మనుషులను ప్రేమించే దెయ్యం | The songs of 'Naku Manasunnadhi' are released in Hyderabad | Sakshi
Sakshi News home page

మనుషులను ప్రేమించే దెయ్యం

Published Mon, Aug 21 2017 12:31 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

మనుషులను ప్రేమించే దెయ్యం

మనుషులను ప్రేమించే దెయ్యం

సుజయ్, తనిష్క, చంద్రకాంత్, రష్మీ, సోని ముఖ్యతారలుగా రాజశేఖర్‌ దర్శకత్వంలో దేవశంకర్‌ గౌడ్‌ నిర్మింంచిన సినిమా ‘నాకూ మనసున్నది’. ఉదయ్‌కిరణ్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ సిన్మా విజయవంతమై నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దెయ్యం మనుషుల్ని ప్రేమించడమనేది కొత్త కాన్సెప్ట్‌. ట్రైలర్‌ బాగుంది’’ అన్నారు సాయి వెంకట్‌. నటి కవిత, నటుడు బానుచందర్, నిర్మాత టి. రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పెద్దాడ వెంకట రమణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement