Tanishka
-
నాన్నకు ప్రేమతో...కూతురు
కరోనాతో కన్నుమూసిన తండ్రి కల నెరవేర్చడానికి 13 ఏళ్ల తనిష్క బిఎ ఎల్‌ఎల్‌బిలో చేరాలనుకుంది. అయితే, అందుకు పర్మిషన్ లభించకపోవడంతో బిఎ సైకాలజీలో చేరింది. 12 ఏళ్ల వయసులో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 11 ఏళ్ల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ఎనిమిదేళ్ల వరకు స్కూల్‌కు వెళ్లిన తనిష్క ఆ తర్వాత ఇంటి నుంచే చదువు కొనసాగించింది. చిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ తండ్రి కలను నెరవేర్చాలనుకుంటోంది తనిష్క. స్కూల్ ఏజ్‌లో డిగ్రీ స్థాయి చదువులతో బిజీగా ఉన్న తనిష్క మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఏరోడ్రోమ్ ప్రాంతంలో నివసిస్తోంది. 13 ఏళ్ల వయసు. స్కూల్ చదువు కూడా పూర్తి కాని ఈ అమ్మాయి ఇప్పుడు బి.ఎ సైకాలజీ చేస్తోంది. తండ్రి కల నెరవేర్చాలనే లక్ష్యంగా బిఎ ఎల్ఎల్బి కోసం అనుమతి కోరింది. కానీ, చిన్న వయసు అనే కారణంగా ఇంకా అనుమతి లభించలేదు. దీంతో బిఎ సైకాలజీలో చేరింది. ఈ డిగ్రీ పూర్తి చేశాక, ఎల్ఎల్బి చేస్తానంటోంది తనిష్క. -
మనిషిని దెయ్యం ప్రేమిస్తే...
‘‘ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడం చాలా కష్టంగా మారింది. వీటి మనుగడ ఉన్నప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం ఓ ప్రత్యేక చానల్‌ను ఏర్పాటు చేస్తోంది. శాటిలైట్ రైట్స్ వైజ్‌గా చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశం’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘నాకు మనసున్నది’. రాజశేఖర్ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై నాన్చేరి దేవా శంకర్‌గౌడ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒక దెయ్యం మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికర కథాంశంతో సాగే సినిమా ఇది. సినిమా పూర్తయి చాలా రోజులవుతున్నా విడుదల పెద్ద టెన్షన్‌గా మారింది. నిర్మాత సాయి వెంకట్‌గారు, ప్రతానిగారు, డైరెక్టర్ సిరాజ్ సపోర్ట్‌తో ఈ నెల 20న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు చిత్ర నిర్మాత శంకర్ గౌడ్. నిర్మాత సాయి వెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్ శంకర్, కెమెరా: వెంకీ పెద్దాడ. -
మనుషులను ప్రేమించే దెయ్యం
సుజయ్, తనిష్క, చంద్రకాంత్, రష్మీ, సోని ముఖ్యతారలుగా రాజశేఖర్ దర్శకత్వంలో దేవశంకర్ గౌడ్ నిర్మింంచిన సినిమా ‘నాకూ మనసున్నది’. ఉదయ్‌కిరణ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ సిన్మా విజయవంతమై నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దెయ్యం మనుషుల్ని ప్రేమించడమనేది కొత్త కాన్సెప్ట్. ట్రైలర్ బాగుంది’’ అన్నారు సాయి వెంకట్. నటి కవిత, నటుడు బానుచందర్, నిర్మాత టి. రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పెద్దాడ వెంకట రమణ. -
ఆద్యంతం ఉత్కంఠభరితం
థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క, విజయ్ ఇందులో ప్రధాన పాత్రధారులు. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎమ్.ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠకు లోనుచేసే సినిమా ఇది. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు’’ అన్నారు. సినిమా అంటే ఇష్టంతో ఈ రంగంలోకొచ్చానని, తన మనసుకు ఎంతో నచ్చిన కథాంశమిదని నిర్మాత తెలిపారు. వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశమిదని నటుడు విజయ్ చెప్పారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: సంజీవరాణి. -
చేతబడుల నేపథ్యంలో...
సంజయ్, తనిష్క జంటగా రూపొందిన చిత్రం ‘కట్ చేస్తే’. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎం. ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత చెప్పారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోందని, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. చేతబడి, బాణామతి నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రం ఇదని దర్శ కుడు చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: సంజీవరాణి. -
ప్రేమించాక ఆలోచించకు!
ప్రేమించడానికి తొందరపడకు.. ప్రేమించాక ఆలోచించకు అనే కాన్సెప్ట్‌తో రూపొందిన తమిళ చిత్రం ‘ఉళ్లమ్’. ప్రియమణి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని బేబి జ్వోషిక సీహెచ్ సమర్పణలో బేబి తనిష్కా సీహెచ్ ఈ చిత్రాన్ని ‘సఖుడు’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. హైదరాబాద్‌లో అనువాద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు అరుణ్మూర్తి మాట్లాడుతూ -‘‘తండ్రి మాటలను గౌరవిస్తూనే తన ఆత్మాభిమానాన్ని కాపాడుకునే యువతి పాత్రను ఇందులో ప్రియమణి చేశారు. ఇదో సెన్సిటివ్ లవ్‌స్టోరి. ప్రేమ విషయంలో యువత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆ నిర్ణయాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నారా? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఆరు పాటలకు యువన్‌శంకర్ రాజా అద్భుతమైన స్వరాలిచ్చారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: దామోదరన్. -
కట్ చేస్తే... ఏం జరుగుతుంది?
మాటల రచయిత పడాల శివసుబ్రమణ్యం దర్శకునిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క జంటగా నటిస్తున్నారు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. 90 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, హారర్ మేళవించిన యువతరం చిత్రమిది. అనుకున్న దానికంటే సినిమా బాగా వస్తోంది. ఖర్చుకు వెనకాడకుండా చాలా లావిష్‌గా నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’’అని చెప్పారు. చెప్పినదానికంటే గొప్పగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, హైదరాబాద్‌లో ఓ పాటను, పాపికొండల నేపథ్యంలో మరో పాటను చిత్రీకరించనున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, కెమెరా: అమర్‌కుమార్, కూర్పు: బసవ పైడిరెడ్డి, కళ: డి.వై.సత్యనారాయణ. -
శివసుబ్రమణ్యం దర్శకునిగా 'కట్ చేస్తే'
మాటల రచయిత శివసుబ్రమణ్యం దర్శకునిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క జంటగా నటిస్తున్నారు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, హారర్ మేళవించిన యువతరం చిత్రమిది. హీరో, హీరో మిత్రబృందం నేపథ్యంలో ఫైట్ మాస్టర్ నందు ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. భారీ ఛేజింగ్‌లతో ఈ పోరాటం సాగుతుంది. యూనిట్ అద్భుతంగా సహకరిస్తున్నారు. అనుకున్నదానికంటే సినిమా బాగా వస్తోంది. 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఇలాంటి భిన్నమైన కథాంశంతో ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదని కచ్చితంగా చెప్పగలను’’అని చెప్పారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ పాట, పాపి కొండల నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నామని నిర్మాత తెలిపారు. -
పడాల దర్శకత్వంలో ‘కట్ చేస్తే’
మెగాఫోన్ చేతబట్టిన రచయితల జాబితాలో పడాల శివసుబ్రహ్మణ్యం కూడా చేరారు. గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపు, లక్కీ, యాక్షన్ 3డి చిత్రాలకు రచయితగా పనిచేసిన పడాల ‘కట్ చేస్తే’ సినిమాతో దర్శకునిగా మారారు. సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎస్.కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యూత్‌ఫుల్ హారర్ లవ్ ఎంటర్టై నర్ ఇది. కాలేజ్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటికి 50 శాతం షూటింగ్ పూర్తయింది. రెండో షెడ్యూలు బ్యాంకాక్, మలేసియాల్లో చేస్తాం’’ అని తెలిపారు. కృష్ణ భగవాన్, జీవా, చిట్టిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, కెమెరా: అమర్‌కుమార్. -
ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’
సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’. విజయ్, సుభాష్, జీవిత, మధుమిత ముఖ్య తారలు. రచయిత పడాల శివసుబ్రహ్మణ్యం దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఇది హారర్, యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ వినూత్నమైన కథ’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘రెండో షెడ్యూల్‌ను బ్యాంకాక్, మలేసియాలో జరపాలనుకుంటున్నాం. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కథ చెప్పినదానికన్నా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: సంజీవరాణి.