు ఉద్యోగాలు కల్పన సులభంగా జరుగుతుందని అన్నారు. కానీ కాంగ్రెస్–ఎన్సీపీ నేతలు ఆ పని చెయ్యనివ్వకుండా అడ్డుకుంటున్నారని ప్రధాని ఆరోపించారు. నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అన్నీ అందేలా జన్‌ధన్ యోజన అకౌంట్లు తెరిచి, వాటిని ఆధార్‌తో లింకప్ చేసి, మొబైల్ కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేశామని, ఈ చర్యల వల్ల కింది స్థాయిలో దళారుల జోక్యాన్ని అరికట్టి అవినీతిని నిరోధించామని మోదీ వివరించారు. యూపీఏ పిరికిపందలా వ్యవహరించింది జాతీయ భద్రత అంశంలో యూపీఏ పిరికిపందలా వ్యవహరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉగ్రవాదం పీచమణచడంలో తమ ప్రభుత్వం ధైర్యంగా ముందడుగు వేసిందని అన్నారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లా, రాజస్థాన్ ఉదయ్పూర్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సోమవారం పాల్గొన్న మోదీ శ్రీలంకలో పేలుళ్ల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం వల్లే భారత్‌లో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ‘2014కి ముందు భారత్ పరిస్థితి ఎలా ఉండేది ? బాంబు పేలుళ్లు ఒక నిత్యకృత్యంగా మారాయి. ముంబై, పుణె, హైదరాబాద్, వారణాసి, అయోధ్య, జమ్ము ఇలా ఎన్నో నగరాల్లో పేలుళ్లు జరిగాయి’ అని మోదీ గుర్తు చేశారు. అప్పట్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వం ఏం చేసేది? అచ్చంగా పాకిస్తాన్ మాదిరిగానే ఒక సంతాప సభ ఏర్పాటు చేసి , నాలుగు కన్నీటి బొట్లు రాల్చి చేతులు దులుపుకునేది‘‘ అని మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా పట్టుకోగలను సర్జికల్ స్ట్రయిక్స్‌పై సాక్ష్యాధారాలు కావాలన్న కాంగ్రెస్ నేతల డిమాండ్‌ని తిప్పికొట్టారు. విపక్షాలే దీని గురించి ప్రశ్నిస్తున్నాయి కానీ ప్రజలకు తమపై నమ్మకం ఉందన్నారు. ఈ విషయం మొదటి రెండు దశల ఓటింగ్ సరళిలోనే అర్థమైందన్నారు. తాను జాతీయ భద్రత, వంశ పరిపాలన గురించి మాట్లాడితే కొందరికి షాక్ తగులుతుందంటూ పరోక్షంగా రాహుల్‌కు చురకలు అంటించారు. -
సమతకు పట్టం కట్టిన తీర్పు
వేల ఏళ్లుగా ఊరికి అవతల శ్మశానాల్లో, పశువుల కళేబరాలతో సహజీవనం చేస్తూ, వెలివేత బతుకులు అనుభవించిన వారు అకస్మాత్తుగా తమతోపాటు కుర్చీల్లో కూర్చొని పనిచేయడాన్ని దళితేతర వర్గం సహించలేకపోతోంది. తమ కన్నా హీనకులం వాడు తన కన్నా ఉన్నత పదవిలో ఉన్నాడనే భావన రిజర్వేషన్ల వ్యతిరేకతకు పునాది అవుతోంది. ఎస్సీలు 30–40 ఏళ్ల నుంచి చదువుల్లో, ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుంటున్న వీళ్ల మీద రిజర్వేషన్ల పేరుతో ద్వేషాన్ని కలిగి ఉండటం సమాజానికి మంచిది కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ఏ ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ‘‘నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి వివిధ కోర్సుల్లో సీటు, నాకన్నా తక్కువ ప్రావీణ్యం చూపిన వారికీ, తక్కువ ప్రతిభ ఉన్నవారికీ ఉద్యోగం, అంతే కాదు నాకన్నా వెనుక ఉద్యోగంలో చేరిన వారికి ఉద్యోగంలో ప్రమోషన్– ఇది దేశానికి నష్టం. ఇలాంటివి ఉండ టం వల్లే దేశం పురోగతి సాధించటం లేదు. అందుకే రిజర్వేషన్ల అమలు అవసరం లేదు’’ అనే రిజర్వేషన్ల వ్యతిరేకుల మాటలు మనకు కొత్త కాదు. రిజర్వే షన్లను ఏ విధంగానైనా దెబ్బకొట్టాలనేవారు ఇంకా చాలా మంది మన మధ్య ఉన్నారు. ఇక రిజర్వేషన్లు కొనసాగితే తమకు కూడా అమలు చేయాలని కొన్ని ఆధిపత్య కులాలు, అభివృద్ధి చెందిన సామాజిక వర్గాలు వాదిస్తున్నాయి. ఈ వాదన క్రమంగా ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా మారిపోయింది. దానిలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు గానీ, రిజర్వేషన్లలో ప్రమోషన్లు గానీ అమలు చేయకుండా ఆందోళనలు, కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా మారిపో యింది. సమాజంలో రిజర్వేషన్లపై వ్యతిరేకతను ఇది స్పష్టం చేస్తోంది. రిజర్వేషన్లు పొందుతున్న వారిపై విద్వేషానికి, అసూయకీ ఇది తార్కాణంగా నిలు స్తోంది. కొన్ని సార్లు కోర్టులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించడం వల్ల సామాజిక అశాంతి కొంత తగ్గుతోంది. మంగళ వారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అలాంటిదే. గత కొన్నేళ్లుగా ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రక్రియ ఆగిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రమోషన్లలో రిజర్వేషన్లు కొనసాగించవచ్చనీ, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వ డానికి ఎలాంటి ఇబ్బందీ లేదనీ సుప్రీంకోర్టు ఆదే శాలు ఇచ్చింది. తదుపరి తీర్పు వచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇదే సుప్రీంకోర్టు ప్రమో షన్లలో రిజర్వేషన్లలో అవకతవకలున్నాయంటూ అందులో రిజర్వేషన్లను నిలిపివేసింది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఎస్సీలమీద పాశవిక దాడులకు కూడా రిజర్వేషన్లపై చర్చ కారణమయింది. ఓ రాష్ట్రం లోనైతే ఓ దళిత యువతి ఎస్ఐ ఉద్యోగానికి ఎంపి కయ్యాక శిక్షణ పొంది ఇంటికొచ్చినప్పుడు నీకు ఎస్ఐ ఉద్యోగం ఎందుకంటూ ఆమెను రాళ్లతో తల మీద మోది చంపేసిన దారుణ ఘటన సంచలనం సృష్టించింది. మితిమీరుతున్న సామాజిక అసహనం వేల ఏళ్లుగా ఊరికి అవతల శ్మశానాల్లో, పశువుల కళే బరాలతో సహజీవనం చేస్తూ, వెలివేత బతుకులు అనుభవించిన వారు అకస్మాత్తుగా తమతోపాటు కుర్చీల్లో కూర్చొని పనిచేయడాన్ని దళితేతర వర్గం సహించలేకపోతోంది. తమ కన్నా హీనకులం వాడు తన కన్నా ఉన్నత పదవిలో ఉన్నాడనే భావన రిజ ర్వేషన్ల వ్యతిరేకతకు పునాది అవుతోంది. ఈ విష యంపై అవగాహన కలగాలంటే మళ్లీ అంబేడ్కర్‌ను పలకరించక తప్పదు. భారత సామాజిక పరిశీలన చేసి అంటరాని కులాల పేరుతో ఊరి అవతలకి విసిరి పారేసిన కులాల పరిస్థితికి కారణం కనుక్కున్నవాడు బాబాసాహెబ్ అంబేడ్కర్. అందుకే అంబేడ్కర్ ఆలో చనను మరోసారి పరిశీలించక తప్పదు. ఇనుపకంచెకన్నా బలమైన వర్ణ విభజన భారతదేశ సమాజం వర్ణ, అవర్ణ అనే రెండు భాగాలుగా విడిపోయింది. వర్ణ విభాగంలో ద్విజులు, ద్విజులు కాని వారు అనే రెండు వర్గా లున్నాయి. వర్ణలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉండగా, ద్విజులు కాని వారిలో శూద్రు లున్నారు. అయితే ఈ విభజన కూడా నిలకడ అయిందేమీ కాదు. వర్ణలో ఉన్న మూడింటిలో విభే దాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియుల మధ్య జరిగిన యుద్ధాలే ఇందుకు నిదర్శనం. రామాయణంలో, భారతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ద్విజులకు, శూద్రులకు మ«ధ్య కూడా వైరుధ్యం ఉన్నది. దీనికి ఎన్నో చారిత్రక ఆధారా లున్నాయి. శివాజీ లాంటి