శివసుబ్రమణ్యం దర్శకునిగా 'కట్ చేస్తే' | Love and horror movie, "Cut Chesthe" | Sakshi
Sakshi News home page

శివసుబ్రమణ్యం దర్శకునిగా 'కట్ చేస్తే'

Published Tue, Sep 17 2013 1:38 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

శివసుబ్రమణ్యం దర్శకునిగా 'కట్ చేస్తే' - Sakshi

శివసుబ్రమణ్యం దర్శకునిగా 'కట్ చేస్తే'

మాటల రచయిత శివసుబ్రమణ్యం దర్శకునిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క జంటగా నటిస్తున్నారు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, హారర్ మేళవించిన యువతరం చిత్రమిది. 
 
 హీరో, హీరో మిత్రబృందం నేపథ్యంలో ఫైట్ మాస్టర్ నందు ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. భారీ ఛేజింగ్‌లతో ఈ పోరాటం సాగుతుంది. యూనిట్ అద్భుతంగా సహకరిస్తున్నారు. అనుకున్నదానికంటే సినిమా బాగా వస్తోంది. 70 శాతం షూటింగ్ పూర్తయింది. 
 
 ఇలాంటి భిన్నమైన కథాంశంతో ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదని కచ్చితంగా చెప్పగలను’’అని చెప్పారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ పాట, పాపి కొండల నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నామని నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement