SUJAY
-
Lok Sabha Election 2024: పవార్ వర్సెస్ పాటిల్
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ లోక్‌సభ స్థానం 2009 నుంచీ బీజేపీ కంచుకోట. అక్కడ ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, రాధాకృష్ణ విఖే–పాటిల్ కుటుంబాల మధ్య ఇక్కడ చిరకాలంగా శత్రుత్వం కొనసాగుతోంది. ఈసారి విఖే పాటిల్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ సుజయ్ మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే నీలేశ్ లంకేను ఎన్సీపీ (ఎస్పీ) తరఫున పవార్ తొలిసారి లోక్‌సభ బరిలో నిలిపారు. కుమారున్ని ఎలాగైనా గెలిపించుకోవాలని రాధాకృష్ణ, అగాడీ మద్దతుతో లంకేను గట్టెక్కించి పైచేయి సాధించాలని పవార్ పట్టుదలతో ఉన్నారు. అహ్మద్‌నగర్‌లో నేడు పోలింగ్ జరుగుతోంది. సుజయ్‌కి ఈజీ కాదుసుజయ్ ముత్తాత విఠల్‌రావు విఖే పాటిల్ దేశంలో తొలి చక్కెర సహకార కర్మాగారం స్థాపించారు. తండ్రి రాధాకృష్ణ ప్రస్తుత ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రి. 2019లో రాధాకృష్ణ బీజేపీలో చేరారు. అంతకు ముందు రెండు దశాబ్దాలు కాంగ్రెస్‌తో, అంతకుముందు శివసేనలో ఉన్నారు. 1995 నుంచి అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాధాకృష్ణ తండ్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ 8 సార్లు ఎంపీగా చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సుజయ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నేత సంగ్రామ్ జగ్తాప్‌పై భారీ మెజారిటీతో నెగ్గారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గంతో కొనసాగుతున్న సంగ్రామ్ జగ్తాప్ ఈసారి సుజయ్ కోసం ప్రచారం చేస్తుండటం విశేషం. అజిత్ నుంచి ప్రధాని మోదీ దాకా అగ్ర నేతలు కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. అయినా ఈసారి సుజయ్ విజయం అంత తేలిక కాదంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నపవార్.. నీలేశ్ లంకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్నర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ టికెట్‌పై గెలిచారు. 2023లో పార్టీ చీలిక తర్వాత అజిత్ వర్గంలోకి వెళ్లి తర్వాత శరద్ వర్గంలోకొచ్చారు. జిల్లా రాజకీయాలపై పట్టున్న ఆయన సుజయ్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలను ధనబలం, ప్రజాబలం మధ్య పోరుగా అభివరి్ణస్తున్నారు. కరోనా వేళ ఉచిత చికిత్స ప్రజల మనసు గెలుచుకుంది. సహకార నాయకుడు, కాంగ్రెస్∙మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ తదితరుల మద్దతు నీలేశ్‌కు కలిసి రానుంది. శరద్ పవార్ కూడా ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మక తీసుకుని సుడిగాలి ప్రచారం చేశారు. నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ వంటి స్థానిక సమస్యలపైనే నీలేశ్ తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
షార్ప్ ఇండియా చైర్మన్‌గా సుజయ్
న్యూఢిల్లీ: జపాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం షార్ప్ తమ భారత విభాగం చైర్మన్‌గా సుజయ్ కరమ్పురిని నియమించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచి్చందని సంస్థ తెలిపింది. డిస్ప్లే వ్యాపార విభాగానికి సారథ్యం వహిస్తూ భారత్‌లో షార్ప్ బ్రాండ్‌ను వృద్ధిలోకి తేవడం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. సొల్యూషన్స్ తయారీ, టెక్నాలజీ బదలాయింపునకు వ్యూహాత్మక భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడం తదితర బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సుజయ్ పలు కీలక హోదాల్లో పని చేశారు. -
ట్రైలర్ చాలా బాగుంది
‘‘అవలంబిక’ ట్రైలర్ చాలా బాగుంది. రాజశేఖర్ చాలా కష్టపడి ఈ సినిమాని చేశాడని తెలుస్తోంది. యువ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు’ అని నటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. సుజయ్, అర్చన (వేద) జంటగా రాజశేఖర్ (రాజ్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అవలంబిక’. శ్రీ షిరిడీ సాయి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి.శ్రీనివాస్ గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నాగబాబు విడుదల చేశారు. ‘‘ఈ సినిమాని భారీ గ్రాఫిక్స్‌తో చిత్రీకరించాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు రాజశేఖర్. ‘‘ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్‌గా ఈ చిత్రం నిర్మించాం’’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుజయ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకీ పెద్దాడ, సంగీతం: ఉదయ్ కిరణ్. -
మనిషిని దెయ్యం ప్రేమిస్తే...
