కట్ చేస్తే... ఏం జరుగుతుంది? | Cut cheste movie songs shooting in papi hills | Sakshi
Sakshi News home page

కట్ చేస్తే... ఏం జరుగుతుంది?

Published Sat, Oct 12 2013 1:33 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

కట్ చేస్తే... ఏం జరుగుతుంది? - Sakshi

కట్ చేస్తే... ఏం జరుగుతుంది?

మాటల రచయిత పడాల శివసుబ్రమణ్యం దర్శకునిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే’. సంజయ్, తనిష్క జంటగా నటిస్తున్నారు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. 90 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, హారర్ మేళవించిన యువతరం చిత్రమిది. అనుకున్న దానికంటే సినిమా బాగా వస్తోంది. ఖర్చుకు వెనకాడకుండా చాలా లావిష్‌గా నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’’అని చెప్పారు. 
 
 చెప్పినదానికంటే గొప్పగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, హైదరాబాద్‌లో ఓ పాటను, పాపికొండల నేపథ్యంలో మరో పాటను చిత్రీకరించనున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, కెమెరా: అమర్‌కుమార్, కూర్పు: బసవ పైడిరెడ్డి, కళ: డి.వై.సత్యనారాయణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement