ఆద్యంతం ఉత్కంఠభరితం
ఆద్యంతం ఉత్కంఠభరితం
Published Mon, Feb 24 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క, విజయ్ ఇందులో ప్రధాన పాత్రధారులు. పడాల శివసుబ్రమణ్యం దర్శకుడు. ఎమ్.ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం ఉత్కంఠకు లోనుచేసే సినిమా ఇది. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు’’ అన్నారు. సినిమా అంటే ఇష్టంతో ఈ రంగంలోకొచ్చానని, తన మనసుకు ఎంతో నచ్చిన కథాంశమిదని నిర్మాత తెలిపారు. వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశమిదని నటుడు విజయ్ చెప్పారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: సంజీవరాణి.
Advertisement
Advertisement