‘‘ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడం చాలా కష్టంగా మారింది. వీటి మనుగడ ఉన్నప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం ఓ ప్రత్యేక చానల్‌ను ఏర్పాటు చేస్తోంది. శాటిలైట్ రైట్స్ వైజ్‌గా చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశం’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘నాకు మనసున్నది’. రాజశేఖర్ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై నాన్చేరి దేవా శంకర్‌గౌడ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒక దెయ్యం మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికర కథాంశంతో సాగే సినిమా ఇది. సినిమా పూర్తయి చాలా రోజులవుతున్నా విడుదల పెద్ద టెన్షన్‌గా మారింది. నిర్మాత సాయి వెంకట్‌గారు, ప్రతానిగారు, డైరెక్టర్ సిరాజ్ సపోర్ట్‌తో ఈ నెల 20న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు చిత్ర నిర్మాత శంకర్ గౌడ్. నిర్మాత సాయి వెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్ శంకర్, కెమెరా: వెంకీ పెద్దాడ. -
కథ బాగుంటే విజయమే
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త జనరేషన్ అవసరం. పూరి జగన్నాథ్, గుణశేఖర్‌లాంటి వాళ్లు విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చినవారే. ‘ప్రేమాంజలి’ చిత్రదర్శకుడు వరుణ్‌ది కూడా నర్సీపట్నం కావడం విశేషం. టీజర్ చూస్తే మెసేజ్ ఉన్న సినిమాలా ఉంది. హిట్ అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సుజయ్, శ్వేతానీల్ జంటగా వరుణ్ దొర దర్శకత్వంలో మహాలక్ష్మి సమర్పణలో ఆర్.వి. నారాయణ రావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమాంజలి’. గోవర్ధన్ సంగీతం అందించారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ బిగ్ సీడీ, దర్శకుడు సాగర్ పాటల సీడీ, తమ్మారెడ్డి టీజర్ రిలీజ్ చేశారు. ‘‘చిన్న సినిమాలు రావడం వల్లే ఇండస్ట్రీలో కొత్త కథలు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్ ఉంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు మల్కాపురం శివకుమార్. ‘‘ఎటువంటి అవగాహన లేని చిన్న పిల్లలు ప్రేమలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని పేపర్స్‌లో, టీవీల్లో వచ్చే వార్తలు నన్ను ప్రభావితం చేశాయి. అలాంటివాళ్లకు మెసేజ్ ఇవ్వాలని ఈ సినిమా తీశా’’ అన్నారు వరుణ్ దొర. సహ నిర్మాత కె.వి. ప్రసాద్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: రాజ్ నజీర్. -
మనుషులను ప్రేమించే దెయ్యం
సుజయ్, తనిష్క, చంద్రకాంత్, రష్మీ, సోని ముఖ్యతారలుగా రాజశేఖర్ దర్శకత్వంలో దేవశంకర్ గౌడ్ నిర్మింంచిన సినిమా ‘నాకూ మనసున్నది’. ఉదయ్‌కిరణ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ సిన్మా విజయవంతమై నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దెయ్యం మనుషుల్ని ప్రేమించడమనేది కొత్త కాన్సెప్ట్. ట్రైలర్ బాగుంది’’ అన్నారు సాయి వెంకట్. నటి కవిత, నటుడు బానుచందర్, నిర్మాత టి. రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పెద్దాడ వెంకట రమణ. -
మూఢ నమ్మకాల నేపథ్యంలో...
‘పంచమి’ చిత్రదర్శకురాలు సుజాత భౌర్య దర్శకత్వంలో మరో సినిమా ఆరంభమైంది. హర్షవర్ధన్, సుజయ్, వేణు, శాంతి మహరాజ్, మమతా కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై చల్లా విజయ్‌కుమార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సిరాజ్ క్లాప్ ఇచ్చారు. దర్శకురాలు మాట్లాడుతూ– ‘‘దర్శకురాలిగా నాకిది మూడవ చిత్రం. కామెడీ, హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. మూఢ నమ్మకాలను ఆధారం చేసుకుని కథ సిద్ధం చేశా. ఇందులో బాలిక పాత్ర హైలెట్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘కథ వినగానే ఎగై్జట్ అయ్యా. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా’’ అన్నారు నిర్మాత విజయ్ కుమార్. తనికెళ్ల భరణి, జయసుధ, ఉత్తేజ్, జీవా, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నందర్ కృష్ణ, సంగీతం: శ్రీ కోటి. -
అనామిక అడ్రస్ ఏదంటే...!
ఆ సీన్ - ఈ సీన్ ‘అనామిక’... నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ సినిమా ‘కహానీ’కి రీమేక్. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో, సుజయ్‌ఘోష్ దర్శకత్వంలో రూపొంది సంచలన విజయం సాధించి, జాతీయస్థాయిలో ప్రశంసలు పొందిన సినిమా ‘కహానీ’. జాతీయ అవార్డులను కూడా పొందిన ఈ సినిమాను మంచి సినిమాగా ఎంచి, తెలుగులో రీమేక్ చేశారు. అందుకు అధికారికంగా రైట్స్ తీసుకున్నారు. కానీ ఆ రైట్స్ ఇచ్చే హక్కు ‘కహానీ’ దర్శక నిర్మాతలకు ఉందా అన్నదే సందేహం! ఎందుకంటే, ఈ సినిమా కథ సుజయ్ సొంతగా సృజించింది కాదని.. కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ‘కహానీ’ తెరకెక్కిందని క్రిటిక్స్ అంటారు. ఆ వివరాలను విపులంగా చెప్పాలంటే... రెండు సినిమాలను పరిచయం చేయాలి. ఒకటి 2007లో విడుదల అయిన హాలీవుడ్ సినిమా ‘ఎ మైటీ హార్ట్’. రెండోది అంతకన్నా ముందు, అంటే 2004లో వచ్చిన ‘టేకింగ్ లైవ్స్’. ఒక గర్భవతి... అమెరికా నుంచి ఇండియా వచ్చి, తన భర్త భారతదేశానికి వచ్చి మిస్ అయ్యాడంటూ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చిన అతడి జాడ తెలియడం లేదంటూ ఆవేదన చెందుతుంది. అయితే దాన్నొక సాధారణ కంప్లైంట్‌గా భావించిన పోలీ సులు అంతగా పట్టించుకోరు. కానీ ఒక పోలీసాఫీసర్ మాత్రం చొరవ చూపిస్తాడు. ఆమె భర్తను వెదికిపెట్టడంలో ఆమెకు సాయంగా నిలుస్తాడు. తర్వాత ఎన్నో మలుపులు! ఈ కథ వింటుంటే.. అనామిక సినిమా, దాని మూలం అయిన కహానీ గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి ఈ నేపథ్యం అంతా ‘ఎ మైటీ హార్ట్’ సినిమాది. ఏంజెలీనా జోలీ ప్రధాన పాత్రలో నటించింది. