ప్రేమించాక ఆలోచించకు! | priyamani's dubbing movie titled as 'sakhudu ' | Sakshi
Sakshi News home page

ప్రేమించాక ఆలోచించకు!

Published Sun, Nov 17 2013 12:19 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ప్రేమించాక ఆలోచించకు! - Sakshi

ప్రేమించాక ఆలోచించకు!

 ప్రేమించడానికి తొందరపడకు.. ప్రేమించాక ఆలోచించకు అనే కాన్సెప్ట్‌తో రూపొందిన తమిళ చిత్రం ‘ఉళ్లమ్’. ప్రియమణి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని బేబి జ్వోషిక సీహెచ్ సమర్పణలో బేబి తనిష్కా సీహెచ్ ఈ చిత్రాన్ని ‘సఖుడు’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. హైదరాబాద్‌లో అనువాద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు అరుణ్‌మూర్తి మాట్లాడుతూ -‘‘తండ్రి మాటలను గౌరవిస్తూనే తన ఆత్మాభిమానాన్ని కాపాడుకునే యువతి పాత్రను ఇందులో ప్రియమణి చేశారు. ఇదో సెన్సిటివ్ లవ్‌స్టోరి. ప్రేమ విషయంలో యువత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆ నిర్ణయాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నారా? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఆరు పాటలకు యువన్‌శంకర్ రాజా అద్భుతమైన స్వరాలిచ్చారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: దామోదరన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement