ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’
ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’
Published Tue, Aug 13 2013 11:37 PM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’. విజయ్, సుభాష్, జీవిత, మధుమిత ముఖ్య తారలు. రచయిత పడాల శివసుబ్రహ్మణ్యం దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.
‘‘ఇది హారర్, యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్. కాలేజీ బ్యాక్డ్రాప్లో సాగే ఓ వినూత్నమైన కథ’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘రెండో షెడ్యూల్ను బ్యాంకాక్, మలేసియాలో జరపాలనుకుంటున్నాం.
క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కథ చెప్పినదానికన్నా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: సంజీవరాణి.
Advertisement
Advertisement