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన తన భర్త పాకిస్తాన్లో మిస్ కావడంతో అమెరికా నుంచి కరాచీ వెళ్తుందామె. అక్కడ తన పరిస్థితి గురించి వివరిస్తే పోలీసులు పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక పోలీసాఫీసర్ మాత్రం ఆమెకు అండగా నిలుస్తాడు. తీవ్రవాదం పేరుకు పోయిన పాకిస్తాన్‌లోని ఆ నగరంలో తన భర్తను వెదికేటప్పుడు ఏంజెలీనాకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా సినిమా. ఇండియన్ వెర్షన్లో కేవలం నేపథ్యమే మార్పు. హాలీవుడ్ సినిమా కరాచీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగితే, హిందీ వెర్షన్ కోల్‌కతాలో, తెలుగు వెర్షన్ హైదరాబాద్‌లో నడుస్తుంది. ఇది తప్ప పెద్ద తేడా ఏమీ ఉండదు ఆ హాలీవుడ్ సినిమాకి, మన సినిమాలకి. ఇంత స్పష్టంగా అదే నేపథ్యం కనిపిస్తూ ఉండటం వల్లే ‘కహానీ’ రచయిత, దర్శకుడు సుజయ్ ఘోష్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన వాటిని తేలికగా తీసుకున్నాడు. ‘ఎ మైటీ హార్ట్’ సినిమా పేరును విన్నాను కానీ దాన్ని చూడలేదని, కాబట్టి తాను కాపీ కొట్టాననే ఆరోపణల్లో వాస్తవమే లేదని ఆయన తేల్చేశాడు. సరే... మూలకథ అలా పెడదాం. మరి సినిమాకు ప్రాణం అయిన క్లయిమాక్స్ ట్విస్టు సంగతేంటి! దాని విషయంలో కూడా ‘కహానీ’కి మరో సినిమాతో పెద్ద పోలిక ఉంది. ‘కహానీ’ సినిమా పూర్తవుతుండగా విద్యాబాలన్ పాత్ర ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని రివీల్ చేశాడు ఘోష్. ఆటవికమైన మగాళ్ల ఆకలి చూపుల నుంచి త ప్పించుకోవడానికి, తన మీద ఎవరికీ అనుమానం రాకుండా సానుభూతి కలిగేందుకే ఆమె గర్భిణిగా నటించిందన్న విషయాన్ని క్లైమాక్స్‌లో ట్విస్టులా చూపించి ప్రశంసలు దక్కించు కున్నాడు ఘోష్. కానీ ఈ ట్విస్ట్ ‘టేకింగ్ లైవ్స్’ అనే హాలీవుడ్ సినిమాలో ఉంది. ఆ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లో కూడా ప్రధాన పాత్రధారిణి సినిమా చివరి వరకూ ప్రెగ్నెంట్‌గా కనిపిస్తుంది. చిట్ట చివర్లో అది అబద్ధమనే విషయాన్ని రివీల్ చేస్తుంది. కానీ ఆ చిత్రం కూడా తాను అస్సలు చూడలేదంటాడు ఘోష్. తన సినిమాలో ఐడెంటికల్ సీన్స్, ట్విస్ట్స్ ఉంటే... అవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవే తప్ప మరోటి కాదని వాదిస్తాడు. ఎంత బల్లగుద్ది చెప్పినప్పటికీ... ఘోష్ మాటలు నమ్మబుల్యేనా అంటే ఊ అని అనలేం. ఎందుకంటే నేపథ్య మంతా ఒకటే. ముఖ్యమైన సీన్లూ ఎక్క డెక్కడో ఉన్నవే. మరి ‘కహానీ’ని ఘోష్ సృజన అని ఎలా అనగలం! అనలేం. కాబట్టి, మన ‘అనామిక’ అడ్రస్ బాలీవుడ్ కాదు, హాలీవుడ్ అనే ఒప్పుకోవాలి. - బి.జీవన్‌రెడ్డి