Indian Railway Big Update: ప్రయాణం చేయాలనుకునే వారికి ముఖ్య సూచన చేసింది రైల్వేశాఖ. మెయింటెన్స్‌లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదని పేర్కొంది. టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్ ఎంక్వైరీ, టిక్కెట్ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయి.
స్పెషల్
2020 మార్చిల లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. సుమారు ఆర్నెళ్ల తర్వాత క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరుతో కొన్ని రైళ్లను తిరిగి ప్రారంభించారు. ప్యాసింజర్ , లోకల్ రైళ్లను కూడా ప్రత్యేక రైళ్లుగానే నడుపుతూ వస్తున్నారు. దీంతో ఈ ప్రత్యేక రైళ్ల నంబర్లు మారాయి. అదే విధంగా హాల్టింగ్ స్టేషన్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు ఏడాది పాటు ఇదే విధానం కొనసాగింది. ఈ ప్రత్యేక నంబరు, స్టేషన్లు, ఛార్జీలకు తగ్గట్టుగానే రిజర్వేషన్ ప్రక్రియ నడిచింది.
రెగ్యులర్
వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటం కరోనా ముప్పు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లకు పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రత్యేకం పేరుతో తిరుగుతున్న రైళ్లను తిరిగి రెగ్యులర్ రైళ్లుగా మారుస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి ఆశ్వినీ వైభవ్ ప్రకటించారు. అందుగు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల నంబర్లు, స్టేషన్ల హాల్టింగ్ , ఛార్జీల విషయంలో మార్పులు చేయాలి. దీనికి తగ్గట్టుగా టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసే పనిలో ఉంది రైల్వేశాఖ.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పనులను నవంబరు 14 నుంచి 22వ తేదీల మధ్యన చేపట్టాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన తేదీల్లో ప్రతీ రోజు రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు రిజర్వేషన్ సేవలు దేశవ్యాప్తంగా నిలిపేస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్‌ఆర్ స్టేటస్, కరెంట్ బుకింగ్ స్టేటస్, ట్రైన్ రియల్‌టైం తదితర సేవలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 139 నంబరుకు ఫోన్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఇచ్చారు.
The activity will be performed starting from the intervening night of 14 and 15-November to the night of 20 and 21-November starting at 23:30 hrs and ending at 0530 hrs.
— PIB India (@PIB_India) November 14, 2021
During this period, no PRS Services will be available.
Read: https://t.co/8MPZw1cGXx
Comments
Please login to add a commentAdd a comment