మహాచక్రవర్తి ఎదుర్కొన్న వివక్ష, అవమానాలే ఇందుకు ఉదాహరణ. అవర్ణలో అంటరాని కులాలు, మైదాన ఆదివాసీ తెగలు, అడవి ఆదివాసీ తెగలుగా అంబేడ్కర్ గుర్తించారు. మైదాన ఆదివాసీలను ఆ రోజుల్లో క్రిమినల్ ట్రైబ్స్‌గా పేర్కొనే వారు. అయితే అంటరాని కులాలను, ఆదివాసీ తెగ లను విడదీసి దూరంగా ఉంచారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటరాని కులాలపై ఆదివాసీ తెగలు వివక్ష చూపుతూనే ఉంటాయి. ఆదివాసీ తెగలను సమాజంలోని వర్గ సమాజం ఎప్పుడూ కూడా తమలో భాగంగా చూడలేదు. కానీ ఆదివాసులను వర్గ సమాజం అంటరాని వారుగా చూడదు. ఈ మొత్తం సామాజిక విభజనను, పరిశీల నను గమనిస్తే అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య నున్న విభజన ఇనుప కంచెకన్నా బల మైనదనీ అంబేడ్కర్ వాదన. ఇది చర్చ జరగాల్సిన అంశం. ఈ విద్వేషం వల్లనే ఈ రోజు దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వందల మంది దళితులు హత్యకు గురవుతున్నారు. వేలాది మంది దళిత ఆడపడుచులు అత్యాచారాలకు బలవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ప్రతీచోటా అవమానాలే ఎదురవుతున్నాయి. ఇది ఈ నాటి కథ కాదు రెండు వేల ఏళ్ళుగా సాగుతున్న నరమేధం. దళితులు ఏనాడూ హింసకు, రక్తపాతా నికీ దిగలేదన్నది వాస్తవం. శాంతియుత జీవన విధానం, శత్రువునైనా క్షమించే గుణం దళితుల సొంతం. నిజానికి ఇలాంటి హింస ఏ దేశంలో జరి గినా సగం సమాజం నాశనమయ్యేది. దీనికి కూడా సామాజిక నేపథ్యం ఉంది. ప్రస్తుతం అంటరాని కులాలుగా ఉన్న చాలామంది బౌద్ధం, జైనం వారసత్వం కలిగిన వాళ్లు. అందుకే వారిలో ప్రేమ తప్ప, ద్వేషం ఉండదు. ఎవరైనా తమతో సమా నంగా గౌరవించే తత్వం దళితులకే సాధ్యమవు తుంది. సమానత్వమే బాబాసాహెబ్ తత్వం అదేరకమైన స్వభావాన్ని, విధానాన్నీ బీఆర్ అంబే డ్కర్ అందిపుచ్చుకున్నారు. ఎన్నో అవమానాలు, అణచివేతను ఎదుర్కొన్న అంబేడ్కర్ ఒకవేళ హింసా మార్గం వైపు వెళ్లి ఉంటే ఈ రోజు దేశం మధ్య ఆసి యాలాగా మండుతుండేది. అంబేడ్కర్ అమెరికాలో చదివిన చదువు ఆయనకు సామాజిక మార్పుపై ఒక శాస్త్రీయ అవగాహన కలిగించింది. అమెరికాలో ఆయన గురువు జాన్ డ్యూయి బోధించిన ప్రజా స్వామ్య దృక్పథం ఆయనకు భారతదేశ సమాజ నిర్మాణానికి మార్గదర్శకమైంది. అందువల్లనే ఆయన ప్రజాస్వామ్యంలోనే పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యమంటే కేవలం ఓటు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకోవడం మాత్రమే కాదు. సామాజిక జీవితంలో ప్రజల మధ్య ఉండే సంబం ధాల్లో కొనసాగాల్సిన సోదరత్వం ప్రజాస్వామ్యానికి పునాది. అందువల్లనే ఆయన ప్రకటించుకొన్న సమా నత్వం, స్వేచ్ఛ, సోదరత్వాల్లో ఆయన ఎక్కువగా ఆలోచించింది సోదరత్వం గురించే. అంబేడ్కర్ ప్రారంభం నుంచీ గాంధీజీ విధానాలనూ, కాంగ్రెస్ రాజకీయాలను విమర్శనాత్మకంగానే చూశారు. ఒక దశలో కాంగ్రెస్‌ను, గాంధీజీని చాలా తీవ్రపదజా లంతో విమర్శించారు. అయితే 1946లో ఏర్పాటైన రాజ్యాంగ సభలో చేరడానికి వెనకాడలేదు. అంతే కాదు రాజ్యాంగ సభలో అంబేడ్కర్ చేసిన ప్రసంగం, ఆయనకు ప్రజాస్వామ్యం, భారతదేశ ఐక్యత మీద ఎంతో విశ్వాసం ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేసింది. ఆ ప్రసంగమే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచనా కమిటీకి ఛైర్మన్‌గా ఎంపిక చేయడానికి కారణ మైంది. అప్పటి వరకు కాంగ్రెస్‌ను శత్రువుగా భావిం చినా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం పని చేసే విజ్ఞతను అంబేడ్కర్ అందిపుచ్చుకున్నారు. ఇది అంబేడ్కర్ దార్శనికతకు నిదర్శనం. ఇంకో విష యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇలాంటి దృక్పథం కేవలం అంబేడ్కర్‌కే కాదు, దళిత సమా జం మొత్తంలో ఇది నిండి ఉంది. తమను ఊరి బయటకు వెలివేసినప్పటికీ ఆ వూరి ప్రగతికోసం ప్రాణాలకు తెగించి పనిచేయడం, సమాజాభివృద్ధికి తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం దళి తులు తరాల తరబడి చేస్తూనే ఉన్నారు. వర్షాధార పంటలమీద ఆధారపడే కాలం నుంచి చెరువుల నిర్మాణం ద్వారా నికరమైన పంటల పెరుగుదలకు ప్రాణం పోశారు. చచ్చిన పశువుల చర్మాలు ఒలిచి, మురికిలో మురికిగా మారి తోలును శుభ్రం చేసి పద్దె నిమిది కులాలకు పనిముట్లను తయారు చేసిన పని తనం దళితులది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన రైల్వేల నిర్మాణం, గనుల తవ్వకం లాంటి పనుల్లో వేలాది ప్రాణాలు బలైపోయాయి. కుళ్లు కంపుకొడుతోన్న పాయిఖానాలను, చెత్తతో నిండిన వాడలను శుభ్రం చేసిన స్వచ్ఛమైన భారతీ యులు వీరే. ఇది భారత దేశంలోని దళితుల ఔదా ర్యం. వారిగొప్పతనం. అయితే గత వేల ఏళ్ళుగా భూమికీ, చదువుకూ, సంపదకూ, మంచి బట్టకూ, ఇంటికీ దళితులు దూరంగానే ఉన్నారు. కొన్ని కులాలు వందల ఏళ్ళుగా చదువులో, సంపదలో, భూమిలో నూటికి నూరుశాతం రిజర్వేషన్లు అను భవించాయి. చాలా మంది అన్నదాత పేరును కేవలం భూమి హక్కు కలిగిన భూస్వాములనే అర్థంలో ప్రస్తావిస్తున్నారు. నిజానికి పంట పండిం చింది, పండించేది కూలీలే. ఆ కూలీలు ఎవ్వరో కాదు, నూటికి నూరు పాళ్లూ దళితులే. ఇలాంటి ఎస్సీలు 30–40 ఏళ్ల నుంచి చదువుల్లో, ఉద్యోగాల్లోకి వస్తున్నారు. అయితే, ఇరవై ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యో గాలను కుదించారు. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుంటున్న వీళ్ల మీద రిజర్వేషన్ల పేరుతో ద్వేషాన్ని కలిగి ఉండటం సమాజానికి మంచిది కాదు. భారతదేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాం గాన్ని రూపొందించుకున్నాం. సమానత్వం, స్వేచ్ఛ, సోదరత్వం పునాదిగా ఎన్నో అంశాలను పొందుపరు చుకున్నాం. అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4)ఏ ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు: మల్లెపల్లి లక్ష్మయ్య , మొబైల్ : 97055 66213 -
రద్దు పేరిట దోపిడీ
మురళీనగర్‌కు చెందిన ఉదయలక్ష్మి తిరుపతి వెళ్లేందుకు తత్కాల్లో బెర్తు కోసం గత రెండు రోజులుగా తీవ్రంగా ప్రయత్నించింది. ఎట్టకేలకు శుక్రవారం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తత్కాల్ బెర్తు కన్ఫర్మ్ అయ్యింది. హమ్మయ్య.. అని ఊపిరి తీసుకుని వెంకన్న దర్శనం అయ్యిందన్నంత ఆనందర పొందారు. తీరా కుటుంబమంతా బయల్దేరి రైల్వే స్టేషన్‌కు వెళ్లగా త్రుటిలో రైలు మిస్సయ్యింది. పోనీ టికెట్ రద్దు చేసుకుని సాయంత్రం పూరీ-తిరుపతి రెలైక్కుదామనుకున్నా ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. తత్కాల్ టికెట్లకు రూపాయి కూడా రాదని చెప్పడంతో తీవ్ర నిరాశ చెందాల్సి వచ్చింది. మధురవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ కుటుంబం శుక్రవారం హైదరాబాద్ వెళ్లేందుకు రెండు మాసాల క్రితమే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఫస్టు ఏసీ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం కాంట్రాక్టర్లతో మీటింగ్ ఉందని ఓ ప్రభుత్వ శాఖ నుంచి సమాచారం వెళ్లడంతో ఆయన ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన రాకపోవడంతో కుటుంబీకులు కూడా వెళ్లలేమన్నారు. దీంతో రైలు బయల్దేరే గంట ముందు టికెట్ రద్దు చేసుకునేందుకు ప్రయత్నించగా పైసా ఇవ్వలేదు. వీరిద్దరే కాదు... టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులందరి జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి. టిక్కెట్ల రద్దు భారం ప్రయాణికులకు తడిసి మోపెడు ఆఖరి క్షణంలో రద్దు చేసుకుంటే అంతే మరి సిటీ : రైలు ప్రయాణికులపై రద్దు భారం తడిసి మోపెడవుతోంది. టికెట్లు రద్దు చేసుకుంటే భారీగా ఛార్జీలను గత రెండు రోజులుగా అమలు చేస్తుండడంతో సాధారణ ప్రయాణికులు గొల్లుమంటున్నారు. ఎవరో దళారులు చేస్తున్నారని తమ ప్రయాణాలపై భారం మోపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. దళారులను అరికట్టేందుకు ఎన్నో మార్గాలుండగా రద్దు ఛార్జీలను రెట్టింపు చేయడం వల్ల 80 శాతం మంది ప్రయాణికులు భారీగా నష్టపోతున్నారన్న అంశాన్ని తెరమీదకు తెచ్చారు. 20 శాతం మంది దళారులను వదిలించుకోవడానికి సాధారణ ప్రయాణికులను బలిపశువులను చేయడం సరికాదని పే ర్కొంటున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకొచ్చిన రై ల్వే టికెట్ రద్దు ఛార్జీల రెట్టింపుపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఛార్జీలను రద్దు చేయడం ప్రయాణికులందరికీ నష్టమేనని అభిప్రాయపడుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌తో పాటు మూడు శాటిలైట్ కౌంటర్లతో కలిపి రోజుకు 1800 నుంచి 1900 మంది రిజర్వేషన్ టికెట్లు పొందుతుంటారు. రోజుకు దాదాపు 1900 మంది తీసుకునే రిజర్వేషన్ టికెట్లతో దాదాపు 5 వేల మంది ప్రయాణికులు వివిధ రైళ్లలో రిజర్వేషన్ బెర్తులు ఆక్రమిస్తున్నారు. ఒక రోజుకు రిజర్వేషన్ టికెట్లు అమ్మ డం ద్వారా రూ. 21.67 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ ఆదాయం సమకూరుతోంది. రిజర్వేషన్ టికెట్లు రద్దు చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి చెల్లించరన్న నిబంధన అమల్లోకి వచ్చినప్పటి నుంచీ 20 శాతం మంది ప్రయాణికులు టికెట్ల రద్దు చేయడం మానేశారు. రెట్టింపు మొత్తం రద్దు నిబంధన అమల్లోకి రాని రోజుల్లో స్టేషన్‌లోని 10వ నెంబర్ బుకింగ్ కౌంటర్ నుంచే ఎక్కువ రిజర్వేషన్ టికెట్లు రద్దయ్యేవి. రెండు రోజులుగా రెగ్యులర్‌గా టికెట్లు రద్దు చేసే వారు పెద్దగా కనిపించ డం లేదని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రతి శని, ఆదివారాల్లోనే దళారులు ఎక్కువగా టికెట్లు కొని అట్టేపెట్టుకుని రైలు ఓ గంటలో బయల్దేరుతుందనగా సమయం చూసి రెట్టింపు ధరకు అమ్ముకునే వారు. అలా ఇప్పుడు ఆ టికెట్ రద్దు చేస్తే పైసా ఇవ్వడం లేదు. అందుకే దళారుల సంఖ్య కాస్త తగ్గినట్టు అంచనా వేస్తున్నారు. మరో పక్క ప్రయాణికులు మాత్రం భారీగా నష్టపోతున్నారు. సెకండ్ క్లాస్ ఏసీ టికెట్ రద్దు చేసుకుంటే గతంలో రూ. 100 ఉండేది. ఇప్పుడా మొత్తం రూ. 200కు పెంచారు. జనరల్ బోగీ ప్రయాణ టికెట్, రిజర్వేషన్, థర్డ్ ఏసీ ఇలా అన్ని బోగీల్లో రెట్టింపు చేశారు.