పడాల దర్శకత్వంలో ‘కట్ చేస్తే’
పడాల దర్శకత్వంలో ‘కట్ చేస్తే’
Published Wed, Aug 28 2013 12:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
మెగాఫోన్ చేతబట్టిన రచయితల జాబితాలో పడాల శివసుబ్రహ్మణ్యం కూడా చేరారు. గోపి గోపిక గోదావరి, సరదాగా కాసేపు, లక్కీ, యాక్షన్ 3డి చిత్రాలకు రచయితగా పనిచేసిన పడాల ‘కట్ చేస్తే’ సినిమాతో దర్శకునిగా మారారు.
సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎస్.కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యూత్‌ఫుల్ హారర్ లవ్ ఎంటర్‌టై నర్ ఇది. కాలేజ్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు’’ అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటికి 50 శాతం షూటింగ్ పూర్తయింది. రెండో షెడ్యూలు బ్యాంకాక్, మలేసియాల్లో చేస్తాం’’ అని తెలిపారు. కృష్ణ భగవాన్, జీవా, చిట్టిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, కెమెరా: అమర్‌కుమార్.
Advertisement
Advertisement